బత్తీబంద్ పై నా అభిప్రాయాలు ఇలా గతవారం ఇక్కడ పంచుకున్నాను.
*** పూర్తి సైజు బొమ్మ కొరకు బొమ్మను క్లిక్కుమనిపించండి. ***
నాకు ఈ విషయములో స్ఫూర్తిప్రదాతలు రానారె మరియు ఊకదంపుడు గార్లు.
గజేంద్రమోక్షములో అలనాడు ఆ శ్రీమహావిష్ణువుని ఎలుగెత్తి గజేంద్రుడు ప్రార్ధిస్తే, ఆయన ఎలావున్నవాడు అలానే బయల్దేరి గజేంద్రుణ్ణి కాపాడటానికి విచ్చేశాట్ట. పోతన గారి "సిరికింజెప్పడు.... " అన్న పద్యంలో ఈ వర్ణన ఎంత హృద్యంగా చేశారో కొత్తగా చెప్పేదేమీ లేదు.
అయితే ఈ భక్తవరదుడు అయిన దేవదేవుడు కూడా కాలానుగుణ్యంగా తన నిజభక్తులకి పిలిచినంతనే దీవెనలిస్తుంటాడండోయ్. ఈ సందర్భంగా నాకు మా అమ్మ, నానమ్మలూ మరియు బామ్మలు నా చిన్నతనంలో ఆ పరమాత్మని స్మరించే విధానం గుర్తొస్తుంది.
తెల్లవారి లేవటం ఆలస్యం కళ్ళాపి చల్లి, ముగ్గులేసి, మిగతా కుటుంబం అంతా లేచేటప్పటికల్లా కాఫీలు, అల్పాహారాలతో సిద్దమయిపోయే అమ్మలూ, అమ్మమ్మల ముందు ఈ పారలెల్ ప్రాసెస్సింగ్ కంప్యూటరు దిగదుడుపు కాదూ?
అంతలోనే మళ్ళీ స్నానాదికాలు ముగించేసి మళ్ళీ వంటింట్లోకి అలుపే లేకుండా భోజనాల తయారీలో మైమరచే అమ్మలూ, అమ్మమ్మల పొరపాటు లేని పనితనం ముందు ఏ సీక్వెన్షియల్ ప్రాసెస్సర్లు గొప్ప?
అలా వంటిట్లో కూరలు, పులుసులూ తయారవుతుండగానే, పొద్దెక్కక ముందే ఆ పరమాత్మని స్మరించుకోవాలనే ఆరాటంలో, పూజ గదిలోకి మడితో వెళ్ళిపోయి, ఆ దేవదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి స్తోత్రాలు చదువుతూ, మధ్యమధ్యలో ఒరే శీనూ, ఆ పొయ్యి మీద కూర మాడుతుందేమోరా, వెళ్ళి కాస్త మంట తగ్గించరా అంటూ అరుస్తూ, ఆ మరుక్షణంలోనే మళ్ళీ స్తోత్ర పఠనంలో మునిగి తేలే ఆ తల్లుల భక్తి ఆ గజేంద్రుడి భక్తి కంటే ఎందులో తక్కువ?
ఆ చిన్నతనంలో అది వింతగా అనిపించినా, గృహస్తాశ్రమంలో మునిగితేలుతూ అచంచలమైన భక్తితో కొలిచే వారి పిలుపు వినలేని దేవుడెవరుంటారా అని ఇప్పుడు అనిపిస్తుంది.
చాలా రోజుల నుండీ నేను అర్చకులు, వారి స్థితిగతుల గూర్చి (అమెరికాతో సహా) ఒక సవివరమయిన టపా రాద్దామని సరంజామా తయారు చేసుకుంటూండగానే, ఇవ్వాళ ఈనాడు పత్రిక ఏమాత్రం పరిశోధన అన్నది చేయకుండా ఎవరో నాలుగు ముక్కలు చెబితే అదే నిజమన్న తీరుతో ఈ వ్యాసం ప్రచురించింది. ఇందులో 90% శుద్ధ అబద్దం అని చెప్పటానికి ఇక్కడే అమెరికాలో ఉంటూ ఇక్కడి అర్చకుల జీవనం చాలా దగ్గరినుంచి చూస్తున్నవాడిగా నాకొక్క క్షణం పట్టలేదు. ఎప్పుడో విషయం చప్పబడ్డ తరువాత కంటే, ఇప్పుడు రాయటమే మేలనిపించి రాస్తున్నాను.
ఎవరో ఒకాయన ఓ కారు కొనుక్కుంటే, ఆ ఒక్క వార్తని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు ఊహించి రాసెయ్యటం ఈనాడుకే చెల్లింది. ఈ రోజుల్లో కేవలం 10% శాతం అడ్వాన్సు ఇస్తే, 90% అప్పుగా ఇచ్చి కారు చేతిలో పెడతారన్నది విశ్వవిదితం. పట్టుమని ఓ 100 - 200 మంది అర్చకులు కూడా లేని అమెరికాలో, ఇక్కడికి వలస వస్తున్న వారివల్ల భారతదేశములో అర్చకుల లభ్యత తక్కువవుతున్నది అని చెప్పటం ఎంత మూర్ఖత్వమో అనిపించింది. ఇక అసలు విషయానికొస్తున్నా.
స్వర్గీయ టీ.కృష్ణ గారు గతంలో "దేవాలయం" అని ఓ అద్భుతమైన చిత్రాన్ని మనకి అందించారు. నాకిష్టమైన సినిమాల్లో అదొకటి. ధర్మకర్తలు అర్చకులని అలక్ష్యం చేస్తూ ఎలా దేవాలయాల్ని భ్రష్టు పట్టించారు అనే విషయం మీద. శోభన్ బాబు కెరీర్ లో ఇది ఒక గొప్ప చిత్రమని నా నమ్మకం.
ఆ ధర్మకర్తల తాలూకు లక్షణాలు చాలా వరకు ఇక్కడ అమెరికాలోనూ కనపడుతూనే ఉంటాయి అనటంలో సందేహమే లేదు. కొన్ని నిజాలు.
1) అర్చకుని కనీస వేతనం $500 నెలకి నుంచి (అర్చకుడి అవసరమూ, ధర్మకర్తల అవకాశవాదం కలగలిసి) అత్యధికంగా $1250 వరకు ఉంటుంది. ఈ $1250 పుచ్చుకునే వాళ్ళు ఓ పది మంది ఉంటే గొప్ప విశేషమే. అలాంటిది, నెలకు లక్ష రూపాయల జీతం అని అడ్డగోలుగా వార్త ప్రచురించి జనాలను పక్కతోవపట్టించటం అనైతికం.
2) వసతి ఒక్కటి ఉచితమయినంత మాత్రాన మిగతా జీతం అంతా వెనకేసుకోలేరు గదా?  బ్రహ్మచారిగానో లేదా భార్యాబిడ్డల్ని ఇండియాలో వదిలేసి ఉంటేనే ఆ వసతి కూడానూ. తిండీతిప్పలు ఇవన్నిటికీ డబ్బు కావాల్సిందే కదా. వారికొచ్చే జీతంలో మిగతా ఖర్చులన్నీ పోగా ఎంత మిగుల్చుకోగలరన్నది ఇక్కడున్నవారికెరుకే.
3) ఇక ఫ్రీలాన్స్ పురోహితుల సంగతి. ఇక్కడ అమెరికాలో ఉంటున్నవారిలో ఎంత మంది ఇంతవరకూ ఓ ఫ్రీలాన్సు పురోహితుణ్ణి ఇంటికి పిలిచి పూజ చేయించుకున్నారు? ఎంత మంది ఓ దేవాలయం ద్వారా పురోహితుణ్ణి రప్పించుకున్నారు? గ్రీను కార్డు వచ్చి ఫ్రీలాన్సు అవతారమెత్తటానికి ఎన్ని ప్రతిబంధకాలు? ఒకవేళ ధైర్యం చేసి ఎవరయినా అలా అయినా కూడా, స్వంతంగా మెడికల్ ఇన్స్యూరెన్సు కట్టుకోవాలంటే, ఇవ్వాల్టి రోజున నెలకి అధమం $500 ఒక వ్యక్తికి అవుతాయి. అదే కుటుంబానికైతే $1000 పైమాటే నెలకి.  $1000 జీతాలున్న స్థితిలోంచి,  ధైర్యం చేసి ఫ్రీలాన్సుకెళ్ళి అంతలేసి ఇన్స్యూరెన్సు ఎవరు కట్టుకోగలరు? అర్చకుడు కాదు కదా, అమెరికాలో గొప్పగా సంపాదించే సాఫ్టువేరు కుర్రాడు కూడా సొంతగా మెడికల్ ఇన్స్యూరెన్సు కట్టుకోలేడు, తన యజమాని అండ లేకుండా.
4) న్యూజెర్సీ లోని కొన్ని దేవాలయాల్లో అర్చకులపై ఉన్న నియమాలు వింటే, ఆనాటి ధర్మకర్తలని గుర్తుకు తెస్తారు. అర్చకులు కూర్చోటానికి వీలు లేదు దేవాలయంలో. అదికూడా ఏకధాటిగా 8 గంటలు పనిచేయాల్సివచ్చే శని, ఆదివారాల్లో.
ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చును. ఓ అర్చకుడు, ఓ బ్రాహ్మణుడు కొంత వెనకేసుకున్నాడు అంటే అదేమిటో పెద్ద నేరంగానూ, సృష్టిలో ఓ కొత్త వింతగానూ ప్రచారం కల్పించే తత్త్వం విడనాడితే బాగుంటుంది.
అమెరికాలో అర్చకుడి సంపాదనకీ, సాఫ్టువేరు డెవలపరు సంపాదనకీ పోలికా? ఇంత చెత్త న్యూసు ఈనాడులో చూసి, చదివి చాలా కాలమయ్యింది.
సాధారణముగా మనం పెద్ద పెద్ద ఊకదంపుడు ఉపన్యాసాలు మన మన కంపనీలలో పెద్దల నుంచి వింటూ ఉంటాం. అంకిత భావం, గుర్తింపు, సమైక్య కృషి(టీం వర్క్) గట్రా గట్రా.... మనలో చాలా మందికి మల్లే నేనూ ఆపరా నస, వినలేక చస్తున్నాము ఆ పాడిందే పాట పాచిపళ్ళ దాసరి అని.. అని విసుక్కుంటూనే ఉంటాను.
ఈ సొల్లు కబుర్ల కోసం ప్రతి వారం ఓ పెద్ద మీటింగు, దానికో టైము... అంతా కొండని తవ్వి ఎలుకని పట్టే సామెతే.
మా ఆఫీసులో ఓ ప్రాజెక్ట్ దాదాపు ముగుస్తోంది. చివరి రిలీజ్ లో ఎవడో ఓ చిన్న తప్పు చేశాడు. మరీ కాదు కానీ, కొంచెం చెడింది, దాన్ని తర్వాత సరి చేసారు నలుగురూ కలిసి. పై వాళ్ళు మా బాసు మీద కాస్త ఏడిచినట్లున్నారు. వాడొచ్చి నా కొలీగ్ మీద కన్నెర్రచేసాడు. వీడు బాధపడ్డాడు. ఇంత కష్టమూ భ్రష్టుపట్టిందని.
ఇది జరిగాక ఈ అంకిత భావాలు, గుర్తింపులు, సమైక్య కృషులు  ఇవన్నీ ఉత్త సొల్లే అన్న నా అభిప్రాయానికి మరింత ఊతమిచ్చాయి. విజయం వెనకే ఇవన్నీ వస్తాయిగానీ, కాస్త తేడా చేస్తే అంతా శూన్యమే. ఒక్కడి విజయాన్ని పదిమంది విజయము గా చెప్పుకొన్నట్లే, ఒకడి అపజయాన్ని పదిమంది కలిసి పంచుకోవటం అన్నది అసలు జరిగేనా?
ఇంక ఆ కాడికి ఈ పెద్ద పెద్ద మీటింగులూ, చెత్తా ఎందుకట? కాస్త ఆలస్యంగా అయినా "సమిష్ఠి విజయం" అని మాత్రమే ఎందుకన్నారో కూడా బాగా అర్ధమయ్యింది.
జీవితంలో కొన్ని సార్లు కొన్ని ఘోరాలు చేస్తుంటాము. అలాంటి ఓ పని చేసి తల బొప్పి కట్టించుకున్నా. బొప్పి కట్టించిన ఆ ఘోరం 'జల్సా'.
ఇదేదో వెక్కిరింపుగానో లేదా వేళాకోళానికో అడగట్లేదు. ఈ సినిమా చూసి ఎంతో కొంత నచ్చింది అనుకునే వాళ్ళెవరికైనా ' మంచి '  సత్తా ఉన్న సన్నివేశాలు (సినిమా పక్కనపెట్టండి) ఒక్క మూడంటే మూడు ఉంటే చెప్పండి.
దయచేసి సినిమా సినిమాలా చూడాలి అనకండీ. నేను సినిమాని పక్కా సినిమాగానే చూశా. ఇంకా చెప్పాలంటే సినిమాని సినిమాగా కన్నా ఇంకా నీచంగానే(గ్రేసు మార్కులిచ్చుకుంటూ) చూశా. త్రివిక్రం ఇలా కూడా తీయగలడా అనిపించింది.
నాకేమి నచ్చలేదో అని రాసే కంటే నాకు నచ్చినవి అని రాస్తే పని సులువవుతుంది అనిపించింది.  అదల్లా మహేష్ బాబు గొంతు. అంటే మహేష్ బాబుది అంత గొప్ప గొంతా అని అడగొద్దు. ఈ సినిమాలో ఇదొక్కటే నచ్చింది నాకు :-)
ఇది కాక మరో మూడేవైనా నచ్చితే చెప్పండి. నా బాధల్లా నేనొక్కణ్ణే ఈ జాబితాలోనా లేక నాకు తోడు ఉన్నారా అని తెలుసుకుందామనే.
గీ.
అరువదేడుల కొకసారి యరుగుదెంచు
వరుసలో సర్వధారి సంవత్సరంబు
ప్రభవ మొదలుగ లెక్కింప బడిన నిర్వ
దియును రెండేడ్లుగా దీని తెలియ నగును ||
గీ.
అరయ నీ భారతావని నాంధ్ర జనులు
దీని ప్రారంభ మొక పర్వ దిన మటంచు
చైత్ర మాసము శుక్ల పక్షమున వచ్చు
పాడ్యమిని వత్సరాదిగా పలికి నారు ||
తిరుమల తిరుపతి దేవస్థానం చేసే ధార్మిక, సామాజిక కార్యక్రమాల సూచి  కొండవీటి చాంతాడంత ఉంటుంది. శరణాలయాలు, విద్యాలయాలు, ఆసుపత్రులు, ప్రచురణలు  వగైరా వగైరా. ఇవన్నీ కూడా గాదె కింద పదికొక్కులు తినగా వస్తున్న ఫలితాలు. లేకపోతే ఇంకా ఎంత మందికి ఉపయోగపడేవో.
పుస్తకాల విషయానికి వస్తే, చిన్నప్పుడు బాలభారతి పేరుతో గొప్ప వ్యక్తుల జీవితాలకు సంబంధించిన పుస్తకాలు చిన్నవిగా పిల్లలకోసం వేసేవారు. తెనాలి రామకృష్ణ, భీష్ముడు, వ్యాసరాయలు మొదలైనవి. ఇవి చాలా భాషల్లో పిల్లల్లో చాలా ప్రాచుర్యం పొందాయి.
సాహితీ పరంగా రచయితలని ప్రోత్సహించే ఉద్ధేశ్యంతో ఇతిహాస, సంస్కృతీ సంబంధమయిన రచయితలకు వారి ప్రచురణ ఖర్చుల్లో 25% - 30% వరకు ధన సహాయం చేస్తున్నారు. మన ఆంధ్ర దేశంలో సాహితీ ప్రయోజనాలకి ఈ కార్యక్రమాలు ఎంతగా ఉపయోగపడ్డాయో చెప్పనలవికాదు. ఉత్తరభారతానికి గీతా ప్రెస్సు, ఘోరఖ్పూర్ ఎంతో దక్షిణాదికి తి.తి.దే అంతని చెప్పటంలో అతిశయోక్తి లేదు.
కొన్ని కొన్ని ప్రాజెక్టులు తి.తి.దే వారికి చాలా పేరు తెచ్చిపెట్టాయి. అలాంటి వాటిల్లో ఒకటి కవిత్రయ భారతం ప్రాజెక్టు. కవిత్రయ విరచిత భారతానికి అక్కడక్కడా మూల సంస్కృతాన్ని ఉదహరిస్తూ అనేక సంపుటాలలో ప్రతిపదార్ధతాత్పర్య సహితంగా ప్రచురిస్తూ వచ్చారు. ఈ మధ్యే అవి నా వద్దకు చేరాయి.  ఇప్పుడిప్పుడే చదవటం మొదలుపెట్టా. అందులో ముఖ్యంగా శాంతిపర్వంలో భీష్మ-ధర్మరాజు యొక్క ప్రశ్నోత్తరాలు చాలా ఉన్నతముగా ఉంటాయి. రాజధర్మాల గూర్చి ఎంత లోతుగా చెప్తాడో కొన్ని కొన్ని చోట్ల ఆశ్చర్యమేస్తుంది. రాజధర్మము గూర్చి భీష్ముడు చెప్పే మాటలు నేటికీ శిరోధార్యమే. మచ్చుకి.
ఆ:
కోరి తోటవాడు కుసుమ ఫలంబులు | కోయునట్లు రాజు కొనగవలయు
నప్పనములు; నరికి యంగారములు చేయు | భంగి యైన భూమి పాడు గాదె?
తా:
తోటమాలి కావలసిన పుష్పఫలాలను కోసుకొన్నట్లుగా రాజు కూడా జాగరూకుడై కప్పాలను గ్రహించాలి. అట్లా కాక ఫలపుష్పాదులు ఇచ్చే చెట్లను నరికి నిప్పుపెట్టి బొగ్గులుగా చేస్తే భూమి నాశనమౌతుంది. కాబట్టి తోటమాలివలె రాజు జాగరూకుడై ప్రజలను సమ్రక్షిస్తూ కప్పం గ్రహించాలి.
కం:
తను హీనుండని యెరుగక | మును ప్రబలునితోడ శీఘ్రమున సంధానం
బొనరింప వలయు నతనికి | ధనం బొసంగియైన బతికి దగు నిల గావన్
తా:
తాను బలహీనుడని శత్రువులు గ్రహించకముందే, తనకంటే బలవంతుడైన శత్రువుతో వెనువెంటనే సంధిచేసికొనుట అవసరం. చివరకు శత్రువుకు ధనమిచ్చి అయినా సరే, తన రాజ్యాన్ని సంరక్షించుకోవటం రాజధర్మం.
రత్నాలు ఇలాంటివెన్నెన్నో...
అలాంటి తి.తి.దే ఆస్థులని దోచుకోవాలనుకునే ఏ ప్రభుత్వ దురాలోచననయినా మనం ఎప్పటికప్పుడు అడ్డుకోవాలి. లేకపోతే ఆస్థుల నాశంతో పాటు, ధార్మిక కార్యక్రమాలకీ తీవ్ర విఘాతం జరిగితీరుతుంది.
ఇవ్వాళ మన నిత్యానంద స్వామి లీలలు వార్తా పత్రికల్లో చూసిన తర్వాత... భగవంతుణ్ణి, భక్తుణ్ణి అనుసంధించటానికి "అంబికా దర్బార్ బత్తి" కంటే గొప్ప సాధనమేముందా అని అనిపిస్తోంది.
చాణ్ణాళ్ళ క్రిందట కంచి స్వాములోరు కొట్టిన దెబ్బకి ఇంకా తేరుకోనే లేదు, మరో దెబ్బ ఇప్పుడు. ఈ సమయంలో ఈ పాటని వినటం మించిన కాలక్షేపం మరోటి లేదనిపిస్తోంది. విని, చూసి తరించండి.
<object width='425' height='350'><param name='movie' value='http://www.youtube.com/v/1oZBNuSFMkU'></param><param name='wmode' value='transparent'></param><embed src='http://www.youtube.com/v/1oZBNuSFMkU&rel=0' type='application/x-shockwave-flash' wmode='transparent' width='425' height='350'></embed></object>
కవిత్వం  అబద్దానికి పుట్టిన ఆడపిల్ల -- అజ్ఞాతకవి
పదములతో భావనకు భ్రాంతి కలిగించుటయే కవిత్వం -- గోల్డ్ స్మిత్
నగ్నసత్యం వేదాంతం, అలంకృత సత్యం కవిత్వం -- బోయి భీమన్న
బాధ నుంచి ప్రభవించు కవిత, అందుకే అక్షరమ్ము రాక ఐతి కవిని -- ఆరుద్ర
సాగి కమ్మెచ్చునన్ వచ్చు తీగకరణి
సాలెపురుగు కడుపులోని నూలువలెను
దబ్బునన్ దొర్లిపడు కొండధార మాడ్కి
సహజకవిత బయలపడి సన్నుతిగను -- ఆదిభట్ల నారాయణదాసు
కవిత్వం ఒక మెరుపు, కాదది పొడి మాటల కూర్పు -- ఖలీల్ జిబ్రాన్
మనసు మల్లెపొదల్లోంచి పసందైన వాసనలు వీచి,
అవి పద్యాల సీసాల్లో అనంతకాలం నిలిస్తే కవిత్వం -- దాశరధి
అగ్ని జల్లినా అమృతం కురిసినా , అందం ఆనందం దాని పరమావధి -- తిలక్
కల నిజపరచటం కాదు కవిత్వం
నిజాన్ని కలగనడమే దాని తత్వం -- ఆరుద్ర
ఆవేశమప్రయత్నముగా మూర్తీభవించియుండు పదములును, భావములునూ గాక కవిత్వమనగా ఇంకేమి? -- జాన్ స్టువర్ట్ మిల్
కప్పిచెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శనం -- సినారె
గొప్ప కవిత్వం ప్రధాన లక్షణమేమంటే, ఎవరి తాహతును బట్టి వారికి ఎంతో కొంత అనుభూతిని అందించగలగటం -- చలం
అన్య భాషల్లోకి అనువదించటం సాధ్యం కానపుడే అది గొప్ప కవిత -- బేకన్
నాగరికత అభివృద్ధి చెందినకొద్దీ కవిత్వం దాదాపు తప్పని సరిగా క్షీణిస్తుంది -- మెకాలే
అంత్యప్రాసలు వేసినంత మాత్రాన ప్రోజైక్ భావం పోయట్రీ అవదు. కవిత్వం ఒక అల్కెమీ, దాని రహస్యం కవికే తెలుసు -- తిలక్
12, 13 నిర్వచనాలు నాకు బాగా నచ్చాయి, కానీ 14 లో మొదట నాగరికతకీ, కవిత్వానికి లంకె నేరుగా ఎందుకు పెట్టాడో అనిపించింది. బహుశా, ప్రకృతితో నాగరికతని ముడిపెట్టి, తరిగిపోయే ప్రకృతి సంపదతో పాటే కవిత్వం కూడా నశిస్తుందన్నాడేమో.  ప్రకృతి లేని కవిత్వమేమిటి, అవును నిజమే,  కానీ అది పాశ్చాత్యులకు నప్పుతుందేమోగానీ, నూటొక్క రకాల కవిత్వాలని కనుక్కొన్న మన వాళ్ళు దీనిని ఒప్పుకుంటారా?
**  మన్నవ గిరిధరరావుగారి "మణిదీపాలు"  నుంచి
న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థలోకి చొరబడి అవాంఛిత అధికారాన్ని కూడగట్టుకుంటోందని, మన రాజకీయ పార్టీలు చాలా కాలంగా గగ్గోలు పెట్టటం చూస్తునే ఉన్నాము. మరలాగని శాసన వ్యవస్థ ఏమైనా సామాన్యుడి అక్కరకొస్తోందా అంటే, అదీలేదు. ఇది "అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు" లాగా మారింది.
ఈ ఉపోధ్గాతం ఎందుకంటే, మళ్ళీ మరో జూనియర్ డాక్టర్, అందులోనూ ఆడ డాక్టర్ ని తీవ్రంగా కొట్టి గాయపరచటం. మొన్నటి గొడవ ఇంకా సద్దుమణగలేదు, అప్పుడే మరో ఘటన. తప్పు ఒప్పు పక్కన పెడితే, మనకీ బీహార్, ఉత్తరప్రదేశ్ తాలూకు ఆటవిక సంస్కృతి బాగానే వంట పడుతున్నట్టు అనిపిస్తోంది.తీసుకున్న అప్పు తీర్చమని గట్టిగా పట్టుపట్టినందుకు, మొన్నీ మధ్యే ఏకంగా ఓ బ్యాంకు మేనేజర్ని అంతమొందించారు.
గట్టి చర్యలు తీసుకోలేని అసమర్ధ ప్రభుత్వాలు ఈ పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి.
ఇప్పుడు భూగోళానికి మరోవైపు.......
నా గ్రీన్ కార్డుని నేం చెక్  అన్న సాకుతో ఎఫ్.బీ.ఐ దాదాపు మూడేళ్ళుగా పెండింగులో పెట్టి హింసించారు. ఎందరో నా తరువాతి వాళ్ళు గ్రీన్ కార్డు పుచ్చుకోవటం కూడా అయిపోయింది. ఎదురు చూసి చూసి, కాస్త ధైర్యం చేసి ఏకంగా ఎఫ్.బీ.ఐ మీదే ఓ సివిల్ దావా సొంతంగా వేసి, ఓ వారం క్రిందట విజయవంతంగా గ్రీన్ కార్డు సంపాదించాను. ఆలస్యమయినా సరే, ఈ తృప్తి, న్యాయాన్ని సాధించుకున్న ఆనందం వేరే కదా. ఇదంతా రెండు మూడు నెలల్లో జరిగిపోయింది. మీరు గమనిస్తే, ఇక్కడ శాసన వ్యవస్థ బద్దకించింది(నా విషయములో), కానీ న్యాయవ్యవస్థ సరిచేసింది. సామాన్యుడికి అన్యాయం జరుగుతున్నప్పుడు, ఏ వ్యవస్థయితే ఏ మేలుచేయడానికి? ఇక్కడెవడూ గగ్గోలు పెట్టలేదు, ఒకరి వ్యవస్థలో ఒకరు జోక్యం చేసుకున్నారని.
కానీ మన తోలు మందపు నాయకులకిది రుచించేనా?
లోక్ సత్తా లాగా మరీ మంచిగా ఉన్నా మన జనాలకి నచ్చరు. వ్యవస్థని మార్చే అంత శక్తి లేకపోయినా, (కలలు బాగానే కంటుంటాను ఏవో అతీంద్రియ శక్తులు వస్తే, ఈ మన వెధవల్ని మట్టికలిపేద్దామని, ఏ అపరిచితుడు లాంటి  సినిమా చూసినప్పుడు). వ్యవస్థని మార్చే శక్తి లేదు గనక, కొత్త వ్యవస్థలో భాగమయిన ఇలాంటి ** పిల్లలకి ఉన్నంతలో సహాయం చేయటం ద్వారా, మార్పు ఇప్పుడు కాకపోయినా, మరో తరంలో చూడొచ్చనే ఆశ.
నా భూమి పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి అని ప్రపంచం తెలియని వయసులో చదివినప్పుడు బాగానే అనిపించేది. ఇప్పుడదే చదువుతుంటే, ఎందుకో ఆత్మారాముడు ఆ పదాల్ని జీర్ణించుకోలేక తెగ ఇబ్బందిపడుతూ, ఎందుకురా ఈ ఆత్మ వంచన, ఎన్నాళ్ళు మీ తాతల నేతులు తాగిన మూతుల తాలూకు వర్ణనలతో తృప్తి పడిపోతావ్ అని వెక్కిరిస్తుంటాడు.....
**ఇక్కడే, ఏదో బ్లాగులో పరిచయమయిన లంకె, బ్లాగు గుర్తు లేదు.
<object width='425' height='350'><param name='movie' value='http://www.youtube.com/v/RXeqyp55JTw'></param><param name='wmode' value='transparent'></param><embed src='http://www.youtube.com/v/RXeqyp55JTw&rel=0' type='application/x-shockwave-flash' wmode='transparent' width='425' height='350'></embed></object>
సౌ అంటే వందట...ఛా... మంచి భాగ్యాన్ని కాస్తా వంద భాగ్యాలు చేసేసారు.
తెలిసిందల్లా, ఇదే సౌభాగ్యమయితే ఇంతకన్నా దౌర్భాగ్యం మరోటి లేదు అని. ఆ యాడ్లో చెప్పించిన విధానం చూస్తే, కొత్తవాళ్ళు అసలు సౌభాగ్యానికి అదే అర్థమనుకున్నా ఆశ్చర్యం లేదు.
మరయితే, (దో)శ అంటే రెండుశ అనీ, (చే)దు ని ఆరుదు అనీ, (నౌ)కరుని తొమ్మిదికరు అనీ అనొచ్చనమాట. భలే ఉన్నాయి కదూ ఈ కొత్త పదాలు.
రానారె గారు రామాయణం ఈ కాలానికి ఎలా వర్తిస్తుంది అని అడిగారు. పెద్దగా విశ్లేషణలేకుండా సరళంగా చెప్పటానికి నాకు స్వదేస్ లో ఈ కింద పాట బాగా నచ్చింది. ముఖ్యంగా,
मन से रावण जॉ निकाले, राम उस के मन मे है
అన్న వాక్యం. అదంత సులభం కాదన్నది వేరే విషయం అనుకోండి, కానీ ప్రయత్నించటంలో తప్పులేదు. చిన్న వాక్యమైనా, చాలా ఉత్తేజపరుస్తుంది.
రెండోది, ఈ లంకె. సమకాలీన దృక్పధంతో కూడిన విశ్లేషణ. నాకు ఇది కూడా బాగా నచ్చింది.
మూడోది ఈ పుస్తకం.
అయినా, రాముడు మంచి బాలుడు అంటూనే, అందులోనే మళ్ళీ శ్లేషగా వీడు ఈ కాలానికి తగ్గవాడు కాదు అని చెప్పటానికి ఆ మాటవాడినప్పుడే, మనం రాముడికి దగ్గరవటానికి ఎంత భయపడుతున్నామో తెలుస్తూనే ఉంది కదా. :-)
<object width='425' height='350'><param name='movie' value='http://www.youtube.com/v/Hc-0RMcTFTw'></param><param name='wmode' value='transparent'></param><embed src='http://www.youtube.com/v/Hc-0RMcTFTw&rel=0' type='application/x-shockwave-flash' wmode='transparent' width='425' height='350'></embed></object>
మన వాళ్ళు ఎప్పటిలాగే అక్టోబరు రెండో తారీఖుని, గాంధీ జయంతి పేరుతో స్వలాభం చూసుకోటంతో మొదలెట్టారు. కాకపోతే, ఈసారి కొంచెం వెరైటీగా గాంధీ గారి మీద మరింత దొంగభక్తితో.
ఇంతకీ విషయమేంటయా అంటే, గాంధీ గారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదట. అయినా నా పిచ్చి కాకపోతే, ఇస్తే గిస్తే నోబెల్ వాడికి గాంధీ ప్రైజ్ ఇవ్వాలి గానీ, గాంధీ గారికి నోబెల్ ప్రైజ్ ఇస్తారా అని అడుక్కోవటమేమిటి? ఇది గాంధీ గారి విలువ మరింత తీసేసినట్లు కాదూ.
అదీకాక, నా సొంత అభిప్రాయం సుమా, బతికున్నప్పుడు లేని గుర్తింపు చనిపోయాక ఇస్తా అనటం మించిన మూర్ఖత్వం ఉంటుందా? అసలు ఇలా చేసే, మన పద్మ అవార్డులన్నిటి విలువ తీసేసారు.
నోబెల్ వల్ల గాంధీ గారికి కొత్తగా ఒరిగేదేమీ లేదు ఈరోజు. ఆయన ఎప్పుడూ "నోబులే". కొసమెరుపేమంటే, ఇవ్వాళే నోబెల్ వాళ్ళు గాంధీ గారికి నోబెల్ ఇవ్వకపోవటం మా తప్పే అన్నారు. ఏమిటో, ఈ బ్రతిమాలుకుని తెచ్చుకునే కిరీటాలు పెట్టుకునేవాళ్ళకెలా ఉన్నా, విషయం తెలిసిన వాళ్ళకి మా చెడ్డ చిరాగ్గా ఉంటుంది.
ఓరీ హేతువాదపు ముసుగులో ఉన్న అవకాశవాద కరుణానిధీ!
ఏదో తెలిసీతెలియక వాగుతున్నావులే అని ఊరుకుంటే, మరీ తెగ రెచ్చిపోయి, హిందూ సహనశీలతని బలహీనతగా భావిస్తున్నట్లునావు. నీకిదే రామబాణం లాంటి నా సమాధానం.
ఏమన్నావ్,  రాముడు కల్పనా? వాల్మీకి కట్టుకథ రాశాడా? వానర సేన సేతువు నిర్మించటం హాస్యాస్పదమా?
సరే, అయితే ఇది విను. అమెరికాలో హోవర్ డాం గురించి తెలుసా? నీకెందుకు తెలియదులే, ముదురు రాజకీయ నాయకుడువి కదా, చూసినా చూసే వుంటావు. ఆ డాం కథ విని నోరెళ్ళబెట్టినా, నిజమని ఒప్పుకుంటావు కదా అది కట్టింది మానవులే అని.
ఈజిప్టు పిరమిడ్లు నిజమని ఒప్పుకుంటావు కదా. ఏనాడైనా, అంతలేసి రాళ్ళు అంత పైకి తీసుకెళ్ళటం అసాధ్యమని పిచ్చి కూతలు కూస్తావా? తాజ్ మహల్ మనుషులు కట్టారనీ ఒప్పుకుంటావ్ కదూ. మరింకేం రోగం రామ సేతువుని నమ్మటానికి!
అబ్బే నాకు వేరే మతాల వాళ్ళని కించపరచాలంటే మా చెడ్డ భయం, పళ్ళు రాలగొడతారు, తోలు వలుస్తారని . మన హిందువులయితే తేరగా దొరికారు అంటావా, ఇది విను.
కంచి, తంజావూర్ గోపుర ప్రాకారాలు, గోపురాల మీద పెట్టిన ఆ బరువయిన శిలలు ఎలా ఎత్తారని ప్రశ్నించావా? అదే పని, ఈనాటి మానవ శక్తితో సాధ్యమేనా? లేదే? మరి ఈ తింగరబుచ్చి వాగుడేమిటి నాయనా?
ఇది చాలదన్నట్లు, ఓ ఏదో కొండని తవ్వి ఎలుకని పట్టినట్లు, రాముడు మద్యపాన ప్రియుడు అని వాల్మీకి చెప్పాడు అని సందర్భంలేకుండా వాగుడా? తమరికి తెలియదు కాబోలు, ఆ సందర్భంలోనే వాల్మీకి హనుమంతునితో రాముడు మాంసభక్షణ చేసేవాడన్నట్లు చెప్పించాడు.  ఓ వెర్రి నాగన్నా, ఇంకో పాయింట్ దొరికిందని చంకలు గుద్దుకోకు, చెప్పేది పూర్తిగా విను.
అసలు సందర్భం ఏమంటే, సుందర కాండలో హనుమంతుండు సీతాదేవిని కనుగొని ఆమెతో రాముడి విరహ వేదనను వర్ణిస్తూ, నీ విరహములో రామచంద్రుడు మధుమాంసాదులు త్యజించాడు తల్లీ అని చెబుతాడు. అయినా, బ్రాహ్మణుడు బొట్టు ఎందుకు పెట్టుకున్నాడు, కుమ్మరి కుండలు ఎందుకు చేస్తున్నాడు అన్నట్లుంది నీ వాగుడు. మిగిలిన అవతారాలకీ, రాముడికి ఉన్న తేడా అదే. రాముడు ఏమీ మ్యాజిక్కులు చెయ్యడు, కృష్ణునికి మల్లే. రామావతారం మొత్తం రాముడు ఒక సామాన్య మానవునిలానే ప్రవర్తించాడు. అందుకే ఆయన్ని "మర్యాదా పురుషోత్తముడు" అన్నారు. "రాముడు సీతని శంకించాడు" అని రంధ్రాన్వేషణ చేసుకున్నప్పుడున్న నమ్మకం ఇప్పుడేమైంది? రాముడు క్షత్రియుడు. ఒక క్షత్రియుడు మాంసాహారం తినడం, మద్యపానం చేయడం అన్నది ఆ సందర్భంలో చూడాలి గానీ, ప్రజల్ని ఏమార్చటానికి చెత్తగా వాగుడు వాగితే హిందువులు సహించరు.
నీ చావు తెలివితేటలు ఉపయోగించి,  సేతువుని కూలిస్తే మాకు, దేశానికి బోలెడు ఉపయోగం అని వాగావే అనుకో, ఈ రామబాణం కాచుకో. దేశంలో ఎన్నో రోడ్లలో విస్తరణకి అడ్డంగా సమాధులు, దర్గాలు ఉన్నాయి. అప్పుడు వాగకపోయా, అల్లా లేడు అంతా మిధ్య అని.
ఒరే దొంగ హేతువాదీ, హిందువుల బలహీనత అనబడు సహనమే నీ చేత ఈ వాగుడు వాగిస్తోంది. లేదంటే, ఏనాడో అరబ్బు లేదా యూరోపులో నీకు మరణ శిక్షో లేదా జైలుపాలో చేసేవాళ్ళు. కాబట్టి వెధవ బింకాలకు, పంతాలకు పోక మర్యాదగా హిందువులని క్షమాపణ కోరి బుద్ధి తెచ్చుకో!
నేనందుకే ఊరికే అనలేదు, బి.జే.పీ ఎంత వెధవ పనులు చేసినా, ఈలాంటి దరిద్రులనుంచి మనల్ని రక్షించుకోవాలంటే, మన తరపున కొద్దో గొప్పో (వాళ్ళ స్వార్థమయినా సరే) మాట్లాడే వాళ్ళంటూ ఒకరుండాలి. లేకపోతే, ఫిజీ తరహాలో, మనల్ని త్వరలో వేరే వాళ్ళు పాలించే రోజు దగ్గర్లోనే ఉంది.
ఈరోజు వార్తల్లో ఈ విషయం చదివితే నమ్మశక్యం కాలేదు. ఒకటికి రెండు పేపర్లు తిరగేసి చూశాక, ఇంత దారుణమా అనిపించింది. రామసేతువు ఉందా లేదా అన్న విషయం పక్కనపెడితే, అసలు రాముడు మరియు రామాయణం(రాముడే లేని రామాయణం ఎక్కడుంది)  ఉనికినే ప్రశ్నిస్తూ మన ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం చూస్తే, ఈ కుహానా లౌకిక వాదులు దేశ సంస్కృతిని ఎంతగా మంటగలుపుతున్నారో అనిపిస్తోంది. ఇలా శాస్త్రీయత, ఋజువుల పేరిట తరతరాలుగా మన పూర్వుల నుంచి అందించబడిన శాస్త్రాలు, రాముని పట్ల ఈ దేశ ప్రజలకున్న నమ్మకాన్ని అవమానిస్తే, ఎవడో వేరే అన్యమత దురహంకారి అవసరం లేదు, మనల్ని మనమే త్వరలో భ్రష్టు పట్టించేసుకుంటాం.
"But the protests seem to have had no effect on the Central Government. Its counsel on Wednesday told the Supreme Court there was no historical evidence to suggest Ram or the Ram Sethu ever existed. And thousands of kilometres away in Tamil Nadu, the mood was quite the opposite. "
కొద్ది రోజుల క్రిందట నాగరాజు గారు తర్కం మీద రాసిన బ్లాగు చదివాను. చదివాక చాలా చాలా సందేహాలు మొలకెత్తాయి. కొన్నింటికి సమాధానాలు అక్కడా ఇక్కడా చదివి కొంతమేరకు సమాధానపడ్డాను. కానీ, ఒకటి మాత్రం నన్ను వెంటాడుతూనే ఉంది. అదేమిటయ్యా అంటే, కవిత్వానికి తర్కం అవసరం లేదా? నిజంగానే అస్సలు అవసరంలేదా? అదే బ్లాగులో కొద్దిగా రానారె గారికీ నా సందేహమే వచ్చిందా అనిపించింది.
అగ్నికి ఆజ్యం తోడైనట్లు, ఈమాట లో చావా కిరణ్ గారిచ్చిన ఈ లంకె చూసి ఆ కవితలు, చర్చ చదివి ఎవరో కవితకి తర్కం బద్దశతృవు అనటం చూసి. ఇక లాభం లేదురా అబ్బాయ్, నీ బాధని, నీ సంశయాన్ని బయటికి కక్కేయ్ అని అంతరాత్మ ఘోషిస్తూంటే, ఇదిగో ఇలా బయటకి చెప్పేసుకుంటున్నా!
మొదటగా గణితమే తీసుకుందాం. 1+1 ఎంత అనగానే 2 అంటున్నాము. ఎవడైనా 3 అంటే తర్కించి వాడిని ఒప్పిస్తున్నాము. కానీ అసలు 1 కి 1 కలిపితే 2 అని మనం ముందుగానే అంగీకరించాం (అందరూ అలానే నేర్చుకుంటున్నారు కాబట్టి). నే చెప్పదలచుకున్నదేమంటే, మన చుట్టూ ఉన్న నలుగురు నమ్మినదాన్ని ముందుగా మనం నమ్ముతున్నాం. ఆపై దాని ఆధారంగా, ఆ విషయానికి సంబంధించిన దానిపై మంచా చెడా అని తర్కిస్తున్నాము. అసలు గణితం అంటే తెలియని వాడికి 1,2,3 అంటే ఏవో రాతలో లేక చిత్రాలో అనుకుంటాడు అంతే కదా.
ఇప్పుడు కవిత్వానికొద్దాం.
ఈమాటలోని కవితే తీసుకుందాం.
"ఎంతదారి తప్పి
ఎక్కడెక్కడో తిరిగినా
ఎట్టకేలకు నీటి జాడ"
ఈ వాక్యాలే చదివితే, పరిస్థితి నే పైన చెప్పిన (గణితం రానివాడి పరిస్థితే) 1,2,3 లానే ఏమీ అర్థం కాదు. కానీ కవిగారు అంతటితో ఆగిపోలేదు. వెంటనే,
"అడవిలో మరొక సారి
తప్పిపోవాలనుంది" అన్నాడు.
ఆ "అడవి" అన్న పదంతో మొత్తం అర్థం అవగతమైపోయింది. మరి కొన్ని సందర్భాలలో కవి ఉపమానాలూ, ఉపమేయాలూ, వర్ణనలు ద్వారా విషయం చెబుతాడు.
ఇదో చిన్న ఉదాహరణ. సాధారణంగా కవి ఏ మాత్రం తర్కానికి నిలబడని విషయాలు రాసే సాహసం చెయ్యడు, తన తార్కిక ఆలోచనా పరిధికి మించిన సాహసం చెయ్యకుండా ఉంటేతప్ప. లాజిక్ అన్నది కవితని తవిక కాకుండా కాపాడుతుందని నా భావన.  అబ్బే,  మేమనేది కవిత యొక్క అర్థంలో లాజిక్కు కాదు, కవిత యొక్క పదాల కూర్పులో లాజిక్కు,  పదాల కూర్పులో లాజిక్కుతో అస్సలు పనిలేదు, భావంలో పసవుంటే చాలు అంటారేమో.
మరిప్పుడు నే పైన చెప్పిన 1,2,3 మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. అంకెలు తెలియనివాడికి 1+1 అర్థం తెలియనట్లే, కవి వాడే పదాలు ఇల్లాజికల్ అని విషయ పరిజ్ఞానం లేని వాడికి అనిపించొచ్చు. ఆ జ్ఞానం ఉన్నవాడికి అదేమీ ఇల్లాజికల్ గా ఉండదు. తర్కం అన్నది ఇక్కడ "రెలెటివ్".  అంటే నాకర్థమయినట్లు మరొకడికి కవి హృదయం అర్థం అవాలని లేదు కదా.   ఆమాత్రానికే, కవి ఏవో లొల్లాయ్ పదాలు వాడాడంటారా?  ఈ సాకుతో టోకుగా కవిత్వానికి అసలు తర్కంతో సంబంధం లేదు అనటం నాకు వినటానికి చాలా కష్టంగా ఉంది.
పనిలో పనిగా నిన్న ఈనాడులో ఉన్న శ్రీశ్రీ గారి కవితలు చాలా వరకు చదివేశా. ఆయన ఏమీ ఇల్లాజికల్ గా రాసినట్టు నాకు అగుపించలా.  సినారె గారి ఈ కవిత చూడండి.
"ఈ గద్దె కోసమేనా ఇన్ని వేషాలు వేసేది
ఈ గడ్డి కోసమేనా ఇన్ని మోసాలు చేసేది
ఇందులో గడ్డిని గడ్డి గానే భావిస్తామా? బుర్రకి వెంటనే పదునుపెట్టి డబ్బు అని అనువదించుకోమూ? గడ్డి అన్న పదానికి గడ్డి మాత్రమే అర్థం తెలిసినవాడికి ఇవి తర్కానికి నిలబడని వాక్యాలు. మిగిలిన వారికి కాదు కదా.
నాకినిపిస్తుంది, కవిత్వం అనే గమ్యం కోసం రెండు వైపులా తాళ్ళుకట్టి ఒక దారి(క్యూ) తయారు చేశామనుకుంటే, లాజిక్(తర్కం) అన్నది కవిని ఆ తాళ్ళు దాటి పోకుండా కవిని హెచ్చరిస్తూ గమ్యానికి చేరుస్తుంది. తర్కంతో నిమిత్తం లేదనుకునే కవి ఆ రెండు తాళ్ళ మధ్య కుదురుగా ప్రయాణించలేక, వాటిని బయటకు తోసుకుంటూ వంకర టింకరగా గమ్యంవైపు పయనిస్తాడు.
ఇల్లాజికల్ కవిత్వమేదో ఇక్కడ నేను చూపిస్తున్నాను.
ఇదో సినిమా పాటలోది
బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే ...
బంగాళాఖాతంలో నీటిని ఒక ప్రేయసితో పోలుస్తున్నాడు కవి. అంటే ప్రేయసి సముద్రంలో నీళ్ళలా ఉప్పగా ఉంటుందనా లేక ఆమె హృదయం ఆ సముద్రం అంత లోతనా? హాయిగా ఎగురుతూ ఇలాంటి అర్థంతో ఎందుకు పాడాడబ్బా? ఇది నాకు ఇల్లాజికల్ గానే కనపడింది. కానీ ఈనాడులో ఈ వ్యాసం చదివాక, ఓహో అదా కవి హృదయం అనుకున్నాను. కాబట్టి, తర్కం అన్నది ఇక్కడ "రెలెటివ్". నిజానికి నాకిప్పటికీ ఈ పాట ఇల్లాజికల్ గానే ఉంది. ఎందుకంటే, కడలిని పుంలింగంలో వ్యవహరిస్తారు. మరి కడలి అలలు స్త్రీ వయస్సుతో ఎలా పోలుస్తాడు?
ఇంకో పాట ఉంది,
స్ట్రాబెరి కనులా..... అని మెరుపు కలలు సినిమాలో
ఇది డబ్బింగ్ పాటా కాదా అన్నది పక్కన పెడితే, మాతృక తమిళంలో ఉన్న అర్థాన్ని అలానే తెలుగులో అనువదించాడు కవి. స్ట్రాబెరీ పండుకీ, కళ్ళకి ఏమిటి సంబంధం? రంగులోనా, రుచిలోనా, ఆకృతిలోనా? దీని రహస్యం ఇంకా తెలియలేదు నాకు.
జంధ్యాల గారి సినిమాలో కవితలు
నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా,
నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా...
హాస్యాత్మకంగా బానే ఉందీ కవిత. మరి మనం దీన్ని ఎందుకు హర్షించం? బాగోలేదనటానిక్కూడా మనం లాజికల్ గా ఆలోచించి, ఈ కవి ఏంటి మనల్ని భయపెట్టి తనను కవిగా చెప్పుకుంటున్నాడని,  దానిని మంచి కవిత్వంగా స్వీకరించలేకపోతున్నాము. ఏదో నోటి మీద ఆనుతున్నాయని సినిమాల్లో కవితలు చెప్పాను. కానీ ఆధునిక కవిత్వంలో ఇవి కోకొల్లలు.
ఇంతకీ నేను చెప్పొచ్చేదేమంటే, టోకుగా కవిత్వానికి తర్కానికీ అస్సలు సంబంధం లేదని చెప్పకండి. అలా అని, నేనేదో గొప్ప కవిని కాదు. ఏదో కొద్దిగా సాహిత్యం మీద ఆసక్తి ఉన్నవాడిని, అంతే.  నా అభిప్రాయం తప్పని వివరిస్తే సరిదిద్దుకోటానికి వెనకాడను.
నా భయమల్లా కవిత్వానికి తర్కానికి లంకె లేదని రెచ్చిపోయి జనాలు కోతికి కొబ్బరికాయ దొరికినట్లుగా కవిత్వం రాసుకుంటూ పోతే, ఇక చదవగలమా? జంధ్యాల గారు హాస్యానికి చెప్పిన తవికలే ఇక మనకి కవితలుగా మిగులుతాయేమో అని నా భయం. అంతే.
అహో నా భరత దేశమా! ఏమని పొగడను నీ ఘనత!
రక్తం మాకు ఇక్కడ నిత్యం చుట్టం
ప్రాణం విలువ మాకు తృణప్రాయం||
ప్రజల పాట్లు ఇక్కడ పాలకులకు ఓట్లు
ప్రజల అమాయకత్వం పాలకులకు వరం||
అనుభవాల పాఠాలు నేర్వని మా నాయకులు
శవాల ప్రేగుల్లో ఓట్లేరుకునే రాబందులు||
ఒక బేవకూఫ్** కి ఎవరో ఏదో చేస్తారని ముందే తెలుసుట
మరైతే ఇది ఏమీ చేయలేని నిస్సహాయతా లేక నిర్లజ్జా?
మన భాగ్యనగరంలో జరిగిన ఘోరకలికి బాధతో నా హృదయ స్పందన ...
** "State Home Minister alleged the state government had recently got intelligence inputs that Pakistan’s Inter-Services Intelligence planned terror attacks in the state"
[googlevideo=http://video.google.com/videoplay?docid=1620579318056537112&q=jagamanta&total=5&start=0&num=10&so=0&type=search&plindex=1]సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఈపాట నచ్చనిదెవరికి? ఈ పాట అర్థం స్వయంగా ఆయన్నోటివెంటే వినాలనుకుంటే, ఈ వీడియో చూడండి. మరీ ముఖ్యంగా, చివరి నిముషాలలో వివరణ అధ్భుతంగా ఉంటుంది.
తెలుగు కథ అనగానే నాకు చదవాలంటే భయం. ఎందుకంటే, ఎంతసేపు బరువయిన పాత్రలు, సంభాషణలు పలికిద్దామనే తాపత్రయమే తప్ప, అసలు ఈ కథని ఒక సామన్యుడు (నేననుకునే సామాన్యుడికి తెలుగు బాగా చదవటం, వ్రాయటం మరియు అర్థం చేసుకోవటం మాత్రమే వచ్చు సుమండీ, వాడికి తెలుగులో ఎమ్మేలు, పీహెచ్డీలు ఉండవు) చదువుతాడా లేదా అన్న ఆలోచనలు కనపడవు.
క్షమించాలి, దయచేసి కథా రచయితలు కథ, వస్తువు, కథనం, విశ్లేషణ, భావుకత లాంటి బరువయిన పదాల ఊబి లోంచి బయట పడ్డట్టయితే, సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు చదవగలుగుతారు.
జల్లెడలో కొత్తపాళీ గారి బ్లాగు చూసి ఈ కథ ఇద్దరు దుర్మార్గులు దగ్గరికి వచ్చాను.
నేను కథ లోతు పాతులకు వెళ్ళ దలచుకోలేదు. ఎంచేతంటే, ఈ కథ పైన ఉదహరించిన వాటికి అతీతమేమీ కాదు. బహుశ రచయిత కూడా అదే ఊబిలో దిగబడిపోతున్నాడేమో అనిపిస్తోంది.
ఈ సామాన్యుడి అభిప్రాయం తప్పనిపిస్తే, దులిపేసుకోండి. విషయముందనిపిస్తే, గ్రహించగలరు!
–వికటకవి