మంచి పొద్దుగల.
అందరూ బాగున్నరా? హిందుస్తాన్‍ల ఉన్నవాళ్ళకి, ఇంగ్లీస్తాన్(అమెరికా)ల ఉన్నవాళ్ళందరికీ మంచిపొద్దుగల. అందరికీ ఒకేసారి ఎలాగంటరా? ఇప్పుడు మాకైతే పొద్దుగల ఐంది. అమ్రీకల ఉన్నోళ్ళు మస్తుగ పడుకొని ఉంటరుగదా. లేచినంక  ఇది చదివినపుడు పొద్దుగల అయితది గదా! అందుకే అందరికీ ఈ సరూప మళ్ళీ మంచిపొద్దుగల.
దసర పనులు నడుస్తున్నయా అందరి ఇండ్లల్ల. ఇల్లు దులుపుడు, కడుగుడూ, కొత్తబట్టలు. తిననీకి పిండి వంటలు. పెద్ద పండగ కదా..
ఐతే నేను మీకు ఒక ముచ్చట చెప్పనీకి వచ్చిన. జరంత ఇనండి. మనకు పనికొస్తదనే కదా ఫోన్లు పెట్టుకునేది. కాని మస్తు పరేషాని అవుతుంది ఈ ఫోన్లతోని. ఎవడో ఒకడు ఫోన్ చేసి  దానికి అప్పిస్తము, దీనికి అప్పిస్తము అని. తర్వాత కట్టకుంటే రౌడీలతోని బెదిరించుడు. వద్దురా అంటే వినరూ. ఇంక కొంతమంది ఐతే ఫోన్ చేసి మాట్లాడరు. ఒకసారి ఇట్లనే అయింది. రోజు ఫోన్లు వస్తున్నయి. నేను హలో అనగానే పెట్టేస్తుండ్రు. రెండు మూడు రోజులు చూసిన. ఇంట్లో ఎవరినీ ఫోన్ ఎత్తొద్దు వీడి సంగతి తేలుస్తా అని ఫోన్ రాగానే హలో అంటే పెట్టేసిండ్రు మళ్ళీ. మా ఫోన్ల నంబరు కనిపిస్తది. ఎంటనే ఆ నంబరుకు ఫోన్ చేసిన. అదేదో పోరగాల్ల హాస్టలంట. ఎవరో పెద్దాయన మాట్లాడిండు. ఎవరూ చేయలేదన్నడూ. నేను గరమ్ అయి చేయకుంటే నాకేమన్నా తిన్నదరక్కనా మళ్ళీ ఫోన్ చేసింది. ఎవరు చేసారో కనుక్కో మళ్ళీ ఈ నంబరు మీద ఫోన్ వస్తే పోలీసు కంప్లెయింటు ఇస్తా అని చెప్పిన. అంతే మళ్ళి రాలా. ఇలా రెండు మూడు సార్లు లొల్లి జరిగింది.
మా బాడలో ఓ కాలేజీల సదివే పిల్ల ఉంది. ఒకసారి ఆ పిల్లకు ఎవడో బద్మాష్‍గాడూ ఫోన్ చేసి ఎదేదో మాట్లాడిండంట. ఆ పిల్ల తిట్టి పెట్టేసింది. అయినా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి సతాయిస్తుండు. పాపం వాళ్ళ నాయనకు చెప్తే గరమ్ ఐ తననే తిడతడు , కాలేజి మానేయ్ అంటడు అని ఏడుస్తుంది. అప్పుడు మా ఆడాళ్ళందరమూ కలిసి ఇలా చెప్పాం. అలా ఏడిస్తే పని కాదు. ఆ నంబరు ఎక్కడినుండీ వచ్చిందో కనుక్కుని వెళ్ళి వాన్ని తన్ని రండి అందరు కలిసి. మన మగపిల్లలు ఉన్నరెందుకు.  ఆ ఫోన్ నంబరు పట్టుకుని అది ఒక ఎస్టీడీ బూత్ అని తెలుసుకుని ఆ పిల్ల నలుగురు పోరగాల్లని తీసుకుని వెళ్ళింది. ఆ బద్మాష్‍గాడి షర్టు పట్టుకుని ఏంరా బద్మాష్! పని పాటాలేదా. ఆడపిల్లలకు ఫోన్ చేసి సతాయిస్తున్నవ్, మళ్ళీ ఇలా చేసినవంటే తోలు తీస్తా బిడ్డా. ఈ ఫోన్ డబ్బా ఎత్తేసి బిచ్చమెత్తుకునేట్టు చేస్తా అని మస్తు తిట్టి వచ్చింది. ఆడపిల్లలంటే గట్లుండాలే మరి. భయపడొద్దు.
మా ఇంట్ల ఒక తమాషా జరిగింది చెప్పనా. మా సారుకు కూడా సెల్ ఫోన్ల ఇట్లనే ఊరికే ఫోన్లు చేసి ఆ లోన్ ఇస్తం , ఈ లోన్ ఇస్తం అని పరేషాన్ చేస్తున్నరంట. మాకొద్దు అంటే ఇంటలేరు. జర వాడి సంగతి చూడు అని ఓసారి ఫోన్ నాకిచ్చిండు మా సారు. ఇగ వాడికి మూడింది అని మన శీనన్న ఇస్టైలుల వాడికి సిన్మా కథ చెప్పిన . ఏం సిన్మనో తెలుసా?? మన రజనీకాంత్ " చంద్రముఖి". ఇగ అవతలి దిక్కు ఉన్న పోరడి గతి ఏమయిందో ఒక్కసారి సోచాయించుండ్రి.
ఇగ ఉంట మల్ల. మస్తు పనుంది ..ఇవాళ బతుకమ్మ పండగ కదా. గునుగుపువ్వులు,తంగేడు,బంతి,చామంతి,కలర్ పూలు కలిపి బతుకమ్మ పేర్చాలె. ఈసారి పూలు మస్తు పిరం ఉన్నయని చాలా మంది కాగితం పూలతొని చేసిన బతుకమ్మ కొనుక్కుంటుండ్రంట. పాపం ఏం చెస్తారు.
అన్నలకు , తమ్ముళ్ళకు , అక్కలకు , చెల్లెళ్ళకు నమస్తే చెప్తున్న. నేను ఎవరా అనుకుంటున్నరా. సరూప . జ్యోతక్క దోస్తుని. మేము పాత దోస్తులము. ఓసారి ఆళ్ళింటికెళ్తే  బ్లాగులగురించి చెప్పింది. నేను కూడా పేపర్ల సదూతూనే ఉన్నా. అప్పుడప్పుడు నా ముచ్చట్లు చెప్త నీ బ్లాగుల రాయమంటే సరేనంది. ముందుగల్ల నా గురించి జరంత చెప్పాలె. మేముండేది పాత బస్తీ షాలిబండల. సొంతిల్లు ఉంది. ఒక బిడ్డ. కొడుకు. నాది మీ అంత పాలీషు బాస రాదు . తెలంగాణా, ఉర్దూ కలిపి మాట్లాడ్డం . పరేషాన్ కాకుండ్రి.
ఇప్పుడు అంతటా గణేశ్ సంబరాలు నడుస్తున్నయ్ కదా. చూసిండ్రా ఎన్నెన్ని విగ్రహాలు పెట్టిండ్రో. నిన్న మేము ఏం జేసినమో తెల్సా. ఒక క్యాన్ నిండా పులిహార చేసి పెట్టుకుని కొన్ని గర్జెలు,మురుకులు , నీళ్ళు పెట్టుకుని నేను, మా ఆయన, పిల్లలు ఇగ సిటీల ఉన్న గణేశులను సూద్దమని బయలుదేరినము నాలుగు గంటలకు ఇంట్లకేలి ఎలితే రాత్రి పదకొండయ్యింది. తంగ్  అయిపోయినం అనుకోండి. కాని మస్తుగుండే . టీవీల చూసెకన్నా నిజంగా వెళ్లి చూస్తే ఆమజానే వేరు కదా. మీకు తెల్వదా.
ఇగ మా బాడల (అదే పది-ఇరవై ఇండ్లు కలిప్తే బాడ అంటరు) అందరము కలిసి మంచిగ ఉంటము. తెలుగోల్లు, తురకోళ్ళు,కిరస్తానోళ్ళు అందరూ ఉంటరు. మా పండగలొస్తే  మేము చేసుకున్నవి వాళ్ళకు పంపిస్తాం. వాళ్ళ పండగలొస్తే వాళ్ళు మాకు పంపిస్తరు. పండగలన్నింటికి మంచిగ ఒకరినొరకు కలుసుకుంటము, మిఠాయిలు పంచుకుంటము. ఏ గడ్‍బడ్ ఉండదు.
ఇగ ఓ ముచ్చట జెప్పాలెనా. అందరు మోగోళ్ళు ఆఫీసులకు, దుకాణాలకు పోయినంక మా ఆడాళ్ళంతా జల్దీ జల్దీ ఇంట్ల పనంతా జేసుకుని ఒక దగ్గర కలిసి ముచ్చట్లేస్కుంటము. ఇగ మా ముచ్చట్లు ఎట్లుంటవంటే పాతబస్తీ నుండి పాకిస్తాన్ వరకు, దునియా అంతా తిరిగొస్తాం. టీవీ సీరియల్లు, సినిమా ముచ్చట్లు, ఇగ మాకు మాట్లాడుకోనికి లేని సంగతి ఉండదనుకోండి. అప్పుడప్పుడు వచ్చి ఒక్కో ముచ్చట చెప్తా మల్ల. ఇనుకోండి.
ఇప్పటికైతే ఈ మస్తు మస్తు పాట ఇనుకోండు. మీరు ఇస్మైల్ చేయకుంటే చార్మినార్ మీద ఒట్టు. మా పోరగాళ్ళైతే పడి పడీ నవ్విండ్రు.
ప్రేమ పాగల్‍గాడు పాడితే ఇట్లనే ఉంటదిమరి.
పాట