ఇవాళ ఈ న్యూస్ అయిటం చదువుతుంటే ఒక పాత సహోద్యోగి అనుభవం గుర్తొచ్చింది. గత సంవత్సరం నేను పని చేస్తున్న ప్రోజెక్టులో అతనూ ఉండేవాడు. నా పక్క సీటు. సింహళీయుడు. వయసు నలభై, నలభై అయిదు మధ్య. నాకు పరిచయమైన కొంతకాలానికి కబుర్ల మధ్యలో అన్నాడు,  ‘మన ఉపఖండం వాళ్ళకి ఒక గిఫ్టు ఉంటుంది. అదేమిటో తెలుసా?’ అని. (బ్రిటన్ లో పరిచయమయ్యే బంగ్లాదేశీయులూ, పాకిస్తాన్ వాళ్ళూ కూడా ‘మన ఆసియా వాళ్ళు’ అనో, ‘మన ఉపఖండం వాళ్ళు’ అనో అంటూ ఉంటారు.)  ఏమిటన్నాను. ‘డయాబెటీస్’ అన్నాడు. అతనికి వంశపారంపర్యంగా చిన్నతనంలోనే డయాబెటీస్ వచ్చిందిట. దానికి తోడు గుండె సమస్యలు. అప్పటికే రెండు సార్లు స్టెంటు వేయించుకున్నాడు. పెళ్ళీ, తనకంటూ ఒక కుటుంబం అంటూ ఏమీ ఉన్నట్టు లేదు.
ఒకసారి ఆఫీసులో అన్నాడు, ‘ఈ మధ్య కొంచం తేడాగా ఉంటోంది, మళ్ళీ గుండెకి టెస్టులు చేయించుకోవాలి’ అని. తరవాత టెస్టులకోసం ఒక రోజు సెలవు పెట్టాడు. కానీ ఒక వారంపాటు ఆఫీసుకి రాలేదు. వచ్చాకా ఎలా ఉన్నావని పలకరించాను. బానే ఉన్నాను అన్నాడు. తరవాత మెల్లిగా ‘చాలా అదృష్టం, బతికి బయట పడ్డాను’ అని చెప్పాడు. ఏమైందన్నాను. హాస్పిటల్లో ట్రెడ్ మిల్ టెస్టు చేస్తున్నార్ట. ఉన్నట్టుండి అతను కుప్పకూలిపోయాడట. కాసేపు అతనికి ఏమీ తెలియదు. తరవాత టీవీలో ప్రసారాల్లేకపోతే స్క్రీను మీద చుక్కలు కనిపిస్తాయే, అలా అనిపించిందిట. తరవాత కొద్ది క్షణాలు బొమ్మలు వస్తూ, పోతూ (flicker అవుతూ) కనిపించాయి. ఏమీ అర్థం కాలేదట. తరవాత చుట్టూ డాక్టర్లూ, నర్సులూ మూగిపోయి కనిపించారట. కానీ అంతా బ్లాక్ అండ్ వైట్ లో కనిపించిందిట. ఇంకొన్ని క్షణాలు పోయాకా బొమ్మలు రంగుల్లో కనిపించడం మొదలైందట.
ఇంతకీ ఏం జరిగిందంటే, ట్రెడ్ మిల్ మీద పరిగెడుతూ ఉంటే, అతని గుండె ఆగిపోయింది. డాక్టర్లు పక్కనే ఉన్నారు కాబట్టి వెంటనే షాకులూ గట్రా ఇచ్చి బతికించారు. అలా ఎందుకు జరిగిందో డాక్టర్లు కూడా చెప్పలేకపోయారట. చాలా నీరసంగా ఉండడంతో ఒక వారం రెస్టు తీసుకుని ఆఫీసుకి వచ్చాడు. అతని అనుభవం వింటే చాలా ఆశ్చర్యం వేసింది. కానీ మనిషి చాలా నిబ్బరంగా మామూలుగా ఉన్నాడు. అదే సంఘటన హాస్పిటల్లో కాకుండా ఏ రోడ్డు మీదో జరిగుంటే? తల్చుకుంటే నాకే భయం వేసింది కానీ, అతను మాత్రం పెద్దగా భయపడినట్టో, కదిలిపోయినట్టో అనిపించలేదు. కొన్ని నెలల తరవాత అతనికి మళ్ళా ఇంకో స్టెంటు వేసినట్టు గుర్తు.
ఈ మధ్య టచ్ లో లేను గానీ, అతను చాలా ఆసక్తికరమైన వ్యక్తి. అతను ఒక హాబీగా హోవర్ క్రాప్టుల్ని రిపేర్ చేస్తూ ఉంటాడు. అలాగే రిమోట్ కంట్రోల్ తో నడిచే చిన్న విమానాల్ని కూడా ఎగరేస్తూ ఉంటాడు. ఎప్పుడేనా ఇంటికి రా అవన్నీ చూపిస్తాను అన్నాడు. ఓసారి వీలు చూసుకుని ఎలా ఉన్నాడో ఫోన్ చెయ్యాలి.
రాజధాని లొ మళ్ళీ బాంబులు పేలాయి ౨౦ మంది చనిపొయారు ౧౦౦ మంది గాయపడ్డారు ఇది నిన్నటి సంగతి,అంత ముందు దేశం లొ అక్కడక్కడ బాంబులు పేలుతున్నాయి ఎంతొ మంది చనిఫొతున్నారు ఇన్నిజరుగుతున్నా ఎవరికి పట్టదు అధికారం లొ వున్నవాళ్ళకు గాని ,ప్రతిపఖా లలొ ఉన్నవళ్ళకు గాని పట్టదు అందరు బాంబు దాడి తీవ్రం గా కండించేవళ్ళేకాని ఒక్కడు కూడా గట్టిగా పట్టించుకొరు!
ఇలా మనదగ్గరే ఎందుకు జరుగుతున్నాయి,ఎవరు వీళ్ళకి మద్దతు ఇస్తున్నారు,ఇంత బరితెగించి ఎలా చేయగలుగుతున్నారు ఇవన్ని అందరికి తెలుసు కాని ఎవరుపట్టించుకొరు?
ఎందుకు పొయినవళ్ళకొసం ఒక వర్గం ఓట్లను వొదులుకొలేరుకదా!
ఇక మన ప్రధానమంత్రి ఈరొజు బాంబులు పేలాక సహనం గా ఉండాలి అని పిలుపు ! ఎంటి ఉండేది ఎందుకు ఉండాలి , ఎంతొమందిని చంపేస్తుఉంటే ఎందుకు ఊరుకొవాలి,
లిన్గు లిన్గు మంటు రెండేళ్ళు ఊపుకుంటూ ఏడవలేక నవ్వుకుంటూ తిరిగితే సరిపొతుందా , పార్లమెంటుమీద దాడి చేసినావాడిని ఇంకా ఉరితీయకుండా ఎందుకు కాలయాపన
చేస్తున్నట్టు,మన పార్లమేంటుమీద దాడి చేసిన వాడి ని శిక్శ్ఃంచక  పొతే ఉగ్రవాదులకి ఏం మేసేజ్ వెళుతుంది,అక్కడే దొ కొంపలు మునిగిపొతున్నట్టూ ఉరుకూ పరుగుల మీద
అణుఒప్పందం కుదుర్చుకొచ్హారు ఇప్పుదు ఏమైంది సరీగా సెంటర్ చేసి అందరిముందు వొగొబెట్టాడు సరి పొయిన్ది!
ప్రతిననేలా ఎక్కదొ ఉక చొట బాంబులు పేలుతున్నయి ...అయినా ఎవరికి ఎమిపట్టదు,అధికారం లికి రాగానే ఎదొ కొంపలు మునిగొపొతున్నట్టు పొటాని రద్దు చేయాల్సిన అవసరం ఎమొచ్హ్హింది,అన్నింటికి గేట్లు బార్లా తెరిచారు....
ఇప్పుడూ బయటికి వెళ్ళాలంటే భయం,తిరిగి వస్తామొ లేదొనని , నాకు ఈరొజై తె ఇంటి దగ్గరనుంచి ఒకటే ఫొన్ లు మానాన్న గారు ,మా అమ్మ గారు ఒకటే ఫొన్లు ఏమి లేదు
బయటికి ఎటూ వెళ్ళవద్దట!
నాకు ఒకటే భాధ నాదేశం లొ నేను స్వతత్రంగాతిరగటానికి నాకేంటా భాధా అని అది రాత్రి పూటకుఉడ కాదు పగలు , ఈ రాజకీయనాయకులకి రైళ్ళలొ చెంబులకి ఉండే గొలుసులగురించి
కొట్తుకొవటానికి టైంఉంటుందికాని ప్రజాసమస్యలు గురించి చర్చించటానికి టైంఉండదు!
వాళ్ళంతటికి వళ్ళూ వచ్హి చంపుకుంటూ పొతునే ఉంటారు వేళ్ళు మాత్రం కండిస్తుఉనే ఉంటారు,వీళ్ళకేం వీళ్ళు మన సొమ్ముతొ  లలొ బాగానే తిరుగుతారుమరి సామాన్యుడి పరిస్తితి
ఏంటని!
పక్కనొ డేవడొ వొచ్హి ఏక్కడొ బాంబు పెడతాడని భయపడుతూ చావాలా!ఈ స్వతంత్రదేశం లొ ప్రశాంతం గా భతకలేమా.
మనం ఇక ప్రజాస్వామ్య పద్దతిలొ పొతే లాభం లేదు వీళ్ళు మాట వినరు మనకి ఒక హిట్లర్ లాంటి నిజంత కావాలి ,ఎక్కడొడిని అక్క తొక్కితేకాని మాటవినరు,
ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు నడచినన్నాళ్ళూ ఈదేశం బాగుపడదు!
అథ వేలా సమాసన్న శైల రంధ్రానునాదినా
స్వరేణోవాచ భగవాన్ పరిభూతార్ణవ ధ్వని: ||
జానే వో రాక్షసాక్రాన్తౌ అనుభావ పరాక్రమౌ
అంగినాం తమసేవోభౌ గుణౌ ప్రథమ మధ్యమౌ ||
పై శ్లోకాలు రఘువంశంలోవి (ప్రస్తుతం నోట్లో ఆడుతున్నవి). ఎందుకో తెలీదు, ఎప్పుడూ ఇలాంటి శ్లోకాలేవో నోట్లో ఆడుతూనే ఉంటాయి - చాలామంది పాటలు హమ్ చేసినట్టుగా.  కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని కొన్ని శ్లోకాలు. చాలా ఏళ్ళుగా ఇంతే. ఒక పెన్ను, కాగితం ఎదురుగుండా ఉంటే, గుర్తొచ్చిన ఏదో ఒక శ్లోకం దానిమీద రాయకుండా ఉండలేను. ఆఫీసులో కూడా.
కొన్నేళ్ళ క్రితం నేను పనిచేసిన తెలుగు బాసు ఒకాయనకి పెద్ద సరదా ఉండేది. నేను ఎప్పుడూ ఆఫీసులో ఎక్కువ మాట్లాడేవాణ్ణి కాను. ప్రతీ వారం టీమంతా పబ్బులకి పోయేవాళ్ళం. అక్కడ ఆరెంజి జ్యూస్ తప్ప ఇంకేమీ ముట్టుకునేవాణ్ణి కాను. అందరూ గోల గోలగా మాట్లాడుతుంటే, ఏదో కొద్దిగా మాత్రమే మాట్లాడేవాణ్ణి. ఇదంతా ఆయన చూశాడు. ఆయనకి నా ఇంట్రస్టులూ, సంగతీ బాగా తెలుసనుకోండి.  అయినా ఓ రోజు నాతో అన్నాడు - ‘మురళీ, నీచేత బాగా తాగించి అప్పుడు నువ్వేం మాట్లాడతావో చూడాలని ఉంది’ అని.  ‘నేను తాగకుండానే నోట్లో సంస్కృతం ఆడుతూ ఉంటుంది, తాగితే నోట్లో ఆడుతున్న శ్లోకాలన్నీ బయటకి వచ్చేస్తాయి, అంతే’ అన్నాను. ఆయన చాలా నవ్వాడు. ‘అయితే నువ్వు తాగితే సంస్కృతం మాట్లాడతావు అన్నమాట’ అన్నాడు. (ఇంతవరకు ఆయనకి నన్ను అలా చూడాలన్న సరదా తీరలేదు అనుకోండి.)
అలాగే ఇంటర్మీడియట్ లెక్కల నోట్సంతా శ్లోకాలే ఉండేవి. ఒకసారి మా ఇంటికి మా నాన్నగారి కొలీగ్ సంస్కృతం లెక్చరర్ గారొకాయన వచ్చారు. నేను ఇంట్లో లేను. ఆయన బల్ల మీద ఉన్న నా లెక్కల నోట్సు మీద మేఘసందేశం శ్లోకాలు చూసి విపరీతంగా సంతోషించార్ట. ఇంటర్మీడియట్ తర్వాత నేను బీఎస్సీ లో చేరాను. అది నాకు చాలా బాడ్ టైము. ఫస్టియర్ పరిక్షలకి చదవలేదు. రాయదల్చుకోలేదు. (సెప్టెంబరుకి రాసి పాసయ్యాను లెండి). అప్పట్లో నాకు కెమిస్ట్రీ అంటే కోపం. కెమిస్ట్రీ పరిక్షకి వెళ్ళాను. పేపరంతా నాకు వచ్చిన శ్లోకాలన్ని ఇంగ్లీషు లిపిలో రాస్తూ కూర్చున్నాను. రెండు, మూడు ఎడిషనల్స్ కూడా తీసుకున్నాను. ఇన్విజిలేటర్ ఎవరంటే, నాకు అంతకు ముందు సంవత్సరం ఇంటర్మీడియట్ లో పాఠాలు చెప్పినాయన. ఇంటర్ లో నేను బ్యాడ్ స్టూడెంటుని కాదు కాబట్టి, మురళీ ఎడిషనల్స్ కూడా తీసుకుని పేపరు ఇరగదీసేస్తున్నాడు కాబోలు అని ఆయన అనుకున్నాడు. నేను మొత్తం పేపరంతా రాసేసి ఆయనకి ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఏం రాశాడో చూద్దామని ఆయన నా పేపరు చూసి మూర్ఛ పోయాడు. మొత్తం ఊళ్ళో అడిగినవాళ్ళకీ, అడగని వాళ్ళకీ పిలిచి మరీ చెప్పాడు. మా అమ్మ పేరంటానికి వెళ్తే అక్కడ కూడా ఒకళ్ళిద్దరు అడిగార్ట, మీవాడు కెమిస్ట్రీ పేపర్లో సంస్కృతం రాశాట్ట కదా అని.
బీఎస్సీ అయిందనిపించాకా ఏం చెయ్యాలి అన్న మీమాంస వచ్చింది. నేను గట్టిగా తెగించి ఎమ్మే సంస్కృతం చేస్తానని నాన్నతో అన్నాను. ఎంసీయే లో సీటు రాకపోతే అలాగే చేద్దువు గాని లే అన్నారు. ఆయన మాత్రం ఏదో విధంగా నన్ను ఎంసీయేలో చేర్చేయాలని ఆలోచిస్తున్నారు. నేను ఎంసీయే ఎంట్రన్సు కోచింగ్ కి వెళ్ళి ఒక్క రోజు కూడా పుస్తకం తియ్యకుండా కాలక్షేపం చేసి, పరిక్ష మాత్రం రాసి ఇంటికి వచ్చేశా. ఆ సమయంలో నేను అనుభవించిన అంతర్మథనం, డిప్రెషన్ గురించి చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకం రాయాలి. అయినా ఆ అంతర్మథనంలో ఒక ‘మొమెంట్ ఆఫ్ క్లారిటీ’ వచ్చింది. ఈ వెధవ ఎంసీయేలో సీటు రాకపోయినా నష్టమేమీ లేదు. ఈ జీవితాన్ని సంస్కృతానికి అంకితం చేసి, పెళ్ళీ పెటాకులూ లేకుండా గడిపేద్దామని ఘట్టిగా నిర్ణయించుకున్నాను. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడని, ఏమీ చదవకపోయినా ఎంసీయేలో ఓమాదిరి రాంకొచ్చేసి, సీటొచ్చేసింది. మళ్ళా సంస్కృతంలో కృషి చెయ్యడానికి అవకాశం చిక్కలేదు. మరి భవిష్యత్తులో ఏమైనా చెయ్యగలనేమో చూడాలి.
ఏమైనా దేవుడితో చాలాకాలం నుంచీ బేరాలాడుతున్నాను. వచ్చే జన్మలోనైనా నన్ను మధ్యతరగతి లో పుట్టించకు, బాగా రిచ్చిగా పుట్టిస్తే, నాకు నచ్చిందేదో నేను చదువుకుంటాను అని.
ఇది మాఫ్రెండ్ ఒకడు కాలేజి బంక్ కొట్టి మరీ వెళ్తె జరిగిన అనుభవాన్ని నాకు పంపాడు ,
"              నేను ఈరోజు రవీంద్ర భారతి లో అణు ఒప్పందం పై చర్చ కు వెళ్ళా, మా
ప్రశ్నలకు రాహుల్ గాంధి సమాధానాలు ఇచ్హారు అన్ని ప్రశ్నలకూ ఒకటె సమాధానం.
నేను అనుకోకుండా ఎర్ర చొక్కా వేసుకొని వెళ్ళా నన్ను ప్రశ్న అడగనివ్వలేదు,
ఈ ఒప్పందం కేవలం నయకుల ప్రయొజనాల కోసం అని నా అభిప్రాయం.  గాంధీల
గొప్పతనాన్ని పొగడడమే వారి ధ్యేయం, వాళ్ళు తప్ప ఇంకెవరూ ఈ
దేశాన్నిపాలించకూడదు అని వారి ఉద్దేశం.-ఫణి కొడాలి"
ప్రచారసభ వాళ్ళ పరిక్షల్లో ఒకదానిలో లెటర్ రైటింగ్ ఉండేది. వార్తాపత్రిక ఎడిటర్ కి లెటర్ రాయమనో, హాస్టల్లో ఉండి చదువుకుంటూ నాన్నకి డబ్బు పంపమని రాయమనో పాఠాలు ఉండేవి. నేనోసారి ఇంట్లో పోస్టు కార్డు తీసుకొచ్చి, దానిమీద నాన్నకి డబ్బు పంపమని ఉత్తరం హిందీలో రాసేసి పోస్టు చేసేశా. మర్నాడు ఆయన పోస్టు తీసుకుని, హిందీలో కార్డు వచ్చిందేమిటా, నార్తు నుంచి మనకి ఎవరు రాస్తారబ్బా అని ఆశ్చర్యపడుతూ కూడబలుక్కుని ఆ ఉత్తరం చదువుకున్నారు. నేను ఒకటే నవ్వు. విషయం అర్థమయ్యాకా ఆయన నవ్వుకుంటూనే నన్ను కూకలేశారు. ఈ సంగతి తరవాత మా హిందీ టీచరు గారికి కూడా తెలిసి చాలా సంతోషించారు.
నేను మెల్లిమెల్లిగా ఒక్కో పరిక్షా పాసైపోవడం మొదలుపెట్టాను. ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్రభాష, ప్రవేశిక కూడా అయిపోయింది. అన్నీ అత్తెసరు మార్కులే. ఏదో ముక్కునపట్టి రాసెయ్యడమే. మరీ అధ్వాన్నంగా ఇంత తక్కువ మార్కుల్తో పాసవ్వడమేమిటి అని మా టీచరు గారు అడిగేవారు కాదు. పాపం చిన్నపిల్లాడు, క్లాసు పాఠాల్తో బిజీగా ఉండి కూడా ఈ పరిక్షలు పాసవుతున్నాడు, పోనీలే అని వదిలేసేవారు.
మా నాన్నగారి కొలీగ్సు కొంతమందికి నన్ను చూస్తే సరదాగా ఉండేది. నేను హిందీ ట్యూషన్ కి వెడుతూ దారిలో కనిపిస్తే నవ్వుతూ వచ్చీ రాని హిందీలో పలకరించేవారు. ఒకసారి ఒకాయన సాయంత్రం మా ఇంటికి వచ్చారు. కరెంటు పోయింది. కొవ్వొత్తులు పెట్టుకుని అందరం కబుర్లు చెప్పుకుంటున్నాం. ఆయన జోకులేస్తూ నన్ను హిందీలో మాట్లాడమన్నారు. నేను నదురూ బెదురూ లేకుండా కన్యాశుల్కంలో వెంకటేశంలా నా నోటికొచ్చిన హిందీ ముక్కలన్నీ వాగేశా. అప్పుడాయన, ‘ఒరే, నేను ఎప్పుడైనా ఉత్తరాదికి వెళ్ళాననుకో. అర్జెంటుగా ఒకటికి వచ్చిందనుకో. ఎక్కడికి వెళ్ళాలో ఏమని అడగాల్రా?’ అని అడిగారు. నేను తడుముకోకుండా ‘మూత్ర విసర్జన్ కే లియే కహా జానా హై?’ అని అడగాలండీ అని చెప్పేశా. ఆయన ఘొల్లుమని ఒకటే నవ్వు. ‘మరీ అంత గ్రాంథికంలో మాట్లాడితే ఎలాగరా?’ అన్నారు.
ప్రతీ ఆర్నెల్లకీ ఒక్కో పరిక్ష పాసవుతూ విశారద పూర్వార్థ, ఉత్తరార్థ కూడా పూర్తి చేసేశా. విశారద పూర్తయితే సర్టిఫికెట్టుతో పాటూ ఒక శాలువా కూడా పంపారు ప్రచారసభ వాళ్ళు. అప్పటికి నేనింకా తొమ్మిదోక్లాసు మొదట్లో ఉన్నాను. విశారద పాఠాలూ గట్రా చూస్తే చాలా ఎక్కువ స్టాండర్డ్ లోనే ఉండేవి. తులసీ రామాయణంలో భాగాలు, పాత నాటకాలు, కవిత్వాలు, సాహిత్య చరిత్ర, నవల్లు గట్రా గట్రా అన్నీ ఎలా మానేజ్ చేసి పాసయ్యానో తల్చుకుంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అత్తెసరు మార్కులు తెచ్చుకోడానికి ఏవో కొన్ని వ్యాసాలు మాత్రం ముక్కున పెట్టేసి రాసేసేవాణ్ణి.
నాకున్న కాస్త హిందీ జ్ఞానం పుణ్యమా అని రామాయణ్, మహాభారత్ ఇంకా కొన్ని హిందీ సీరియల్సూ చాలామటుకు అర్థం చేసుకుంటూనే చూసేవాణ్ణి. వాటిల్లో డైలాగులు మా క్లాసులో ఫ్రెండ్సు దగ్గర చెప్తూ ఉండేవాణ్ణి.
తొమ్మిదో క్లాసుకొచ్చాకా ప్రవీణ్ పరిక్షకి పాఠాలు మొదలయ్యాయి. ఇది కూడా రెండు భాగాలు- పూర్వార్థ, ఉత్తరార్థ అని. పూర్వార్థ లో పాఠాలు బీయే స్టాండర్డ్ లో ఉండేవి. ఏవేవో వ్యాసాలు, సాహిత్య చరిత్రా గట్రా, గట్రా. అవన్నీ బోరుకొట్టి చిరాకు పుట్టింది. పదోక్లాసులో హిందీ పరిక్షలు రాయద్దు అని మా టీచరుగారూ, ఇంట్లోవాళ్ళు కూడా డిసైడ్ చేసేశారు. మా టీచరు గారి ఉద్దేశ్యమేమిటంటే, తొమ్మిదో క్లాసు పూర్తయ్యి, పదికి వచ్చేసరికి ప్రవీణ్ పూర్తి చేయించేస్తే, మెల్లిగా ఏ ఇంటరో అయ్యాకా సాహిత్యరత్న పరిక్షకి కట్టిద్దామని. దానితరవాత పండిట్ ట్రైనింగైపోయి టీచరుగా సెటిలైపోవచ్చు.
నాకు మాత్రం ప్రవీణ్ పరిక్షకి పూర్తిగా విసుగొచ్చేసింది. ఈసారి ఎలాగైనా సరే ఫెయిలైపోవాలని నిశ్చయించుకున్నాను. కానీ రెండు ఆటంకాలు ఉన్నాయి. మరీ అధ్వాన్నంగా అన్ని పేపర్లలోనూ ఫెయిలైతే పరువు తక్కువ. అదొక్కటే కాదు, మా పక్క వీధిలో, వేరే కాన్వెంట్లో నా క్లాసే చదువుతున్న ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి వేరే టిచరుగారి దగ్గర హిందీ ట్యూషన్ కి వెడుతూ నాతో సమానంగా పరిక్షలు రాసి పాసైపోతూ ఉండేది. ఆ అమ్మాయి కూడా నాతోపాటు ప్రవీణ్ పూర్వార్థ పరిక్ష రాస్తోంది. నేను ఫెయిలయ్యి, ఆ అమ్మాయి పాసైతే మనకి ఇంకా పరువు తక్కువ. ఎలాగరా భగవంతుడా అనుకున్నాను. నా అదృష్టం పండి, సరిగ్గా పరిక్షల సమయంలో ఆ అమ్మాయికి ఏదో ఫంక్షనై పరిక్షలు రాయలేదు. నేను మనసులోనే ఎగిరి గంతేశాను. ‘భగవంతుడా, అన్ని పేపర్లూ పాసై, ఒక్క పేపర్లో మాత్రం కొద్ది మార్కుల తేడాతో ఫెయిలైపోయేలా చెయ్యి’ అని గట్టిగా దణ్ణం పెట్టుకుని యథాశక్తి అలాగే ఫెయిలయ్యే విధంగా పరిక్షలు రాశాను.
రిజల్టు చూస్తే ఏముంది? అన్ని పేపర్లూ పాస్. ఒక్క కష్టమైన పేపర్లో మాత్రం నాలుగైదు మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్. నేను మహా ఆనందించాను, గొడవ వదిలింది అని. రిజల్టు తెలిశాకా మా టీచరు గారి రియాక్షన్ ఇప్పటికీ నాకు గుర్తే. పాపం చాలా బాధ పడ్డారు. ‘అయ్యో, చాలా కొద్దిలో పోయిందే’ అని చాలా సార్లు అన్నారు. ఇప్పటికీ ఆ సందర్భంలో ఆవిడ పడిన బాధ తల్చుకుంటే మనసు కలుక్కుమంటుంది.
తరవాత మళ్ళీ ఎప్పుడూ హిందీ జోలికి పోలేదు. టెన్తు పాసయ్యాకా, ఇంటర్లో మా నాన్న హిందీ తీసుకోమని అన్నారు. నేను మొదట హిందీకి అప్లై చేసినా, మార్కులు బాగా వస్తాయి అని స్నేహితులు చెప్పడంతో వెంఠనే సంస్కృతానికి మారిపోయా. నా జీవితంలో నేను చేసిన ఉత్తమోత్తమమైన పనుల్లో అది ఒకటి. సంస్కృతం లెక్చరరు గారు పాఠం చాలా చాదస్తంగా ప్రతీ పదానికీ విశేషాలన్నీ విడమర్చి పాఠం చెప్పేవారు. దానితో అంతకు ముందు ఒక్క ముక్క పరిచయం లేకపోయినా నాకు సంస్కృతం ఆరోప్రాణమై కూర్చుంది. అందులో పెద్ద సాధించిందేమీ లేదుగానీ, అప్పుడు చదువుకున్న నాలుగు ముక్కలకీ, ఇప్పటికి కూడా అపారమైన ఆత్మ సంతృప్తీ, ఆనందమూ మాత్రం మిగిలినై.
ఇంటర్లో నాకు ఒకతను (వేరే ఊరినుంచి వచ్చాడు లెండి) పరిచయమయ్యాడు. వాడు హిందీ తీసుకున్నాడు. వాడిక్కూడా నాలాగే మిడి మిడి జ్ఞానమేగానీ పండితుళ్ళా కనపడేవాడు కాదు. ఓసారి వాడితో మాటల సందర్భంలో హిందీ పరిక్షల గురించి వచ్చింది. విషయం తెలిసి షాకయ్యాను. వాడు టెన్తు క్లాసులోనే సాహిత్యరత్న పాసయ్యాడట. వాడి ఫొటో పేపర్లో వేశార్ట. ఆ పేపర్ కటింగ్ కూడా తీసుకొచ్చి నాకు చూపించాడు. అన్ని పరిక్షలు ఎలా పాసయ్యావురా, అని అడిగాను. ‘పాసయ్యాం, బాబూ. ఎలా అని అడక్కు. ఏదో ముక్కునపెట్టి రాసేశాం, పాసైపోయాం, అంతే,’ అన్నాడు. అప్పుడనిపించింది, నేను సాహిత్యరత్న పాసైనా వీడి లెవెల్లోనే ఉండేవాణ్ణి అన్నమాట అని.
తరవాత పై చదువులకి హైదరాబాదు వచ్చాకా తెలిసింది, మనకి తెలిసిన హిందీ బయట ప్రపంచంలో చిల్లిగవ్వకి మారదు అని. నేను మాట్లాడితే మా ఫ్రెండ్సంతా పగలబడి నవ్వేవారు. క్షణక్షణం సినిమాలో శ్రీదేవి ఆటోవాలాతో ‘యే బహుత్ అన్యాయ్ హై’ అంటుంది. అలాగే ఉండేది నా హిందీ కూడా. దానితో మన హిందీకి కొంత కామెడీ వేల్యూ ఉంది అని అర్థమయ్యింది. అప్పట్నించీ ఎప్పుడేనా కామెడీ కోసం మాట్లాడ్డమే తప్ప హిందీ జోలికే పోను. అసలు నాకు ఆ భాష మీద ఆసక్తే లేకపోవడం వల్ల కనీసం నేర్చుకున్నది కొద్దిగా ఇంప్రువ్ చేసుకుందాం అని కూడా అనిపించదు. ఈమధ్య ఏదో టపాకి కామెంట్లు చూస్తూ రానారే గారు అన్న మాటలు చూశాను. ఆయనలాగే నాకు కూడా చిన్నతనంలో కొంచం బలవంతంగా రుద్దబడింది కాబట్టి ఇప్పటికీ ఆ భాషమీద కోపం పోలేదు.
మా ఆవిడ ఇలాంటి బాధలేమీ పడకుండానే కేవలం టీవీ చూసి హిందీ చక్కగా నేర్చుకుంది. తనకి హిందీ సినిమాలన్నా, సీరియల్సన్నా ఇష్టం. ఎప్పుడేనా బోరు కొట్టినప్పుడు కాస్త కామెడీకోసం నన్ను హిందీలో మాట్లాడమంటూ ఉంటుంది. నేను మాట్లాడుతుంటే తెగ నవ్వుతుంది. ఓసారి తను ఒక్కతీ ఇండియాకి వెళ్తోంది. బొంబాయిలో దిగి ఫ్లయిటు మారాలి. అక్కడ లగేజీకి ఎవర్నైనా హెల్పు అడగాలి అంటే ఏమని అడగను అంది, నేనేమంటానో చూద్దామని. ‘భాయీ సాబ్, భాయీ సాబ్, థోడా సహాయ్ కరో’ అని అడుగు అని చెప్పాను.
(అయిపోయింది)
ఆ హిందీ టీచరు గారికి మా అమ్మమ్మ వయసు ఉంటుంది. మా అమ్మమ్మకి ఆవిడ స్నేహితురాలు కూడా. హిందీ పండిట్ గా పని చేసి రిటైరయ్యారు. చాలా మంచావిడ. పిల్లల్ని చాలా ప్రేమగా చూసేవారు. ఆవిడ దగ్గరకి ఏడెనిమిదేళ్ళ పిల్లల దగ్గరనించీ నడివయస్కులదాకా అందరూ హిందీ నేర్చుకోడానికి వచ్చేవారు. ఎక్కువమంది మాత్రం హైస్కూలు పిల్లలు. ఆవిడ పిల్లలకి చాలా చనువు ఇచ్చేవారు. పాఠాల విషయంలో పెద్ద స్ట్రిక్టుగా, పద్ధతిగా ఉండేవారు కాదు. అదే నాకు అపకారం చేసింది.
ఆవిడని కూడా మా అమ్మమ్మలాగే ట్రీట్ చేసేవాడిని. ఆవిడ ఏదో చెప్తూ ఉండేవారు. నా కాలక్షేపం నేను చేసేస్తూ ఉండేవాడిని. ఎందుకో నాకు హిందీ మీద పెద్దగా ఆసక్తి కలగలేదు. అలా అని విముఖతా కలగలేదు. తేలికైన భాష, ఇదెంతలే అన్న భావమే ఉండేది. నేను ఊరికెనే కాలక్షేపం ఎక్కువ చేస్తున్నాను, దీనిమీద సరైన ఆసక్తి లేకుండా ఇలా రోజూ ఓ గంట వృధా చేసుకునే కంటే, ఏ ఆటలో ఆడుకుంటే ఉత్తమం అని ఆలోచించలేకపోయాను. అంత ఆలోచనకి అప్పటి నా వయసు చాలదు.
కొన్నేళ్ళ క్రితం లండన్ లో భారతీయ విద్యాభవన్ కి వెళ్ళి కొంత కాలం వేణువు నేర్చుకున్నాను. ప్రతీ ఆదివారం క్లాసు. చాలా చిన్న పిల్లలు కూడా క్లాసుకి వచ్చేవారు. అందులో ఒక తమిళుల కుర్రాడు. చాలా చిన్నవాడు. ఎనిమిది, తొమ్మిది సంవత్సరాల వయస్సు ఉంటుంది. వాణ్ణి చూస్తే, సరిగ్గా చిన్నప్పుడు నేను హిందీ ట్యూషన్ కి వెళ్ళడమే గుర్తు వచ్చేది. వాడికి నేర్చుకునేదాని మీద ఏమీ ఆసక్తి ఉన్నట్టు కనిపించదు. వాళ్ళ అమ్మా, నాన్నా పంపిస్తున్నారు కాబట్టి క్లాసుకి వచ్చేవాడు. మేష్టరు ఏదో చెప్పేవాడు. వాడు ఏదో వాయించేవాడు. సరిగ్గా వాయించు, హన్నా అంటే వెంటనే ఏడిచేవాడు. చాలా సేపు అలా కుమిలి, కుమిలి ఏడుస్తూనే ఉండేవాడు. తరవాత కాలక్షేపం చేసి వెళ్ళిపోయేవాడు. (నేను హిందీ ట్యూషన్ లో ఎప్పుడూ ఏడిచేవాణ్ణి కాదు లెండి). వాడికి చాలా బోరు కొడుతోంది అని మొహం చూస్తే తెలిసిపోయేది. నాకెంతో జాలి వేసేది. ఈ మధ్య విచారిస్తే ఆ కుర్రాడు చాలా ఇంప్రువ్ అయ్యాడని తెలిసింది. చిన్నప్పుడు కష్టపడినా, పెద్దయ్యాకా హాయిగా వేణువు వాయించుకుంటూ ఉంటే తప్పకుండా ఆ కుర్రవాడు చిన్నప్పుడు నేర్చుకున్నందుకు చాలా సంతోషిస్తాడని నాకు అనిపించింది. ఎటొచ్చీ చిన్నప్పుడు హిందీ వెలగబెట్టినా అందుకు సంతోషించే ఘడియలు నాకు మాత్రం ఇంతవరకూ రాలేదు.
కుంచం నిలువుగా కొలవడానికి లేకపోతే అడ్డంగా కొలిచినా కొన్ని గింజలు వస్తాయని సామెత. అదే విధంగా దృష్టి పెట్టి నేర్చుకోపోయినా హిందీ ముక్కలు నాకు బానే వంటపట్టేవి. మై ఆతా హూ, మై జాతా హూ అంటూ ఉండేవాడిని. ఏకాదశీ అచ్చా హై, ద్వాదశి బురా హై అని కూడా అనేవాణ్ణి. ప్రాథమిక పాఠాలు అన్నీ అయిపోయి మెల్లిగా భాష పాకంలో పడ్డం మొదలెట్టింది. గ్రామరంతా ఈ చెవిలో విని, ఆ చెవిలోంచి వదిలేసేవాణ్ణి. కథలూ గట్రా మాత్రం ఆసక్తిగా చదివేవాణ్ణి. సూఖే సంతరే, టోకరే కీ గవాహీ, గంగారామ్ కీ కహానీ, లగీ మిఠాయీ కడువా ఉన్ కో (ఇది ప్రచార సభ వాళ్ళ పాఠాల్లోది కాదు) ఇలాంటి కథలు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి. దోహాలు గట్రా చదివేవాణ్ణి. సుఖ్ మే సుమరిన్ సబ్ కరై, దుఖ్ మే కరై న కోయి ఇలాంటి దోహాలు కూడా ఒకటో రెండో ఇంకా గుర్తు ఉన్నాయి.
ఏదైనా ఒక ట్యూషన్ కో, స్కూలుకో వెళ్ళడం వల్ల అన్నిటికన్నా గొప్ప ప్రయోజనం ఏమిటంటే రకరకాల జనాల్తో సోషలైజ్ అవ్వడం. నాకన్నా పెద్ద కుర్రాళ్ళతో సరదాగా స్నేహాలయ్యేవి. వాళ్ళ దగ్గర బేవకూఫ్, కంబఖ్త్, మొదలైన పదాలు తెలిసేవి. ఇంకో పెద్ద బూతు మాట కూడా తెలిసింది, కానీ అర్థం మాకెవ్వరికీ తెలియదు. ఓసారి ఏమైందంటే, మా టీచరు గారు అరుగుమీద నిలబడి ఉన్నారు. ఎవరో సర్దార్జీ వచ్చి ‘అమ్మాజీ, కైసే హై’ అంటూ ఏదో మాట్లాడుతున్నాడు. ఈవిడ కూడా ఏదో చెప్పి లోపలికి వెళ్ళారు. అతనికి ఏదో ఇవ్వాలి కాబోలు. అతను బయట వెయిట్ చేస్తున్నాడు. అరుగు మీదకొచ్చి కిటికీలోంచి మమ్మల్ని పలకరించాడు. అప్పుడు లోపల నేను, పెద్ద కుర్రాడింకోడు మాత్రమే ఉన్నాము. ఆ సర్దార్జీ దగ్గర మా హిందీ పాండిత్యం ప్రదర్శిద్దామని మేము ఉత్సాహపడిపోయాం. నా ఫ్రెండు సర్దార్జీకి నన్ను చూపిస్తూ ‘యే బేవకూఫ్ హై’ అన్నాడు. నేను ఊరుకుంటానా, ‘యే -- హై’ అన్నాను - అర్థం తెలీకపోయినా నాకు తెలిసిన అతి పెద్ద బూతు మాటని ఉపయోగించి. సర్దార్జీ కంగారు పడిపోయి ‘తప్పు, బాబూ, తప్పు. బూతు మాటా మాటాడకూడదు’ అని తెలుగులో చెప్పాడు. ఈలోగా మా టీచరుగారు లోపలినించి రావడం, మేము గప్ చుప్ గా కూర్చోడం జరిగిపోయింది.
మా నాన్న తెలుగు లెక్చరరు కావడంతో నేను చిన్నప్పటినుంచే పెద్దయ్యాకా తెలుగు టీచరవ్వాలని కలలు కంటూ ఉండేవాణ్ణి. తెలుగు పద్యాలు గట్రా ఇష్టపడుతూ ఉండేవాణ్ణి. మా నాన్నగారి సహోద్యోగులు కొంతమంది వాళ్ళ పిల్లల్ని కాన్వెంటులకే పంపుతున్నా, ఆయనకి కాన్వెంటు చదువులు ఇష్టం ఉండకపోవడంచేత నన్ను మునిసిపల్ స్కూల్లో తెలుగు మీడియంలో పడేశారు. అక్కడ అయిదో క్లాసు వచ్చేంతవరకూ ఏబీసీడీలు కూడా చెప్పరు. నేను రెండో క్లాసుకి వచ్చాక మా అమ్మా, నాన్నా నన్ను కూచోబెట్టి నాచేత ఏబీసీడీలు దిద్దించడానికి  బ్రహ్మ ప్రయత్నం చేశారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు అంత చిన్నతనంలో కూడా నాకు ఊరంత తిక్క ఉండేది. చచ్చినా దిద్దేవాణ్ణి కాదు. మా అన్న కూడా తనవంతు ప్రయత్నం చేసేవాడు. ఇంగ్లీషు పాఠాల పుస్తకం తీసి ‘వాటీజ్ దిస్’ అంటే నేను ‘వంకాయ పుల్స్’ అనేవాణ్ణి. విసుగొచ్చి మా అమ్మా, నాన్నా ‘వీడు దుంపల బళ్ళో ఏకోపాధ్యాయుడు కావల్సిందే, వెధవ’ అని తిట్టుకునేవారు.
ఇంగ్లీషు నేర్చుకోడానికి నేను మరీ మొండికెత్తడం చూసి మా అమ్మ బెంగ పెట్టేసుకుంది. కానీ ఆవిడకి నా పల్సు బాగా తెలుసు. మంచి టీచరెవరైనా దొరికి, వాళ్ళు ‘అమ్మా, బాబూ, మా బంగారు తండ్రి కదూ’ అంటూ పాఠం చెప్తే మాత్రం నేను చక్కగా చదివేసేవాణ్ణి. అది కూడా మరీ అలుసు ఇస్తే మాత్రం పని జరిగేది కాదు. ఇంట్లో అలుసు ఎక్కువైపోయేగదా మొండికెత్తేసింది! టీచరు భయంలో పెట్టాలి. కానీ మెచ్చుకుంటూ ఉండాలి. అప్పుడే మనం చదువుతాం. అందులోనూ చిన్నప్పుడు ఆడ టీచర్లంటే మరీ బుద్ధిగా చదివేవాణ్ణిట. (చెప్పుకుంటే సిగ్గుచేటు.) అంచేత ఈ లక్షణాలన్నీ ఉన్న ఇంగ్లీషు టీచరు కోసం మా అమ్మ వెతకడం మొదలు పెట్టింది. ఆవిడ అదృష్టం పండి నేను మూడో క్లాసుకి రాంగానే మా పక్కవీధిలో ఇంకో లెక్చరరు గారింట్లో ఒకావిడ చాలామంది పిల్లలకి పాఠాలు చెప్తోందని తెలిసింది. ఆవిడ కాన్వెంటు టీచరు. ఆవిడ దగ్గరకి వెళ్ళే పిల్లలు కూడా ఎక్కువమంది కాన్వెంటు పిల్లలే. వాళ్ళలో నా స్నేహితులు, అంటే మా నాన్నగారి సహోద్యోగుల పిల్లలు కూడా ఉన్నారు. అంచేత గొడవచెయ్యకుండానే శ్రద్ధగా ఆవిడ దగ్గరకి వెళ్ళేవాణ్ణి. మా అమ్మ నోచిన నోములు ఫలించి ఆ ట్యూషన్ టీచర్ గారిని నేను వరించడం, ఇంగ్లీషు ముక్కలు శ్రద్ధగా నేర్చుకోవడం, అయిదో తరగతికొచ్చేసరికి మిగతా కాన్వెంటు పిల్లల్తో సమానంగా ఇంగ్లీషులో పట్టు సాధించడం చూసి మా అమ్మ తెరిపిన పడింది.
నేను బాగా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మా అమ్మా, నాన్న ఇంకో రెండు కుటుంబాలతో కలిసి పూరీ, కోణార్క్ చూసి వచ్చారుట. మావాళ్ళు పుట్టిపెరిగిన ఊళ్ళలోగానీ, మా ఊరిలో గాని బొత్తిగా హిందీ వాసన కూడా లేకపోవడంతో మావాళ్ళకి అసలు హిందీ ఒక్క ముక్క కూడా తెలియదు. పాపం వాళ్ళు పూరీలోనూ, కోణార్క్ లోనూ జనాలతో వేగలేక నానా అవస్థలూ పడాల్సి వచ్చింది. అయితే వాళ్ళతోపాటూ వచ్చిన మా కుటుంబ మిత్రుల్లో ఒకళ్ళకి యూనివర్శిటీ చదువులు చదువుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళే ఒరిస్సా జనాలతో హిందీలో మాట్లాడుతూ మొత్తం అందరికీ కావలసిన ఏర్పాట్లన్నీ చూడాల్సి వచ్చింది. పాపం ఆ అనుభవంతో మనం ఊరు దాటితే ఎక్కడా పైసాకి మారం అని మా అమ్మకి భయం పట్టుకుంది. అంతేకాకుండా ఆవిడకి ముందు చూపెక్కువ. నేను అయిదో క్లాసుకొచ్చాక, ఈ వెధవ ఇప్పట్నించీ హిందీ నేర్చుకోకపోతే పెద్ద చదువులు చదివేటప్పుడో, ఉద్యోగాలు చేసేటప్పుడో ఆంధ్రా దాటితే చిల్లిగవ్వకి మారడు అని ఆలోచించి, దక్షిణ భారత హిందీ ప్రచార సభ వాళ్ళ పరిక్షలు రాయించడానికి నన్ను ఇంకొక టీచరుగారి దగ్గరకి ట్యూషన్ కి పంపడం మొదలు పెట్టింది.
ఒంటెద్దు బండిని లాగుతున్నట్టో, గాడిద బరువు మోస్తున్నట్టో భారంగా, బోరుగా గడిచే జీవితాల్లో కూడా కొన్ని కొన్ని రోజులు బాగుంటాయి. ఇలాంటి ఉపమానాలు నేను చెబితే మా నాన్న తిట్టేవారు. చిన్నప్పుడు ఆరో క్లాసులో చదువుకున్న చిన్నయసూరిగారి పంచతంత్రం పాఠంలో దు:ఖభాగులు ఎవరు అని ఓ ప్రశ్న ఉండేది. (ఈర్ష్యాళువు, జుగుప్సావంతుడు, నిస్సంతోషి, క్రోధనుడు, నిత్యశంకితుడు, పరభాగ్యోపజీవి అని ఆరుగురు దు:ఖభాగులు). జీవితంలో చక్కగా అన్నీ అమిరినా ఎప్పుడూ దు:ఖభాగుడిలాగా అసంతృప్తి ఎందుకురా అనేవారాయన. అన్నీ ఉన్నా ఏదో మనం ఎరగని పరమార్థం ఉందని దానికోసం అసంతృప్తి పడుతూ రోజులు వెళ్ళదీసేవాళ్ళు దు:ఖభాగుల్లో ఏ కేటగిరీలోకి వస్తారో నాకు తెలియదు.
అటువంటి దు:ఖభాగుల జీవితాల్లో కూడా కొన్ని రోజులు బాగుంటాయి. బాగుండడం అంటే పెద్ద ప్రత్యేకంగా ఏమీ ఉండవు. ఉద్యోగం కోసం భయం భయంగా ఇంటర్వ్యూకి వెళ్ళి, ఇరగదీసి, ఇంటికి ఎగురుకుంటూ వచ్చిన రోజుల్లాంటివి కావు ఇవి. పెళ్ళిరోజులో, పుట్టినరోజులో, ఆత్మీయులతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపినవో, సెలవుల్లో అందమైన దేశాలు తిరుగుతూ గడిపినవో కూడా కావు. చాలా మామూలు రోజులు. పొద్దున్న లేచి, తెమిలి, ఆఫీసుకి పోయి, పని చేసి, సాయంత్రం ఇంటికి వచ్చి, కాస్సేపు టీవీ చూసి పడుకున్న రోజులు. అటువంటి రోజులు కూడా కొన్ని ప్రత్యేకంగా బాగుంటాయి. చాలా ప్రశాంతంగా అనిపిస్తాయి. గుర్తుండిపోతాయి.
ఏమిటో తేడా మరి అనుకుంటూ ఉంటాను నేను. మామూలుగానే నిద్ర లేచినా రాత్రి నిద్ర బాగా పట్టడం మూలాన్నో ఏమో రిలాక్స్డ్ గా ఉంటుంది. ఆఫీసులో పనిమీద బుద్ధి కుదురుతుంది. పనిలో చిన్న ఛాలెంజ్. మనకి తెలుసు. అది బాగా చెయ్యగలము అని. ముందే ఎలా చెయ్యాలో మంచి అయిడియా పెట్టుకుంటాము. దానిప్రకారం శ్రద్ధగా సాయంత్రం దాకా పని చేస్తే అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. బ్రహ్మచారిగా ఉన్నప్పుడైతే ఆ సాయంత్రం ఆఫీసు జిమ్ములో దూరి, కాస్సేపు ఒళ్ళు విరగ్గొట్టుకుని, అక్కడే స్నానం చేసి, స్నేహితుడితో ‘మేష్టారూ, ఈ జన్మకి ఇలా గడిచిపోతే చాలండీ’ అన్న రోజులు చాలా కొంచమే అయినా, ఉన్నాయి. తరవాత ఇంటికిపోతే ఖచ్చితంగా టీవీలో ఏదో మంచి డాక్యుమెంటరీయో, సినిమాయో వస్తుంది. ఆ రోజు అలా రావాల్సిందే.
ఇప్పుడైతే సాయంత్రం ఇంట్లో ఇంకా పూర్తిగా అడుగుపెట్టకుండానే గబగబా పాక్కుంటూ వచ్చి కాళ్ళకి చుట్టుకుపోయే పాపాయి. కాస్సేపు దాన్ని ముద్దు చేసి బయట తిప్పాలి. లోపలికొచ్చేసరికి దేవుడి దగ్గర దీపం, చక్కటి పరిమళంతో అగరొత్తులు. ఎన్నో బాల్య స్మృతులు మెదులుతాయి. కె.విశ్వనాథ్ సినిమాలు గుర్తు వస్తాయి. అన్ని రోజులూ మనస్సు ఇలా నింపాదిగా హాయిగా ఎందుకు ఉండదు? ఏమిటి తేడా? ఆఫీసులో పని బాగా జరగడమా? లేక మనస్సు బాగున్నందువల్లే పని బాగా జరిగిందా? ముందురోజు రాత్రి బాగా నిద్రపట్టడం వల్ల మనసు బాగుందా? ఏమో? కారణమేదైనా రోజూ ఇలాగే ఉండకూడదూ అనిపిస్తుంది. అదే పని, అదే రొటీన్, అవే ఆలోచనలు. కానీ ఏదో నిదానం. ఏదో తేలికైన భావన. యోగస్థితి అంటే ఇలా ఉంటుందా? పరమార్థాలు ఏవో హఠాత్తుగా తెలిసినట్టనిపించదు కానీ, మనకేదో తెలియదు అన్న తపనా, అసంతృప్తీ కొంచం ఉపశమించినట్టుగా ఉంటుంది. నేనిదివరకు ఒక సంవత్సరం పైనే గట్టిగా ధ్యానం అభ్యాసం చేశాను. అప్పుడప్పుడు బాగుండేది. కానీ ఇటువంటి స్థితి మాత్రం అభ్యాసం చెయ్యడంవల్ల వచ్చేది కాదు అనిపిస్తుంది. ఇటువంటి ఫీలింగు మన కంట్రోల్లో ఉంటే, ఎటువంటి పరిస్థితిలోనైనా దీన్ని నిలుపుకోగలిగితే, జీవితం అంతా ఆనందమయమే కదా...
విని చాలా కాలమైందని నిత్య సంతోషిణి పాడిన జయదేవుడి అష్టపదులు పెట్టాను నిన్న. అందులో ‘మామియం చలితా విలోక్య వృతం వధూ నిచయేన’ అని కృష్ణుడు పాడే విరహగీతం అంటే నాకు చాలా ఇష్టం. చాలా మంచి ట్యూన్ లో చాలా బాగా పాడింది ఆవిడ. ఇదివరకు ఇండియాలో కారు తోలేటప్పుడు పక్కవాళ్ళకి బోరు కొడుతుందేమో అని కూడా ఆలోచించకుండా ఎప్పుడూ ఈ అష్టపదులో, బోంబే సిస్టర్సు పాడిన సౌందర్యలహరో పెట్టేసి హైదరాబాదు ట్రాఫిక్కులో పాడుకుంటూ, గాల్లో తేలిపోతూ వెళ్తుండేవాడిని. అందులో జయదేవుడు ఆఖర్న అంటాడు, ‘వర్ణితం జయదేవకేన హరేరిదం ప్రవణేన, బిందుబిల్వ సముద్రసంభవ రోహిణీ రమణేన’ అని. బిందుబిల్వమనే (కిందుబిల్వం అనికూడా అంటారు. ‘కెందులా’ అని ఒరిస్సాలో ఉన్న ఒక గ్రామం అట. జయదేవుడు పుట్టిన ఊరు) సముద్రంలో పుట్టిన చంద్రుడిగా తనను తాను అభివర్ణించుకున్నాడు జయదేవుడు. తక్కువచేసుకోకుండా ఎంత చక్కగా చెప్పుకున్నాడు అనిపిస్తుంది ఈ పాట విన్నప్పుడల్లా. కవుల్లో కొందరు తమ గురించి చెప్పుకునేటప్పుడు ఔద్ధత్యం చూపిస్తే కొందరు వినయం చూపిస్తారు. దీని గురించి ఇదివరకు స్నేహితులకి నా పైత్యమంతా ఒలకబోస్తూ ఓ పెద్ద మెయిలు కూడా చేశాను.
అటువంటి సంగీతం వింటున్నప్పుడు, అనుభూతిలో తేలిపోతున్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు గుర్తుకు వచ్చి నవ్వొస్తుంది. ఇదివరకు ఒక ఇంగ్లీషు రచయితా, సైంటిస్టూ ఒకాయన్తో నాకు చాలా స్నేహం ఉండేది. ఆయనతో ఫిలాసఫీ కబుర్లు చాలా నడుస్తూ ఉండేవి. నా ఏడుపు మొహం చూసి జాలి వేసేది కాబోలు, ఆయన అప్పుడప్పుడు అనేవాడు- ‘మురళీ, జీవితం చాలా దుర్భరం అని అనిపించినప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నా గిటార్ తీసి ఒక గంటసేపు వాయిస్తాను. మనసెంతో తేలికౌతుంది’ అని. ఆయన నాస్తికుడు. అయినా ప్రతి ఏడాదీ క్రిస్మస్ కేరెల్స్ కి వెళ్ళేవాడు. ఒకసారి నాకు మెయిల్ ఇచ్చాడు. ‘దేముణ్ణి నేనసలు ఏమీ లెక్క చెయ్యకపోయినా, నా ఎదురుగా వాళ్ళందరూ పారవశ్యంతో పాడుతూ, వెదురుతోనూ, తీగలతోనూ చేసిన ప్రాణంలేని వాయిద్యాలమీద అద్భుతమైన సంగీతాన్ని పలికిస్తూ, వాళ్ళ దేముణ్ణి వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటే, ఆ సన్నివేశాన్ని ఒక మౌన ప్రేక్షకుడిగా నేను పరికిస్తూ ఉంటే, ఏదో ఒక ఆశ్చర్యంతో మనస్సు నిండిపోతుంది’ అని రాశాడు.
రిచర్డ్ డాకిన్స్ ఈ మధ్య పెద్దయెత్తున దేముడి మీద దండయాత్ర మొదలుపెట్టాడు. ఆయన రాసిన గాడ్ డెల్యూజన్ పుస్తకం చాలా ప్రసిద్ధమైపోయింది. ఇక్కడ నాకింకో పెద్దావిడ, కొంచం ఆధ్యాత్మికురాలితో స్నేహమైంది. ఆవిడా, నేనూ పుస్తకాలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాము. ఆవిడకి గాడ్ డెల్యూజన్ పుస్తకంలో విశేషాలు చెప్పాను. చదువుతానంటే ఇచ్చాను. ఆవిడ ప్రతీ ఆదివారం ఖచ్చితంగా చర్చికి వెడుతుంది. ఆవిడకి డాకిన్సు అంటే చాలా కోపం. వితండవాదం చేస్తాడనీ, డెప్తులేకుండా వాదిస్తాడనీ అంటుంది. పాపం నేనిచ్చిన పుస్తకం చదువుదామని ప్రయత్నించింది. కానీ డాకిన్సు ధోరణీ, వ్యంగ్యమూ ఆవిడకి మింగుడుపడలేదు. చదవకుండానే తిరిగి ఇచ్చేసింది.
అంతటి నాస్తికుడైన డాకిన్సు కూడా కొన్ని నెలలక్రితం ‘నేను సంస్కృతిపరంగా క్రిస్టియన్ ని’ అన్నాడు. ఆయనకి కూడా క్రిస్మస్ కేరల్స్ అంటే చాలా ఇష్టంట. ఆ మాట నేను ఆవిడకి చెబితే పడీ, పడీ నవ్వింది. నన్ను పూర్తిగా చెప్పనివ్వదే. ‘ఆహా, అలా అన్నాడా? మరి అతని నాస్తికత్వమంతా కుక్కముట్టి పోలేదూ?’ అంటూ ఒకటే నవ్వు. నాస్తికుడైతే మాత్రం ఆయనా మనిషి కాదా? సంగీతానికి స్పందించడా?
ఇంతకీ అదీ సంగతి. ఓ అందమైన సాయంత్రం మదిలో మెదిలిన ఆలోచనలివి అన్నీ...
http://eemaata.com/em/issues/200805/1238.html
జీవులకి ఆత్మ ఉండడం నిజమైతే, చనిపోయాకా అది స్వర్గానికో నరకానికో వెళ్ళడం నిజమైతే, నేను చనిపోయాకా కొద్దికాలమైనా స్వర్గంలో గడపడం తటస్థిస్తే, అక్కడ నాకోసం ఖచ్చితంగా ఒక లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీలో ఒక సెక్షన్ లో పాత చందమామలూ, బాలజ్యోతులూ అన్నీ సంవత్సరాలవారీగా బైండు చేసి ఉంటాయి. నా చిన్నప్పుడు చదివిన పుస్తకాలు మళ్ళీ చూసుకుని నేను ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతాను.
ఇంకా స్వర్గానికి పోకుండానే అటువంటి అనుభవం కలిగింది నిన్న. 1947 నుంచీ 2006 దాకా చందమామలు అన్నీ ఇంటర్నెట్ లైబ్రరీ లో ఉన్నాయి. నేను చిన్నప్పుడు ఎన్నోసార్లు చదివిన పుస్తకాలు బొమ్మలు, అడ్వర్టయిజ్మెంట్లతో సహా ఇప్పటికీ నా కళ్ళముందు ఉన్నాయి. అవే పుస్తకాలు మళ్ళీ ఇప్పుడు చూసుకుంటుంటే ఒక ‘నోస్టాల్జియా’ ఆవహించింది.
బహుశా నేను బొమ్మల కథల పుస్తకాలు చదవడం నా ఆరు, లేక ఏడవ సంవత్సరంలో మొదలుపెట్టి ఉంటాను. ఇంకా చిన్నతనంలో కూడా ఏమైనా చదివానేమోగానీ అవేవీ గుర్తు లేవు. కానీ ఆరేడేళ్ళ వయసునాటి పుస్తకాలు ఇప్పుడు చూస్తే ఇంకా నిన్న మొన్న చదివినట్టే అనిపించింది. బహుశా తరవాత సంవత్సరాల్లో కూడా చాలాసార్లు పారాయణ చేసినందువల్ల కావచ్చు. సుమారు పదిహేనో ఏడు వచ్చేవరకూ కథలపుస్తకాలు చదువుతూనే ఉన్నాను. పాతవి పారాయణ చేస్తూనే ఉన్నాను.
ఇంతకీ ఈ చందమామలు ఎక్కడ ఉన్నాయంటే, http://www.ulib.org కి వెళ్ళండి. అందులో Advanced Search లోకి వెళ్ళండి. Title లో Chandamama అని కొట్టి, Language లో Telugu సెలెక్టు చెయ్యండి. సెర్చి కొట్టండి. అంతే, అన్నీ మీ ముందు ప్రత్యక్షమౌతాయి.
నిన్న ఉండబట్టలేక చిన్నప్పుడు చదివిన ‘ముగ్గురు మాంత్రికులు’ సీరియల్ మళ్ళా మొదటినుంచీ చివరిదాకా చదువుతుంటే తెలిసింది. కొన్ని కొన్ని సంవత్సరాల్లో కొన్ని నెలల చందమామలు అందులో లేవు. మిస్సయ్యాయి. చాలా బాధ కలిగింది. ఆ ఎడిషన్లు అసలు చందమామ వాళ్ళదగ్గరే లేవేమో? అలా అయితే మటుకు తెలుగు జాతికి గొప్ప నష్టం జరిగినట్టే.
మరో సంగతి. ఈ సైట్లో చందమామలు పీడీఎఫ్ రీడర్ సహాయంతో పేజీ తరవాత పేజీ చదువుకోవాలి. సదుపాయంగా ఉండదు. అయినా కొంచం ఓపిక ఉంటే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. www.chandamama.com లో Archives సెక్షన్లో 1947 నుంచీ 1959 దాకా అన్నీ పీడీఎఫ్ ఫైల్సు రూపంలో ఉన్నాయి. ఇవి చదువుకోడానికి చాలా సదుపాయంగా ఉంటాయి. సైటువాళ్ళు మిగతావి ఎప్పుడు ఇస్తారో తెలియదు. అంతవరకూ http://www.ulib.org మాత్రమే గతి కాబోలు.
మరి ఇంకా ఆలస్యమెందుకు? చదువుకోవడం మొదలు పెట్టండి
నిన్న ఒకళ్ళింటికి భోజనానికి వెళ్ళాము. ఆయన కేరళీయుడు. ఆవిడ మలేసియాలో పుట్టి పెరిగిన తమిళావిడ. చాలా వంటకాలే చేశారు మాకోసం. రెండు రకాల పప్పులు, ఒక కూర, కారెట్-మామిడికాయ పచ్చడి, రసం, వడలు, పాయసం. అందులో కూర తిని చూసి అరటి కాయ కూరేమో, వెరైటీగా చేశారేమో అనుకున్నాను. మెత్తటి కూర ముక్కలు ఏదో గ్రేవీలో ఉన్నాయి. వాళ్ళే చెప్పారు. అది తామర తూడుల కూరట. చాలా ఆశ్చర్యం వేసింది. మలేసియా కూర అనుకుంటాను. అందులో గ్రేవీ కోసం ఏదో ఆ దేశపు పదార్థం పేరు చెప్పి అది ఇక్కడ దొరుకుతుంది, తామర తూడులు కూడా దొరుకుతాయి, ప్రయత్నం చెయ్యండి అని ఆవిడ చెప్పింది.
తామర తూడులు అనగానే ఒక్కసారి ప్రాచీన సాహిత్యం, అందులోనూ సంస్కృత సాహిత్యం మీదకి మనసు వెళ్ళిపోయింది. ‘వ్యాళం బాల మృణాల తంతుభి రసౌ రోద్ధుం సముజ్జృంభతే’ అని భర్తృహరి శ్లోకం. మూర్ఖుణ్ణి మంచి మాటలతో బుజ్జగించేవాడు తామర తూడులలోని దారాలతో ఏనుగుని కట్టెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడట. అలాగే ‘మృణాలీ మృద్వీనాం తవ భుజ లతానాం’ అని ఇంకో శ్లోకం గుర్తు వచ్చింది. కావ్య నాయికల భుజాల్ని తామర తూడులతో పోల్చడం కవి సాంప్రదాయం. శివుడి తల మీద చంద్రుణ్ణి తామర తూడులా సుకుమారంగా (మృణాల సూత్రాధిక సౌకుమార్యాం ) ఉన్నాడని వర్ణిస్తాడు కాళిదాసు.  అలాగే మేఘదూతంలో అంటాడు, కైలాసం దాకా ఎగురుకుంటూ పోయే హంసలకి దారి బత్తెం ఈ తామర తూడులేనట (ఆకైలాసాద్బిస కిసలయ చ్ఛేద పాథేయవన్త:). ఒకటా రెండా, ఎన్నెన్ని వర్ణనలు!! ఏ కావ్యంలోనైనా ప్రతీ పదీ ఇరవై శ్లోకాలకోసారైనా పద్మాల ప్రసక్తో, ఈ తామర తూళ్ళ ప్రసక్తో రాకుండా ఉండదు కదా.
ఆ కూర అంత మధురంగా ఉన్నదని చెప్పలేను గానీ, అది తింటున్నంతసేపూ వెనకటి యుగాల్లోకి వెళ్ళిపోయిన భావన కలిగింది. అయినా ఈ కావ్యాలూ శ్లోకాల ప్రసక్తి తెచ్చి ఆతిథేయులకి విసుగు తెప్పించకుండా నిశ్శబ్దంగానే కూర లాగించేశాను. తిని ఒక రోజు గడిచినా శరీరంలో తేడాలేమీ రాలేదు లెండి, ఇంతవరకు.  మరి మీకెవరికైనా కూడా దీని గురించి తెలిస్తే కొంచం చెప్పండేం!!
ఈ ఎండకి ఏంవెళ్తాం అని పడుకున్నాను కాని ఎందుకొ పడుకొని చేసేది ఎముంది అని బయలుదేరాను,నేను ఆటొదిగేసరికి అప్పుడే లొనికి
వెళ్తూ కనిపించారు,చిన్నగా వెళ్ళి వళ్ళ లొ చేరాను వళ్ళలొ ఇద్దరు కొత్తవాళ్లున్నారు.
వీళ్ళే ఆకొత్తవాళ్ళు(స్వాతి గారు,చక్రవర్తి గారు)
అందరం వెళ్ళి వ్రుత్తాకారముగా కూర్చున్నాం.
ఈ సారి పెద్దగా ఎవరురాలేదు అనిపించింది,ఇంతలొ చక్రవర్తి గారు వారి బ్లాగుపేరు చెబుతుంటే నొట్ చేసుకుంటున్నాను పక్కనే వీవెన్
గారు ఈసారి కూడా నన్నే సమావేశవివరములు రాయమన్నారు సరే నని ఒప్పుకున్నాను.
కందర్బ క్రిష్ణమౌహన్ గారి పాప..
సి.బి.రావ్ గారు ‘తెలుగుబ్లాగ్ పుస్తకం’పై చర్చించారు,అందరూ మాట్లాడుతూ ఉన్నారు నేను రాసుకుంటూకూర్చున్నాను.
ఈసారి రావ్ గారు ఎందుకొ వెనుకపడ్డారు అనిఅనిపించింది,ఈసారి మాత్రం పద్మనాభం గారిహవా కనిపించింది సమావేశం మొత్తం
మాట్లాడుతూనే ఉన్నారు ముందుగానే ప్రిపర్ అయివచ్చారనిఅని పించింది.
యుద్దానికి ముందు పద్మనాభం గారు శ్రీధర్ గారి తొ
చాలా మాట్లాడారు,etelugu ఒక organisation గా ఏర్పడాలని గట్టిగా వినిపించిన ఒక అంశం.
etelugu ముఖ్యఉద్దేశం గురించి చర్చించారు ప్రచారానికి కళాశాలలకు,విశ్వవిద్యాలయాల లకు వెళ్ళాలని అన్నారు సరే
హైదరబాద్ అయితే వెళ్దాం అనిఅనుకున్నాను.
ఫొటొ లొ మాతలకాయలపైన పేర్లు ఉన్నాయి గా చదువుకొండి
రావ్ గారిని సమాచార హక్కుచట్టం గురించి అడిగాను,భలే గా  ఈరొజు ఈనాడు పేపర్ లొ వచ్హిందికదా ఇక వళ్ళని పట్టుకొవచ్హులే అనుకున్నాను.
ఎప్పటినుంచొ సమాచార హక్కుచట్టం ఉపయూగించాలని ఒక చిన్నకొరిక.
చిన్నగా సమావేశం అనంతరం బయలుదేరి టీ తాగి బయటపడ్డాం,చావా కారు లొ front seat లొ కూర్చుని ఈ హైదరబాద్ ట్రాఫిక్ లొ నానా ఇబ్బంది పడి భరత్ నగర్ లొ దిగి వెళ్ళి పొయాను!ఈ సమావేశపూర్తివివరములు http://etelugu.org లొ రాయటం జరిగినది ఇది నాసొంత అనుభవం అని గ్రహించాలి.
బ్లాగు మితృల ప్రోత్సాహానికి ధైర్యం వచ్చేసి తేటగీతులు ట్రై చేశాను ఇవాళ.
మితృలారా కొన్ని విన్నపాలు -
1) యతి నియమాలకోసం తెలుగు వికిపీడియా మీదే ఆధారపడ్డాను. తప్పులుంటే సరిచెయ్యండి.
2) ఇది కేవలం ఆత్మ విమర్శేగానీ పరనింద కాదు. (ఈ పద్యాలు ఆఫీసులోనే రాశానని వేరే చెప్పక్కర్లేదనుకుంటా). కాబట్టి ఎవరైనా భుజాలు తడుముకుంటే నా పూచీ లేదు.
గడువు దూరముగానున్న గడిపి  వేయు
గడువు దగ్గర పడినంత గుండెలదురు
పగలు ఎగవైచి దీపమ్ము దిగలు వేయు
వాడె సాఫ్ట్వేరు వృత్తిలో నుండు వాడు     ||
బద్ధకము తొందరయు కలుపబడి యుండు
యెంత ఓపిక యుండునో అంత కోపి
మొగుడు నెత్తెక్కి కూర్చున్న ఒంగి చేయు
మొగుడు మెత్తని వాడైన హంగు చేయు  ||
నెట్టు ఈమైల్సుతో టైము ఫట్టు కాగ
అసలు పనియంత ఆఖర్న  విసిగి చేయు
పిల్లి ఇసుకలొ కప్పెట్టి వెళ్ళు పగిది
తనదు బగ్గులు దాచును నంగ నాచి  ||
పగలంతా ఎగేసి దీపం దిగెయ్యడం, పిల్లి కప్పెట్టినట్టు చెయ్యల్సిన పనులు కప్పెట్టడం అన్న ప్రయోగాలు మా నాన్నగారు నాకు తరచుగా ఇచ్చిన దీవెనలు..
http://eemaata.com/em/issues/200803/1212.html
కంప్యుటర్ లొకి వైరస్ వచ్హిందా ఐతే ఫార్మ్యాట్ చేయటమే నాకుతెలిసిన సులభమైన విషయం, ఎందుకంటే ఉప్డేటెడ్ software కాని net కాని నాకు అప్పుడు అందుబాటులొ ఉండేవికావు!! నన్ను ఎవరైనా అడిగినా ఇదే సుచనచేసేవాడిని కాని ఇదిఎమంత మంచిగాపనిచేసిన ధాఖలాలు చాలాతక్కువ?కాని ఇప్పుడు నెట్టు అందుబాటులొకివచ్హింది(64కేబిపీయస్), pendrive ల పున్యమా అని మళ్ళీ virus లు ,ఏది ఒపెన్ కాదు  computer చాలా slow గా నడిచేది! చాలా ఇబ్బందిపడ్డాము! ఒకానొక దశలొ మళ్ళీ format తప్పదేమొనని అనుకున్నా ,అప్పుడే మన 'కంప్యుటర్ ఏరా' గుర్తుకువచ్హింది! నేను కొంచంపనిఉండి మాస్నేహితుడికి సుచనలు చేసి వెళ్ళాను వాడికి సరీగా కుదరలేదు,ఇక రాత్రి సుమారు 1 గంటకి అనుకుంట మళ్ళి సహాయంకొసం మొదలుపెట్టాం ! ఒక గంటలొనే పని అయిపొయింది,మాకు రవీంద్ర కాట్రగడ్డ గారు చాలాసహయపడ్డారు సుమారు ఉదయం 3 గంటలకి అనుకుంటా మా  system మళ్ళి మా ఆధీనంలొకి వచ్హింది చలాసంతొషం గానిపించింది అప్పటికప్పుడు ఎవరొవుకరు సహయంచేసేవారు! మాకు ఏతే రవీంద్ర కాట్రగడ్డ గారు సరాసరి మా computer లొకివచ్హి సరిచెసివెళ్ళరు నిజంగానే గ్రేట్ కదూ! అదీ అర్ధరాత్రి సహాయం .
ధన్యవాధములు ముఖ్యంగా శ్రీధర్ గారికి మరియూ రవీంద్ర కాట్రగడ్డ గారికి నాతరుపున మరియు నా మిత్రులతరుపున!!
అనుకోకుండా మొన్నొకరోజు యూట్యూబ్ వీడియోల్లో వెతుకుతుంటే చాణక్య సీరియల్ ఎపిసోడ్లు కొన్ని దొరికాయి. చిన్నప్పుడు దూరదర్శన్ లో ఆ సీరియల్ ని చాలా ఆసక్తిగా చూసేవాణ్ణి. మిగతావన్నీ ఎలా ఉన్నా అందులో ముఖ్యంగా ఆకర్షించినవి కాస్ట్యూమ్సు, సెట్టింగులు, సంగీతం.  అందులో ప్రతీ ఎపిసోడ్ ఆఖర్నా కొంత వేద సూక్తాలో, లేకపోతే శ్లోకాలో వేసేవాడు. ఒక ప్రత్యేకమైన స్టయిల్లో ఆ సూక్తాలు పాడేవారు. వాటిల్లో కొన్ని నాకు చాలా నచ్చేవి. నేను వేరే కావ్యాల్లో శ్లోకాలు చదువుకునేటప్పుడు సరదాగా ఆ స్టైల్లో కొన్ని పాడుకునేవాణ్ణి. తరవాత చాలాసార్లు అనుకున్నాను, చాణక్యలో పాడినవి ఎక్కడైనా దొరికితే బాగుండును అని. మొన్న యూట్యూబులో చాణక్య ఎపిసోడ్లతోపాటు ’చాణక్య ఎండింగ్’ అన్న పేరుతో ఒక 25 ఎపిసోడ్ల వరకూ ఆఖర్న పేర్లు వస్తుంటే వచ్చే శ్లోకాలు ఎవరో అప్ లోడ్ చేశారు. అవి విని చాలా ఆనందించాను. ఎవరో అవి అప్ లోడ్ చేసిన మహానుభావులు!! ప్రపంచంలో నేనొక్కణ్ణే వెర్రివాణ్ణేమో అనుకుంటూ ఉంటాను ఒక్కోసారి. ఇంటర్నెట్ పుణ్యమా అని మనలాంటి వాళ్ళూ, మనల్ని మించినవాళ్ళూ చాలామందే ఉన్నారు అని తెలిసి ఆనందం కలుగుతుంది.
ప్రసిద్ధమైన భవభూతి శ్లోకం ఒకటి ఉంది-
యేనామ కేచిదిహ న: ప్రథయన్త్యవఙ్ఞాం
జానన్తు తే కిమపి తాన్ప్రతి నైష యత్న:
ఉత్పత్స్యతేస్తి మమకోపి సమాన ధర్మా
కాలోహ్యయం నిరవధిర్విపులా చ పృథ్వీ ||
భవభూతి అంతటి కవికి కూడా విమర్శలు తప్పలేదు అనుకుంటాను. తనని తిట్టేవాళ్ళని ఉద్దేశించి ఆయన అన్నాడు - ఎవళ్ళైతే నన్ను అవమానపరుస్తున్నారో, వాళ్ళు తెలుసుకుందురుగాక. వాళ్ళ గురించి కాదు నా ప్రయత్నం. నాతో సమాన ధర్మం కలవారు (నావంటివారు) ఎప్పటికైనా తప్పక ఉద్భవిస్తారు. కాలానికి అవధి లేదు. భూమి ఎంతో విశాలమైనది.
ఆ లింకులు కొన్ని కింద ఇస్తున్నా.
http://youtube.com/watch?v=nGwWpfS2ftE
http://youtube.com/watch?v=_Ls_y2-6Lgo
http://youtube.com/watch?v=CnVj23CkM3g
http://youtube.com/watch?v=d4QHxRZFY78
http://youtube.com/watch?v=Dv8_L9ruzrA