నిజానకీ ఫెమినిజానికీ మధ్య, దేవీపూజ
ఈరెండుకథలకీ ముందుమాట
చాలా పత్రికలూ సంకలనాలూ నన్నడక్కుండానే ప్రచురించుకున్న ప్రముఖకథ ఇది.
ఈకథమీద చాలా చర్చలు జరిగాయని విన్నాను. అంచేత అవే ప్రశ్నలు మళ్లీ మళ్లీ తలెత్తకుండా, నేను ఈకథగురించి నామాట ముందే చెప్పేస్తాను.
నాకు వ్యక్తిగతంగా కూడా వుత్తరాలు వచ్చేయి. అందులో చాలావరకూ తమజీవితంలోనూ తమఆప్తులజీవతంలో సరిగ్గా ఇలాగే జరిగిందనీ, తమకి కాస్త ఓదార్పు కలిగించిందనీ.. ఏకథకి అయినా అదే ప్రయోజనం. సాధారణంగా కథకోసం వస్తువు గ్రహించినప్పుడు రచయిత సంఘటనని కొంత ఆసరాగా తీసుకుని కథ రాసినప్పుడు దానికి విశ్వజనీనత వచ్చేది అలాటిఅనుభవమో సంఘటనో ఇతరుల జీవితాల్లో కూడా జరిగినప్పుడు, అనేకసంఘటనలని కూడదీసి ఒకకథ అల్లినప్పుడు. కథకీ ఆత్మకథకీ తేడా అదే.
మొదటికథమీద చర్చలు చాలానే జరిగినా, నాదాకా వచ్చిందీ, నాకు సమాధానం చెప్పాలనిపించిందీ రంగనాయకమ్మ చేసిన వ్యాఖ్య. ″... ఇలా సీత ఆత్మవంచన చేసుకుంటూ కొంతకాలం గడిపి ...″ అన్నది.
నేను ఈకథలో సీతపాత్ర ఆత్మవిశ్వాసం గలవ్యక్తిగా చిత్రించడానికి ప్రయత్నించాను. (పత్రికలవారు నెత్తిన కొంగు వేసుకుని పెద్ద కన్నీటిబొట్టుతో సీతని చిత్రించడం కూడా నాకు నచ్చలేదు). పోతే ఆత్మవంచన అన్నది ఒక దుస్థితిలో వుండీ ″నేను సంతోషంగా వున్నాను, నాజీవితం పూలనావ″ అన్న భ్రమలో వున్నవ్యక్తికి నప్పుతుంది. అంతేకానీ, సమస్య వుందని గుర్తించి, ఆసమస్యకి మూలకారణం వెతుక్కుని, ఎదుటివ్యక్తిని ముఖాముఖి ఎదుర్కొని నిలదీసి ప్రశ్నించి, పరిష్కారంగా తనకు తానుగా నిర్ణయం తీసుకున్న వ్యక్తికి నప్పదు. దాన్ని ″ఆత్మవంచన″ అనడం అసమంజసం. ఇక్కడ రంగనాయకమ్మ నాకిచ్చిన కితాబుకూడా చెప్పుకుని గొప్పపడిపోవాలి మరి. తాను నాకథలో ఒకవాక్యం తీసుకుని, కాస్త మార్చి (″మీప్రేయసులలో ఒకప్రేయసిగా వుండను″) వాడుకున్నాను అంది. అది వారి ఔదార్యం!
రెండో ప్రశ్న. దీనిలో ఫెమినిజం ఏముంది అన్నది. లేదు. ఇది ఫెమినిజం కాదు. ఫెమినిజం పేరు చాటు పెట్టుకుని, అటు ఫెమినిజానికీ ఇటు నిజానికీ చెందని, కళ్లుమూసుకు పాలు తాగేపిల్లి తత్వం ఎత్తి చూపాను ఈకథలో. అలాటివారిలో చిత్తశుద్ధి లోపించిందన్న వాదన ఇది. ఇంట్లో భార్యకొక నీతీ, ఊళ్లో ఆడవాళ్లకి మరో నీతీ మగవారిలోనూ, ఆమగవారిప్రాపకంలోనే తమస్థాయిని పెంచుకోడానికి నానా రూపులూ ధరించే ఆడవారినీతినీ ప్రశ్నిస్తున్న కథ ఇది. సోకాల్డ్ సంఘసంస్కర్తల చిత్తశుద్ధిని నిలవేసి ప్రశ్నిస్తున్న మేలుకొలుపుపాట.
మూడోకోణం. అది ప్రవాసజీవితంలోని కొత్తవిలువలకి అలవాటు పడలేక, పాతవిలువల్ని వదులుకోలేక ఆరాటపడిపోతున్న అస్తవ్యస్తపు జీవులు తెలిసీ తెలియకా పడే బాధలు. నిజానికీ ఫెమినిజానికీ మధ్య రాసింతరవాత, ఈవిషయం పూర్తిగా ఆవిష్కృతం కాలేదనిపించి, ఆతరవాత రాసిన కథ దేవీపూజ. కాలక్రమంలో వెనకే అయినా ముందు చదివితే మొదటికథ (నిజానికి ... ) ఎక్కువగా అర్థమవుతుందనుకుంటాను. నాకథల్లో పాత్రలు ఆరోజుల్లో, అంటే 60, 70 దశకాల్లో, ఆంధ్రలోనే వుంటే వారికథ వేరే విధంగా వుండేదనే నాఅభిప్రాయం.
మరొక సంగతి. ఈపరిస్థితులు కొంతవరకూ 80 దశకంనాటికే మారిపోయాయి. అంచేత ఈతరంవారికి ఇది అంతగా అర్థం కాకపోవచ్చు కూడా. అందుకే రెండు కథలూ ఇక్కడ పెడుతున్నాను. ఈకోణాల్లోంచి, ఈవరసలో చదివి మీఅభిప్రాయాలు రాయండి.
(మాలతి, ఏప్రిల్ 2008)
దేవీపూజ
నిజానికీ ఫెమినిజానికీ మధ్య