నిన్న నల్గొండలో లగడపాటి రాజగోపాల్ కారు ఓ తెలంగాణా కార్యకర్తని గుద్దిందంట. ఆయన కారు ఆపకుండా వెళ్ళిపోయాడంట (ఆపకుండా వెళ్ళడాన్ని నేను ఖండిస్తున్నాను, ఆయన పైన చట్టపరంగా చర్య తీసుకోవాలి ). దీనికి తెలంగాణా కార్యకర్తలు నానా రబస చేసారు, ఏదో తెలంగాణా సమస్యలాగా. ఈ సంఘటనకి తెలంగాణా సమస్యకి ఏమైనా సంబంధం ఉందా అసలు. సరే ఈ రాజకీయ నాయకులు అంతే, బోడిగుండుకి మోకాలికి లంకె వేస్తారు అని అనుకుందాం.
నేను హైదరాబాద్ లో ఓ హాస్టల్ లో ఉన్నప్పుడు (మూడు సంవత్సరాల క్రితం ) మా ప్రక్క రూం లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన పట్టభద్రుడు ఒకడు ఉన్నాడు. ఒకానొక మాటల సందర్భం లో, ఆ మీ కోస్తావాళ్ళంతా మా (వ్యవసాయ)భూముల్ని చాలా చీప్ గా కొంటున్నారు అని అన్నాడు. మరి మీరెందుకు అమ్ముతున్నారు అని నేనన్నాను. లేదూ మీ ఆంధ్రావాళ్ళంతా మా హైదరాబాద్ కి వచ్చి దందా చేస్తున్నారు అని అన్నాడు. అదేంటండీ మేమేమైనా పాకిస్తాన్ వాళ్ళమా మాకు హైదరాబాద్ లో ఉండే హక్కు లేదా. మరోసారి, నేను కాచిగూడా నుండి అమీర్ పేట్ కి ఓ ఆటోలో వెళుతున్నా. ఆ ఆటోవాడితో ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుతున్నా. వాడూ సరదాగా ఏదో చెబుతూనే ఉన్నాడు. మీ ఏరియా ఏంటన్నా అని అడిగాడు. నేను ఏలూరు నుండి వచ్చా అని చెప్పా. ఏలూరు ఎక్కడన్నా అని అన్నాడు. కోస్తాలే అని చెప్పా. అంతే ఆటో దిగేవరకు నాతో మాట్లాడ్డం మానేసాడు. మా మిత్రుడొకడు నల్గొండలో ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళ ఇంటి ఓనరుకి ఓ అబ్బాయి ఉన్నాడు. ఒకసారి, మీ ఆంధ్రా వాళ్ళ వల్ల నాకు ఉద్యోగం రావడం లేదు అని అన్నాడంట. ఇంతకీ అతను చదివింది ఏంటంటే ఇంటర్మీడియట్.
మరి ఈ ముగ్గురికీ ఆంధ్రా వాళ్ళు ద్రోహం చేస్తున్నారా !!. మీరు మరీనూ... ఎవరో ముగ్గురు మూర్ఖంగా మాట్లాడినంతమాత్రాన తెలంగాణావాళ్ళు ఆంధ్రా వాళ్ళని అగౌరవ పరచినట్టా అని అంటారా. మరి ఇలాంటివారు తెలంగాణాలో ఎంతమంది ఉన్నారు. సరే అన్నాది ఎవరో మూర్ఖులు అని ఆత్మగౌరవం లేకుండా బతికేద్దామా. నిజం గా తెలంగాణా వెనకబాటుతనానికి ఆంధ్రావాళ్ళే కారణామా. మరింకేమీ కారణాలు లేవా.  మరి ఆంధ్రావాళ్ళే తెలంగాణా వెనకబాటుతనానికి కారణమైతే మరి ఆంధ్రా ప్రాంతాలైన శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు ఎందుకు వెనకబడి వున్నాయి. మీరంతా మనం అన్నదమ్ముల్లాగా గౌరవంగా విడిపోదామంటున్నారు. మేము విడిపోతేనే గౌరవంగా బతుకుతాం అని నేనంటున్నా. మాకూ అత్మ గౌరవం ఉంది.
చాలా రోజుల విరామం తర్వాత కేసీయారు దొరవారు తమకే సొంతమైన రీతిలో కొన్ని సంధి ప్రేలాపనలు చేశారు. ఈ మధ్య ఈయన ఏమైపోయాడనుకుంటున్నవారికి గమనిక: దొరవారు కొద్దికాలంగా సైనిక శిక్షణ పొందటానికి సరిహద్దులకెళ్లారు. తిరిగొస్తూ వస్తూ, తెలంగాణా కల సాకారమయ్యాక రాష్ట్రాన్ని ముందడుగేయించే చిట్కాలు కొన్నిటిని పీడిత తాడిత ప్రజలకోసం జేబులో నింపుకుని చక్కా వచ్చారు. ఆ చిట్కాలని,  పన్లోపనిగా మరికొన్ని ఆసక్తికర విశేషాలని విలేకర్లకి వెల్లడించారు. మచ్చుకి కొన్ని విశేషాలు, వాటికి కర్ణపిశాచి తాత్పర్యాలు - మీకోసం.
>> "రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే మూడు నెలల పాటు సైనిక పాలన విధిస్తాం".
ఏ కారణంతో విధిస్తారో విలేకర్లడగలేదు, వారు చెప్పలేదు. వారి తర్వాతి ప్రేలాపనననుసరించి తెలంగాణా వెనుకబాటుతనం బూచిగా చూపి సైనిక పాలన విధిస్తారని మనం ఊహించుకోవాలి. ఇటువంటి కారణాలతో ఓ రాష్ట్రంలో సైన్యం జోక్యం చేసుకోవటం మనదేశంలో ఇందాకా జరగని విషయం. బహుశా కేసీయారువారు దానికోసం మొదట రాజ్యాంగాన్ని మార్పిస్తారు కాబోలు. ఆ వంకతో మరో ఉద్యమం, మరి కొన్నేళ్ల జాతర. ఏతావాతా, రాష్ట్రమొచ్చినా జనాలకొరిగేది సున్నా అని వీరి మాటల్లో గూఢార్ధం - గ్రహించనివాడి ఖర్మం.
>> "లక్షమంది సైనికులతో జనాభా, విద్య, పేదరికంపై సర్వే చేయిస్తాం"
అది సైన్యమా లేక సిఎన్నెనా? సర్వే చెయ్యటానికే లక్ష మందా!?! భారత దేశానికి ఉన్న సైనికులెందరు, వారిలో సర్వేలు చేసే నైపుణ్యం ఉన్నవారెందరు? అసలు ఒక రాష్ట్రమ్మీదకి లక్షమంది సైనికులని తోలటానికి అదేమన్నా శత్రు దేశమా? ఆ మధ్య నిజాం భజన, ఇప్పుడు సైన్యం ప్రస్తావన. చూడబోతే తెలంగాణా జాగీరుకి నవ నవాబయ్యే ధ్యేయమేదో శరాబీబాబుకి ఉన్నట్లుంది! ఇంతకీ .. ట్యాంకులు, యుద్ధవిమానాలు వగైరాలెన్ని తరలించబోతున్నారో చెప్పలేదేం చెప్మా. ముందే ఓ మాటనుకుంటే బాగుంటుంది కదా. చివరాఖర్నిమిషంలో అవో పదివేలు, ఇవో పాతిక వేలు కావాలంటే కేంద్రానికి కష్టమైపోదూ? అసలే, ఉన్న రెండొందల సెకండ్ హ్యాండ్ మిగ్గుల్లో వారానికోటి రాలిపోతే మిగిలింది పాతికో పరకో. అప్పటికప్పుడు వేలకొద్దీ విమానాలడిగితే ఎక్కడ్నుంచొస్తాయి? మళ్లీ అప్పుడు 'అడిగినయ్యివ్వలేదు. ఇది తెలంగాణాపై వివక్షే. మాకు ప్రత్యేక దేశం కావాలి' అంటూ కొత్త పాటందుకునే దూరపు దురాలోచనేమన్నా దాగుందా ఇందులో?
>> "ప్రతి మండలంలోనూ స్టేట్ పబ్లిక్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి నిర్బంధంగా కేజీ నుండి పీజీ దాకా చదువు చెప్పిస్తాం"
ఆహా. ఇదంతా మూడే మూడు నెలల్లో! సరిహద్దుల్లో అద్భుత దీపమేదన్నా దొరికిందేమో అయ్యవారికి. ఏమైతేనేం, ఒక్కదెబ్బకి రెండు పిట్టలు. అటు తెలంగాణావోళ్లకి కేజీలకొద్దీ ఫ్రీ ఎడ్యుకేషన్, ఇటు ఆంధ్రా దోపిడీ కార్పొరేట్ కాలేజీలోళ్ల నోళ్లలో ఎర్రెర్ర మట్టి. కేసీయార్ దెబ్బంటే ఆంధ్రావాళ్లు అబ్బా అనాలి, ఏటనుకున్నారో.
>> "చంద్రబాబు తొమ్మిదేళ్లలో తింటే నేను నాలుగేళ్లలో తినొద్దా అని వైఎస్సార్ పోటీ పడుతున్నారు"
అంతా వాళ్లిద్దరే తినేస్తే తనకేమీ మిగలదేమోనని ఈయన భయం, బాధ.
>> "కార్యకర్తలూ, తెలంగాణాని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో కిలోమీటర్ లోపు బొంద పెట్టండి"
ఎక్కడి నుండి కిలోమీటర్ లోపో చెప్పకపోతే ఎలా కేసీయారూ? తెలంగాణా నుండా, కరీం నగర్ నుండా, నీ ఇంటినుండా? పోయిన సారీ ఇలాగే వివరం చెప్పకుండా గందరగోళంగా మాట్లాడితే ఓటర్లు కన్‌ఫ్యూజ్ ఐపోయి నీ పార్టీనే బొంద పెట్టేశారు. ఇప్పుడూ అదే తప్పు చేస్తే ఎలాగమ్మా.
>> "తెలంగాణా ప్రజలు వచ్చే ఎన్నికల్లో చేసే యుద్ధమే చివరిది".
తెలంగాణా ప్రజలకి తానే ఏకైక ప్రతినిధిని అనుకుంటాడు కాబట్టి ఈ వాక్యం వెనక ఆయన అసలుద్దేశం ఇది:  "కేసీయార్ వచ్చే ఎన్నికల్లో చేసే యుద్ధమే చివరిది".
అటులనే; తధాస్తు.
ఇదంతా రాజకీయక్రీడ అనడానికేమీలేదు. అసలిందులో రాజకీయాలు, ప్రజలకు మేలు చేసే రాజకీయాలు ఉన్నాయా అనేది అనుమానమే. ఆయా వ్యవహారాలు నడుపుతున్న పార్టీలకు రాజకీయ పార్టీలుగా పేరుంది గనుక, ఆయా వ్యక్తులకు రాజకీయ నేతలుగా పేరుంది గనుక ఈ సర్కస్ ఫీట్లను రాజకీయాలు అనుకోవలసిందేగాని నిజంగా సూత్రబద్ధంగా, నిజాయితీగా, క్రమబద్ధంగా ఉండవలసిన రాజకీయాలకూ, ఇవాళ తెలుగు రాజకీయ నాయకులు ఆడుతున్న చదరంగానికీ ఏమీ సంబంధంలేదు.
ఎన్నో దశాబ్దాలుగా పనిచేస్తున్న, లేదా ఇప్పుడిప్పుడే పుట్టుకొచ్చిన మహా ఘనత వహించిన రాజకీయ పక్షాలను అరాజకీయ పక్షాలని అనడం వారిని కించపరచడానికి ఎంతమాత్రమూ కాదు. కనీసం గత రెండు వారాలుగా తెలుగుసీమలోని అన్ని “రాజకీయ” పక్షాలూ అంటున్న మాటలూ చేస్తున్న చేతలూ చూస్తే అవి అవకాశవాద పక్షాలుగానే తప్ప రాజకీయ పక్షాలుగా కనబడడంలేదు.
నూరేళ్లు ఎప్పుడో నిండిపోయినా ఇంకా అధికారం నెరపగలుగుతున్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అన్ని అక్రమాలకూ కన్నతల్లి. అవకాశవాదమే రాజకీయంగా, కళగా  అభివృద్ధిచేసిన పార్టీ అది. అన్నిరకాల గొంతులకూ స్థానం ఇచ్చి, ఎవరు ఏమి మాట్లాడినా ఆమోదించి, లోపల ఉన్నవారే ఒకరిమీద ఒకరు ముఠాలు కట్టినా, కత్తులు దూసుకున్నా, పరస్పర భిన్నమైన అభిప్రాయాలు ప్రకటించినా, పరస్పర వ్యతిరేకమైన పనులు చేసినా అన్నిటినీ ఒకే హోల్డాల్ లో కట్టి బిగించగల మహా అవకాశవాద పక్షం కాంగ్రెస్. కనుక దాని అవకాశవాదం గురించి పెద్దగాచెప్పుకోవడానికి ఏమీలేదు. దాని నిర్వచనమే అవకాశవాదం.
దేశంలో చాలమంది ఆలోచనాపరులు అటు కొసన భారతీయ జనతాపార్టీనీ, ఇటుకొసన వామపక్షాలనూ సూత్రబద్ధ రాజకీయ వైఖరులు కలిగిన పార్టీలుగా భావిస్తుంటారు. మనరాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ కి ఎవరో ఇద్దరు ముగ్గురు నాయకుల అవకాశవాద, స్వప్రయోజన వైఖరులు తప్ప స్థిరమైన రాజకీయ వైఖరులు లేవనేది ఆ పార్టీ అభిప్రాయాల, ఆచరణల చరిత్ర చూస్తే సులభంగానే అర్థమవుతుంది.
ఇక వామపక్షాలలో తానే అతి పెద్ద పార్టీననీ, ఒకటికి రెండుసార్లు ప్రధానమంత్రి పదవిని కూడ త్యాగం చేశాననీ, ఎప్పటికైనా ప్రధానమంత్రిగా తమ పార్టీ నాయకులొకరు ఎన్నికవుతారనీ అనుకుంటున్న సిపిఎం వైఖరి అవకాశవాదానికి నిర్వచనంగా మారిపోతున్నది. మొన్నటికిమొన్న ఆ పార్టీ కేంద్ర నాయకులు ఇద్దరు రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా వారిని ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి కలిశారు. అది ఎంత మర్యాదపూర్వకమైన కలయిక అనుకున్నప్పటికీ, ప్రస్తుత స్థితి దృష్ట్యా పరిశీలకులు దానిలో ఎన్నికల పొత్తు అవకాశాన్ని చూశారు. ఆ ఊహలను చెదరగొట్టడానికి సిపిఎం నాయకులు ‘ప్రజారాజ్యంతో కలిసే ప్రసక్తే లేదు, వారి ఆర్థిక విధానాలు ఏమిటో ఇంకా స్పష్టతలేదు’ అని ప్రకటించారు. చాలా బాగుంది. ఒక మార్క్సిస్టు పార్టీ తీసుకోవలసిన వైఖరే. కాని కొన్ని గంటలలోనే ఆ అగ్ర నాయకులిద్దరూ తెలుగుదేశం అధినేత ఇంటికి తామే తరలివెళ్లారు. ఆ అగ్రనేతతో కలిసి ఆ వాకిట్లో ప్రచారసాధనాలవారితో మాట్లాడారు. ఇది పొత్తుకు సూచనా అని వచ్చిన ప్రశ్నకు ఒక నాయకుడు ‘ఇప్పుడు మనం ఎక్కడున్నాం’ అని ఎదురు ప్రశ్న వేశారట. తమను చేరవచ్చిన కొత్తపార్టీ విషయంలోనేమో వారి ఆర్థికవిధానాలు తెలియకుండా ఏమి చెపుతాం అనే దాటవేసే ధోరణి. ఇరవై ఐదేళ్లుగా, కనీసం పదిహేనేళ్లుగా నిర్దిష్టమైన ఆర్థిక విధానాలు అవలంబిస్తున్న, రాష్ట్రంలో ప్రపంచబ్యాంకు పాలనను నెలకొల్పిన పార్టీ నాయకుడినేమో తామే కలవబోవడం, పొత్తుకు సంకేతాలు ఇవ్వడం – అవకాశవాదానికి ఇంతకన్న నిదర్శనం కావాలా?
ఇక సిపిఐ, తెరాస ల అవకాశవాద వైఖరి గురించి ఇంత వివరంగా కూడ చెప్పుకోనక్కరలేదు.
కొత్తగాపుట్టిన ప్రజారాజ్యంపార్టీ కూడ తాను పాత తానులోని ముక్కనే అని చూపుకోవడానికి ఉబలాటపడుతున్నది. ఒకవైపు కాంగ్రెస్ కు తానే నిజమైన, ఏకైక ప్రత్యామ్నాయాన్ననీ, అవినీతి నిర్మూలనే తన లక్ష్యమనీ ప్రకటించుకుంటున్న ప్రజారాజ్యం పార్టీ దేశ రాజకీయాలలో డబ్బు ద్వారా ఏదయినా సాధించవచ్చుననీ, ఎవరినైనా కొనవచ్చుననీ చూపుతున్న, మొన్నటికి మొన్న కాంగ్రెస్ కోసం బేరసారాలు జరిపి విశ్వాసపరీక్షలో గట్టెక్కించిన సమాజ్ వాదీ పార్టీ నాయకులతో కలిసి యుగళగీతాలు పాడడానికి ఏమీ అభ్యంతర పడడం లేదు.
ఎంత దిగజారినా, మన పార్లమెంటరీ రాజకీయాలు ఇంతదిగజారాయా? ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరిచేంత నవనవోన్మేషంగా అవకాశవాదాన్ని అలంకరించుకుంటున్నాయా?
30 ఏళ్ళ పైన దేశాన్నేలినందుకు
పెళ్ళాం లేని జీవితం
కూతురికి వైథవ్యం
మనవరాళ్ళకి వైథవ్యం
ఏకులమో చెప్పలేని కులం
ఏమతమో చెప్పలేని మతం
పోయిన ఇంటిపేరు(నెహ్రూ)
రావణకాష్టంలా కాష్మీరు
చైనాకి వదిలేసిన సరిహద్దు భూభాగం
వ్యక్తిగత జీవితం పై మచ్చ
ఎమర్జెన్సీ గోల
బోఫోర్సు లీల
విదేశీయులనే ఘనత
వీళ్ళు లేకపోతే మనదేశం అల్లకల్లోలమయ్యేదా? ఏమో! 1947తో పోలిస్తే చాలా చాలా బావుంది కదా. పాకిస్తాన్‌తో పోలిస్తే చాలా బావుంది కదా.
నేను మతాల గురించీ వాటి పోకడల గురించీ ఒక పోస్టు రాద్దామని చాలా రోజులుగా అనుకుంటూనేవున్నా. ఎప్పుడు రాయబోయినా నాకు రెండు ముఖ్యమైన సమస్యలు ఎదురవుతాయి. ఒకటి రాసింది సమగ్రంగా లేకపోవటం. రెండోది "నా బ్లాగు చదివేవారి మనసు నొప్పిస్తానేమో" అనేభావం.
మతంపై వ్యాసం ఎవరు రాసినా సమగ్రంగా ఎలా వుంటుందండీ? అది దేశ, ప్రపంచ రాజకీయాలతోటీ, దేశ ప్రపంచ ఆర్ధిక విధానలతోటీ పూర్తిగా interlace అయివుంటేనూ. మొన్నామధ్య మిత్రులతో ఇదేవిషయం చర్చకు వస్తే రాయడంలో తప్పేమీలేదు అనిపించింది. రాయడం మొదలుపెడితే అది ఒక పట్టాన తేలట్లేదు. ఈ లోపు ఈ అమరనాథ్ సంఘర్షణ సమితి గొడవలు, మన బ్లాగరులలో చర్చలూ(
పరధర్మా  భయావహ, ఉద్యోగం మారిందంతే! ). రాస్తున్నది పూర్తి చెయ్యడం గానీ...దాన్ని పోస్టు చెయ్యడం గానీ...ఇప్పట్లో అయ్యేది కాదు. ఈలోపు మతమ్మీద నా అభిప్రాయం చెపుతా, పోస్టుసంగతి తర్వాత చూద్దాం.
మతాన్ని కేవలం ఆచారవ్యవహారాలకే పరిమితం చెయ్యాలి. రాజకీయం చేయటం దారుణం.
మతం మారడానికి అసంబధ్ధమయినవి ఆశచూపి ప్రోత్సహించడం తప్పు. మతం మారడాన్ని మతస్వేచ్చగానే చూడాలి గానీ, తప్పుగానో నేరంగానో చూడకూడదు.
మతాలు, మత సంఘాలు సమాజానికి మంచి చెయ్యకపోయినా ఫర్వాలేదు, చెడుమాత్రం చెయ్యకూడదు, కలహాలు ప్రోత్సహించకూడదు.
ఏ మతానికయినా "అవలోకనం" అవసరం. రోజులు మారుతున్నాయి, కొత్త విషయాలు ఇంతకు ముందెన్నడూ చూడనివి, కనీసం ఊహకందనివి వస్తున్నాయి (same sex marriages లాంటివి). మతం అంటే గైడ్‌లైన్స్ వుండాలిగానీ, రూల్స్ కాదు.
దేశం అంటే ఒకే మతం కాదు, ఒకే సంస్కృతికాదు.
చివరగా, మతం కంటే, దేవుడి కంటే దేశం ముఖ్యం.
ఇటువంటివి చెప్పడం సులభమే, ఆచరించటం కష్టమని మీరనొచ్చు. ఆచరించటం సంగతి దేవుడెరుగు, చెప్పడం తప్పుకాదుగా అందుకే చెప్పేశా..
నా బ్లాగు రాతల్లో నాకు నచ్చిన వాటిల్లో "రాముడున్నా, లేకున్నా…(@Readers’ discretion)" ఒకటి. పన్లో పని చదివేయండి.
మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నట్టులు కొన్ని వదులయి పడిపొయ్యాయి. దీని కారణంగా ఆయన అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు. దయచేసి నట్టులు వెతికి ఇవ్వగలరు.
ఈ వ్యాఖ్యలు చూడండి, "దమ్ముంటే అమలు చెయ్యా"లంట. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఏదయినా పాలసీ బాగుందనో(?), బాలేదనో రీజనింగుతో వ్యాఖ్యానించాలి. సరే... మన వాళ్ళు ఇండియన్ పోలిటీషీన్సు కదా. రీజనింగు లేకపోయినా బాగుందనో, బాలేదనో వ్యాఖ్యానిస్తే O.K..
"బావుందనిపిస్తే దేశమంతా అమలు చెయ్యమని డిమాండు చెయ్యి. బాలేదనిపిస్తే దేశమంతా అమలు చెయ్యొద్దని డిమాండు చెయ్యి. ఈ 'దమ్ముంటే అమలు చెయ్యటం' ఏంటి చంద్రబాబూ? ఇదేనా ఢిల్లీలో చక్రం తిప్పే తెలివి?".
అన్నట్టు...
ఈయన ఏ కమెంటు చేసినా "రాజీనామా చేయండి" అనే డిమాండు మాత్రం వుంటుంది.
మరో ఎలక్షన్,
మరో ఎలక్షన్,
మరో ఎలక్షన్ వచ్చింది!
పదండి తొక్కుక్కు!
పదండి తోసుకు!
పోదాం, పోదాం, పైపైకి!
కదం తొక్కుతూ,
పదం పాడుతూ,
అంతరాత్మలే లేకుండా-
పదండి పోదాం,
వినబడలేదా
మరో ఎలక్షన్ ఘంటికలు?
పేదవాళ్ళ గుండెనెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు!
దందాల్ జేసీ,
సెజ్జులు చేసీ,
దోచినదంతా తీయండి!
చిరంజీవులూ,
రాఘవులూ, నారాయణలు,
చంద్రబాబులా మనకడ్డంకి?
పదండి తొక్కుక్కు!
పదండి తోసుకు!
పోదాం, పోదాం, పైపైకి!
ఎముకలు కుళ్లిన,
వయస్సు మళ్లిన,
'తెలుగు తమ్ములూ'! చావండి!
డబ్బులు చిమ్మే,
సారా పంచే,
నాయకులారా! రారండి!
రాహుల్! రాహుల్!
రాహుల్! రాహుల్!
రాహుల్ రాహులని కదలండి!
మరో ఎలక్షన్,
మహా ఎలక్షన్
రాష్ట్రం నిండా నిండింది!
పదండి తొక్కుక్కు!
పదండి తోసుకు!
పోదాం, పోదాం, పైపైకి!
ఏం గొనేటట్టు లేదు, ఏందినేటట్టు లేదు
రాజిగ! ఒరె రాజిగా!
రాజిగ! ఒరె రాజిగా!
ఏం గొనేటట్టు లేదు, ఏందినేటట్టు లేదు
పప్పుప్పులు గొందమనీ
రోజు కూలి దీస్కబోతే
సేటు జెప్పిన రేటులినీ
దిమ్మదిరిగిబోయినాది
పిలగానికి సీటుకనీ
లోను దీసుకోని బోతె
సీటుకున్న రేటుయినీ
దిమ్మదిరిగిబోయినాది
గల్లి గల్లి బ్రాంది షాపు
తిండికేమొ దిక్కు లేదు
లీటరు నెత్తురు అమ్మితె
పూట గడవ దిక్కు లేదు
ఇందిరమ్మ ఇళ్ళంట
రాజీవుని రోడ్లంట
ముల్లెందుకు దోస్తాన్రు
బిచ్చమెందు కేస్తాన్రు
ఎలచ్చన్ల యేడాదిల
పరిస్థిస్తులె గిట్టుంటే
ఆనక నీసంగతేందొ
సిమ్మాద్రప్పన కెరుక
ఏం గొనేటట్టు లేదు, ఏందినేటట్టు లేదు
రాజిగ! ఒరె రాజిగా!
రాజిగ! ఒరె రాజిగా!
ఏం గొనేటట్టు లేదు, ఏందినేటట్టు లేదు
రాష్ట్రంలో బాడుగ నేతలు సృష్టించిన కలకలం ఇప్పుడే సద్దుమణిగేలా లేదు. ఆంధ్రజ్యోతి ఎవరినుద్దేశించి ఆ కధనం రాసిందో అర్ధం కాని వాళ్లు ఎవరన్నా ఉంటే మంద కృష్ణ వీరంగంతో వారికీ గుమ్మడికాయల దొంగలెవరో తెలిసిపోయింది. ఆ కధనానికి నిరసన వ్యక్తం చేసే ప్రజాస్వామ్యయుత మార్గాలెన్నో ఉండగా ఆ పనికి దౌర్జన్యాన్నెంచుకుని మంద కృష్ణ పెద్ద తప్పు చేశాడు. ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద దాడి తర్వాతనైనా బుద్ధి తెచ్చుకుని లెంపలేసుకోవాల్సింది పోయి 'మాజోలికొస్తే అంతు చూస్తాం' అని రెచ్చగొట్టే ప్రకటనలు చేయటం ద్వారా మరిన్ని తప్పులు చేశాడు. తను తప్పు చేయనప్పుడు దానికి రుజువులు చూపిస్తే సరిపోయేదానికి, విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చూస్తుంటే ఆయనపై ఆరోపణలు నిజమేనని నమ్మవలసి వస్తుంది. 'కులాన్ని అడ్డు పెట్టుకుని పబ్బం గడుపుకుంటున్నారు' అనేది బడుగు నేతలపై ఆంధ్రజ్యోతి ఆరోపణ. మంద కృష్ణ ప్రవర్తన దాన్ని నిరూపించేదిగానే ఉంది. తనపై వచ్చిన ఆరోపణలకు సూటిగా సమాధానమివ్వకుండా ఇది దళిత జాతి మొత్తాన్నీ అవమానించటం అన్న ఆక్రోశం చర్చని దారిమళ్లించే ఎత్తుగడే. నాయకుడనేవాడు ప్రపంచం బాధని తనదిగా భావించాలేగానీ తన బాధని ప్రపంచానిదిగా ప్రచారం చెయ్యకూడదు.
ఈ మొత్తం వ్యవహారంలో మంద కృష్ణ వెనుక ఎవరున్నారనేది సుస్పష్టం. 'దళిత ఉద్యమాలని స్వలాభానికి తాకట్టు పెడతాడు' అనే ఆరోపణకి ఇది తాజా దృష్టాంతం. ఇప్పుడు దళితుల ముందు కొన్ని ప్రశ్నలున్నాయి. ఇరవయ్యేళ్ల పైచిలుకు మంద కృష్ణ నాయకత్వంలో దళితులకి నిజంగా జరిగిన మేలేమిటి? వర్గీకరణ పేరుతో మాలలు, మాదిగల మధ్య చిచ్చు పెట్టటం తప్ప ఈయన చేసిందేమన్నా ఉందా? చూడబోతే దళితుల వెతలకు వారి నాయకులే ఎక్కువ కారణంలాగుంది.
నాయకుడనేవాడికి ఆవేశం అన్నిరకాలా అనర్ధం. అది వ్యక్తిగా అతనొక్కడికే పరిమితమయితే సరే. కానీ ఇక్కడ మంద కృష్ణ ఆవేశానికి అతని సామాజికోద్యమ భవిష్యత్తే పణం. ఈ సంఘటనతో దళిత నాయకుల మధ్యనున్న పొరపొచ్చాలు బయట పడ్డాయి. విశేషమేమిటంటే, ఆంధ్రజ్యోతిపై దాడి విషయంలో మంద కృష్ణని ఖండించిన దళిత నాయకులే ఎక్కువ. వారిపై 'అగ్ర వర్ణాల తొత్తులు' లాంటి వ్యాఖ్యలు చేయటం ద్వారా తన కొద్ది బుద్ధిని మరోసారి బయటపెట్టుకున్నాడు మంద కృష్ణ. 'నన్ను వెనకేసుకొచ్చినవారు మాత్రమే దళిత బాంధవులు, మిగిలిన వారు దళిత శత్రువులు' అనే ధోరణి అతని అహంకారాన్ని సూచిస్తుంది.
'ఆంధ్రజ్యోతి సంపాదకుడిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం కింద అరెస్టు చేయటం ఎలా కుదురుతుంది' అని ప్రశ్నించిన మాజీ ఐఏఎస్ అధికారి, లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ్ పై 'ఆయన ఐఏఎస్ ఎలా పాసయ్యాడు? తప్పకుండా ఎవడో కమ్మోడు ఆయన పేపరు దిద్ది ఉంటాడు' అని హద్దులు మీరి వ్యాఖ్యానించటం ద్వారా తన తెలివితక్కువ తనాన్ని మరోసారి బయటపెట్టుకున్నాడు మంద కృష్ణ. సివిల్ సర్వీసెస్ పరీక్షా విధానంపై అతని అవగాహనా రాహిత్యానికిదో ఉదాహరణ. పైగా, 'మేము మాత్రం కులాల ప్రస్తావన తేవచ్చు. ఇతరులు తేకూడదు' అని నిర్లజ్జగా వ్యాఖ్యానించటం అతని విచక్షణా లేమికో మచ్చుతునక.
తన కోపాన్ని అగ్రవర్ణాలమీద చూపించినా ఏదోవిధంగా అర్ధం చేసుకోవచ్చు. కానీ తోటి దళిత సామాజిక ఉద్యమకారుడు చక్రపాణిని 'నీవు దళితుడవా? అయితే నీదే ఉప కులం' లాంటి  ప్రశ్నలు వేయటం ద్వారా తనో కరడుగట్టిని కులవాది మాత్రమే కానీ తనలో నాయకత్వ లక్షణాలేమీ లేవని రుజువు చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా 'నేను గాంధీ అంతటి వాడిని. గాంధీని ఎవరన్నా చెప్పులతో కొడతారా' అని వింత లాజిక్కులు గుప్పించి అతి తెలివి ప్రశ్నలు వేస్తూ తన తెలివితక్కువతనాన్నే బయటపెట్టుకున్నాడు మంద కృష్ణ. కొందరు వ్యక్తులు పుట్టుకతో గొప్పవారు, కొందరు కష్టపడి గొప్పవారుగా గుర్తింపు తెచ్చుకుంటారు, మరి కొందరికి మాత్రం గొప్పదనం ఆపాదించబడుతుంది. మంద కృష్ణ నిస్సందేహంగా మూడో రకం. ఆ గొప్పతనమూ తనకు తాను ఆపాదించుకున్నదే.
'అర్ధరాత్రి స్వతంత్రమొచ్చింది, ఇంకా తెల్లవారలేదు' - మేడిపండులాంటి మన స్వతంత్రం గురించి ఏనాడో శ్రీశ్రీ వెలిబుచ్చిన ఆవేదనిది. ఆంధ్ర దేశంలో దేవుడి పాలనలో పత్రికల నోరునొక్కే ప్రయత్నాలు చూస్తుంటే అసలు మనకి స్వతంత్రమే రాలేదా అనిపిస్తుంది. స్వేచ్చలన్నింటిలోకీ తలమానికమైనది పత్రికా స్వేచ్చ. అది లేనిదే ఏ సమాజమూ ముందడుగేయదు. దుర్వినియోగమైనా సరే ఆ స్వేచ్చ ఉండటమే సమాజానికి మంచిది. పాతికేళ్ల రాజకీయ ప్రస్థానంలో నిత్య అసమ్మతివాది స్థాయి నుండి పత్రికల ఊతంతో పైపైకెదిగిన ముఖ్యమంత్రికి ఆ సంగతి తెలియదనుకోవాలా?
వైఎస్సార్ కి ఆ రెండు పత్రికలపై ఉన్న కోపం బహిరంగ రహస్యం. ముఖ్యమంత్రయ్యాక మొదటేడాదిని మినహాయిస్తే, ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై విరుచుకుపడటానికి వచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ ఆయన వదులుకోలేదు. ప్రతిపక్ష నాయకుడిగా తాను చేసిన పాదయాత్రని మొదటి పేజీ వార్తలుగా ప్రచురించినప్పుడు మాత్రం ఆ రెండూ ప్రత్యర్ధి వర్గం కొమ్ముకాసే పత్రికలని ఆయనకి అవసరార్ధం గుర్తుకురాలేదు! పత్రికల దృష్టి ఎప్పుడూ ప్రభుత్వం చేసే తప్పులపైనే ఉంటుందని, ప్రతిపక్షాల పైన కాదనీ ఆయనెరగడా? పత్రికలపై వైఎస్ అక్కసు ముందుగా ఆయన మంత్రివర్గ సహచరులకు, తర్వాత మిగతా కాంగీయులకూ పాకి ఇప్పుడు ఇతరులకూ అంటుకుంది. దానికి దృష్టాంతమే మంద కృష్ణ మాదిగ తాజా ఎపిసోడ్. నెల రోజుల కిందటి ఆంధ్రజ్యోతి బాడుగ నేతల వివాదం సమసిపోయిందనుకుంటున్న దశలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద ఆ పత్రిక సంపాదకుని అరెస్టు వివాదాన్ని తిరగదోడేదే.
వారం పది రోజులుగా ఆంధ్రజ్యోతిని ఇబ్బందిపెట్టే లక్ష్యంతో ప్రభుత్వం పావులు కదుపుతున్న నేపధ్యంలో -  దొంగలు పడ్డాక ఆర్నెల్లకైనా మొరగని మన పోలీసులు  రాత్రి పూట ఆఘమేఘాలమీద వెళ్లి ఆంధ్రజ్యోతి సంపాదకుడిని, ఇతర ఉద్యోగులను అరెస్టు చేయటం దేనికి సూచిక? 'ఆంధ్రజ్యోతి పై దాడి చేయించింది నేనే, మాకు వ్యతిరేకంగా రాస్తే ఇంకా ఏమైనా చేస్తాం' అని బహిరంగంగా రొమ్ములు చరుచుకున్న మంద కృష్ణని వదిలేసి ఆంధ్రజ్యోతి ఉద్యోగులని అరెస్టు చేయటంలో మతలబేంటి? పెట్రోలు పోసి మహిళని తగలబెట్టబోవటం, ఆస్థులు ధ్వంసం చేయటం, అంతు చూస్తామని బహిరంగంగా బెదిరించటం కన్నా దిష్టి బొమ్మని చెప్పులతో కొట్టటం పెద్ద నేరమా! మరి వివిధ సందర్భాల్లో మంద కృష్ణ తగులబెట్టిన దిష్టిబొమ్మల సంగతేమిటి? చట్టం తన పని తాను చేసుకుపోతుందనే అరిగిపోయిన వాక్యం ఎన్నిసార్లు వల్లె వేసినా ఈ అరెస్టుల వెనుక ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం లేదంటే నమ్మటం కష్టం.  రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం స్థాపిస్తామని గొప్పలు పోతున్న వైఎస్ ఎమర్జెన్సీ చీకటి రోజుల ముప్పై మూడో వార్షికోత్సవం గుర్తుగా ప్రజలకిస్తున్న బహుమతా ఇది?
అధికారంలో ఉంటే ఏం చేసినా చెల్లిపోతుందన్న భ్రమలో ఉన్న వైఎస్  రాష్ట్రంలో నడిపిస్తున్నది అక్షరాలా ఆటవిక రాజ్యం. అక్షరం మీద దాడులు ఆయన అసహనానికి నిలువెత్తు సాక్షాలు. బండ్లు ఓడలవుతాయనే సామెత ముఖ్యమంత్రి గుర్తుకు తెచ్చుకోవటం మంచిది. ఎల్లకాలమూ తనే ముఖ్యమంత్రిగా ఉంటాడనే భ్రాంతిలో ఆయనున్నా, అది జరిగే పని కాదు. ఈ రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై జరుగుతున్న దాడులు రేపు సాక్షిపై జరగవనే నమ్మకమేమీ లేదు. ఏలయన, అది నీవు నేర్పిన విద్యయే రాజశేఖర!
'భారత దేశాన్ని ఆర్ధికంగా బలహీనపరచేందుకు కొన్ని దేశాలు చేస్తున్న కుట్ర ఫలితమే చమురు ధరల పెరుగుదల'. కేంద్రం ఇటీవల పెంచిన పెట్రోలియం ఆధారిత ఇంధనం ధరలపై వివరణిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్య ఇది. అగ్ర రాజ్యంగా ఎదుగుతున్న భారత్ ను దెబ్బతీయటానికి అంతర్జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతుందట. నాలుగేళ్ల క్రితం నలభై డార్లకు దగ్గర్లో ఉన్న పీపా ముడి చమురు ధర ఇప్పుడు నూట నలభై దగ్గరకు రావటానికి ఇదే ప్రధాన కారణమట!
మోకాలికీ బోడిగుండుకీ ముడిపెట్టటం అంటే అదే. ఈ మాటలు చదివాక వై.ఎస్. అమాయకుడో, జనాలు పిచ్చివాళ్లో అర్ధం కాక బుర్ర బద్ధలు కొట్టుకోవాల్సిందే. ముడి చమురు ధరల పెరుగుదల మన దేశానికి మాత్రమే వర్తించే విషయం కాదని ఆయనకు తెలియదా? భారత దేశాన్ని ఇబ్బంది పెట్టటానికి ధరలు పెంచాల్సిన అవసరం చమురు ఉత్పత్తి దేశాలకేముంది? వ్యాపారి ఎప్పుడన్నా లాభం కోసం పనిచేస్తాడే కానీ వినియోగదారులని నాశనం చేయాలని కాదు. అలా చేయటమంటే తన ఇంటికి తాను నిప్పు పెట్టుకోవటమే. ఒక 'డైనమిక్ ఆంట్రప్రన్యూర్' తండ్రిగారికీ విషయమే తెలియకపోవటం విడ్డూరం.
కేంద్రం పెంచిన చమురు ధరల సెగ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ తన ప్రభుత్వానికి పొగ పెడుతుందోననే ఆందోళనతో వై.ఎస్. ఆలోచన లేకుండా హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్లుంది. చమురు ధరల పెరుగుదల అంతర్జాతీయ వ్యవహారమనీ, ఆ విషయంలో కేంద్రంకానీ, తన ప్రభుత్వం కానీ చేయగలిగేదేమీ లేదనీ, ప్రతిపక్షాలు అనవసరంగా ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తున్నాయనీ కూడా వై.ఎస్.ఇదే సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇందులో చాలావరకూ నిజమే. ఆయన అంత వరకే చెప్పి ఆగి ఉంటే బాగుండేది. 'విదేశీ హస్తం' విషయమెందుకు మధ్యలో?  దానికి బదులు దేశంలో చమురు ధరల పెరుగుదల ఎందుకు అనివార్యమో వివరించటానికి ప్రయత్నించి ఉండాల్సింది. అర్ధం చేసుకునేవాళ్లు చేసుకుంటారు, లేని వారు లేదు.
విదేశీ కుట్రకి వ్యతిరేకంగా రాష్ట్రంలోని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేయాలట. లేకపోతే వాళ్లూ ఆ కుట్రలో భాగస్వాములేనని ప్రజలు భావిస్తారట. ప్రతిపక్షాలకు ఎక్కడ చెడ్డపేరొస్తుందోనని వై.ఎస్.కి ఎంత బాధో! పెట్రో ధరల పెంపుపై నానా యాగీ చేస్తున్న ప్రతిపక్షాలని ఏదో రకంగా ఇరుకున పెట్టటానికే ఈ విదేశీ హస్తం ప్రస్తావన అన్నది సుస్పష్టం. కానీ ఆయననుకున్నంత అమాయకులా ప్రజలు?
ఇరవయ్యేళ్ల క్రితం దాకా దేశంలో ఎక్కడేమి జరిగినా 'సి.ఐ.ఎ. కుట్ర' అనటం నాయకులకో ఫ్యాషన్ గా ఉండేది. ఆ తరువాత ఆ స్థానంలోకి 'ఐ.ఎస్.ఐ. కుట్ర' వచ్చి చేరింది. వినీ వినీ ప్రజలు విసిగెత్తిపోయారో లేక అనీ అనీ నాయకులే విసుగెత్తిపోయారో కానీ మొత్తానికి చాలాకాలంగా అటువంటి చమత్కారాలు కనుమరుగైపోయాయి. వై.ఎస్. పుణ్యాన ఆ సంస్కృతి మళ్లీ మొదలవనుందేమో.
రెండు రోజుల క్రితం జరిగిన చివరి ప్రైమరీతో ఎట్టకేలకు డెమొక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవికి అభ్యర్ధిత్వం బరాక్ ఒబామాకు దాదాపు ఖాయమయింది. ఊహించని రీతిలో హిల్లరీ క్లింటన్ చక్రం తిప్పితే తప్ప ఆయనే డెమొక్రాట్ల అధికారిక అభ్యర్ధిగా ఎంపిక కావచ్చు. హిల్లరీ అధికారికంగా ఓటమిని ఇంకా అంగీకరించకపోవటంతో ఆ అవకాశాన్ని కొట్టిపారేయలేం. శనివారం ఆమె ఓటమినంగీకరిస్తూ ప్రసంగిస్తారని వార్త.
పదిహేడు నెలలుగా హోరాహోరీగా జరిగిన ప్రైమరీల ప్రచారం సందర్భంగా ఒబామా, హిల్లరీ ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. ముఖ్యంగా హిల్లరీ ఒబామాను ఇబ్బందిపెట్టే అంశాలను ప్రధానంగా చేసుకుని ఆయనమీద దాడికి దిగారు. ఇదంతా చివరకు అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయాన్నే ప్రశ్నార్ధకం చేస్తున్న విషయం ఆలస్యంగా గ్రహించిన పార్టీ రంగంలోకి దిగి ఇద్దరినీ చల్లబరిచే ప్రయత్నం చేసినా అప్పటికే ఎంతో కొంత నష్టం జరిగి ఉండొచ్చు. ముఖ్యంగా ఒబామా పట్ల శ్వేత జాతీయుల్లో విముఖత వచ్చేలా హిల్లరీ చేయగలిగారు. ఇంతగా ఒబామాను దుమ్మెత్తిపోసిన హిల్లరీ ఇప్పుడు ఆయనతో కలిసి ఉపాధ్యక్ష పదవికి పోటీచేయాలని కోరుకుంటున్నారని వార్తలొస్తున్నాయి.
అయితే ఒబామా దీనికి అంగీకరిస్తారా? ఇద్దరూ కలిసి పోటీ చేస్తే మంచిదనేవారు కొందరు, మంచిది కాదనేవారు మరి కొందరు. హిల్లరీ ఉపాధ్యక్ష పదవికి పోటీ పడితే శ్వేత జాతీయుల ఓట్లు రిపబ్లికన్లకు పడకుండా చేయొచ్చని కొందరి వాదన. అలా చేయటం వల్ల పార్టీ కూడా ఐకమత్యంగా ఉంటుందనేది వాళ్ల అభిప్రాయం. ఇంత జరిగాక ఆమెతో కలిసి పనిచేయటమంటే ఒబామా ఒత్తిడికి లొంగిపోయినట్లే, అది ఓటర్లలోకి తప్పుడు సంకేతాలు పంపుతుంది అని మరి కొందరి వాదన. పైగా, 'మార్పు కోసం ఉద్యమిద్దాం' అని ఎప్పుడూ చెప్పే ఒబామా క్లింటన్ కుటుంబాన్ని తోడుగా తెచ్చుకుంటే వాళ్ల నీడలో మిగిలిపోవటమే తప్ప బలమైన అధ్యక్షుడిగా ఎలా ఎదగగలడు అనేది వారి సూటి ప్రశ్న.
ఇప్పుడు బంతి ఒబామా కోర్టులో ఉంది. ఉపాధ్యక్ష పదవికి అభ్యర్ధిగా తనకు నచ్చిన వారిని ఎన్నుకునే హక్కు ఆయనకుంది. మరి ఆయన పార్టీ వత్తిడికి లొంగిపోయి హిల్లరీకే ఓటేస్తారా, లేక తనతో భావసారూప్యం ఉన్న కొత్తతరం నాయకుడిని తోడుగా తెచ్చుకుంటారా? తెలియాలంటే  కొద్ది రోజులాగాలి.
రెండు రోజుల వ్యవధిలో రాష్ట్ర భవిష్యత్తును విశేషంగా ప్రభావితం చేయగలిగే సంఘటనలు రెండు జరిగాయి. కొన్నాళ్లుగా ఇప్పుడు అప్పుడు అంటూ ఊరిస్తూ వస్తున్న చిరంజీవి పార్టీ ప్రారంభం ఆగస్టు 22న ఆయన పుట్టినరోజు సందర్భంగా జరగనుందనే స్పష్టమైన సంకేతం వాటిలో మొదటిది కాగా, ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి చావు తప్పి కన్ను లొట్టపోవటం రెండవది. మొదటి విషయం చిరంజీవి అభిమానులకూ, రెండవది రాష్ట్ర సమైక్యవాదులకూ అమితానందం కలిగించేవి.
మూడు దశాబ్దాలకాలంలో నూట నలభై తొమ్మిది చిత్రాల్లో నటించి కూడబెట్టుకున్న ప్రజాభిమానమే పెట్టుబడిగా రాజకీయ యవనికపై తొలి అడుగులు వేయటానికి సంసిద్ధమైన చిరంజీవి ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలకు గుబులు పుట్టిస్తున్నారు. అయితే, 1983లో ఎన్టీయార్ లాగా ఇప్పుడు చిరంజీవి కూడా ఆ స్థాయి ప్రభంజనం సృష్టించగలుగుతారనేది ప్రశ్నార్ధకమే. అప్పటి పరిస్థితులు, సమీకరణలు వేరు. ఎన్టీయార్ కి ప్రజల్లో సాక్షాత్తు దేవుడి ఇమేజి ఉంది. సినీ పరిశ్రమ మొత్తం ఆయన వెనుక ఉంది. అప్పటితో పోలిస్తే ఓటరు దేవుళ్లకు ఇప్పుడు రాజకీయ చైతన్యం ఎన్నో రెట్లు పెరిగింది. పాతికేళ్ల క్రితంలాగా సినీ గ్లామరు అదే స్థాయిలో ఇప్పుడు ఓట్లు రాలుస్తుందనేది అనుమానమే. అయినా ఓటరు మనసులో ఏముందో ఎవరికెరుక? అందుకే, పైకి డాంబికం ప్రదర్శిస్తున్నా ఆయన పార్టీ ప్రారంభమైన తరువాత తమకు జరగబోయే నష్టంపై తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు రెండూ అంచనాలు వేసుకునే పనిలో ఉన్నాయి.
అతి సర్వత్ర వర్జయేత్ అనేది కెసియార్ వినున్నారో లేదో కానీ ఉప ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లిచ్చిన షాకుతో అది ఆయనకు అనుభవంలోకొచ్చి ఉంటుంది. చీటికి మాటికీ రాజీనామా మంత్రం అన్ని సార్లూ ఓట్లు రాల్చదనేది ఆయనకిప్పుడు బోధపడి ఉండాలి. పోటీచేసిన 17 స్థానాల్లో సగమైనా గెలవలేకపోవటం, ఓడిన చోట్ల మూడో స్థానానికి పడిపోవటం, రెండు స్థానాల్లో పార్టీ అభ్యర్ధుల ధరావతు సైతం గల్లంతవటం, స్వయానా కెసియార్ అత్తెసరు మెజారిటీతో గట్టెక్కటం చూస్తుంటే తెరాస పరిస్థితి దయనీయంగా కనిపిస్తుంది. ఆలోచనారహతమైన ఆవేశంతో ఆయన ఇన్నేళ్లుగా కష్టపడి పేర్చుకొచ్చిన తెలంగాణ స్వప్నాన్ని స్వయంగా కూల్చివేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ వాదానికి ఈ ఉప ఎన్నికలు గోరీ కట్టకపోయి ఉండవచ్చుకానీ, తెరాసకు మాత్రం తమ గొయ్యి తాము తీసుకున్నట్లయింది. ఈ దెబ్బనుండి కోలుకోవటానికి కెసియార్ ఇంకొన్ని ఎత్తులు వేసి మరింతగా కష్టాల్లో కూరుకుపోవచ్చు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రమిప్పట్లో సాధ్యపడకవచ్చు. ఆమేరా సమైక్యవాదులకిదో గొప్ప ఊరట.
ఉప ఎన్నికల్లో బాగా లాభపడింది తెలుగుదేశం. ఊహించిన దానికన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకోవటమేకాకుండా అనేక చోట్ల రెండవ స్థానంలో నిలవటం ఆ పార్టీ శ్రేణులకు అత్యంత ఆనందం కలిగించే విషయం. మరోవంక కాంగ్రెస్ విజయాలు ముఖ్యమంత్రి ప్రతిష్టకు ఎంతోకొంత మేలు చేకూర్చేవే.
తెరాస ఎదురుదెబ్బల నేపధ్యంలో ప్రత్యేక తెలంగాణ అనేది వచ్చే సాధారణ ఎన్నికల్లో ఒక ప్రధాన అంశం కాకపోవచ్చు. అటు రాజశేఖర రెడ్డి, ఇటు చంద్రబాబు ఇద్దరికీ సొంత పార్టీల్లోని తెలంగాణవాదుల పోరు చాలావరకూ తగ్గినట్లే.  అయితే రెండు ప్రధాన పక్షాలకూ ముంచుకొస్తున్న మరో పెద్ద ముప్పు చిరంజీవి. ఆ ముప్పును తప్పించుకోవాలంటే ముఖ్యమంత్రి ముందున్న తేలికైన మార్గం ముందస్తు ఎన్నికలకు సిద్ధపడటం, తద్వారా చిరంజీవికి తగిన సమయం లేకుండా చేయటం. ఇది తెలుగుడేశానికి కూడా రుచించే పరిణామమే కావచ్చు. తెరాస ప్రాబల్యం క్షీణిస్తున్న ఈ దశలో కాంగ్రెసు - తెలుగుదేశం ఎదురెదురుగా నిలబడి ఎవరేమిటో తేల్చుకోవటానికే మొగ్గు చూపవచ్చు. ఆ విధంగా చూస్తే వచ్చే ఏడాది ఏప్రిల్/మే నెలల్లో జరగవలిసిన సాధారణ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబరులోనే జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే ప్రస్తుత అసెంబ్లీ ఈ నెలాఖరులోగా రద్దు కావలసి ఉంటుంది. అది జరిగేనా మరి? చూద్దాం, ఏమవుతుందో.
రెండు వారాలుగా ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా వివిధ పార్టీల నాయకులు యధేచ్చగా ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లూ, వారందరిపైనా ఎలక్షన్ కమిషన్ కన్నెర్ర చేసినట్లూ వార్తలు రాని రోజు లేదు. సహజంగానే నిర్వాచన్ సదన్ కోపానికి ఎక్కువగా గురయింది అధికార పక్షం వాళ్లే. రోజూ కన్నెర్ర చేసీ చేసీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కళ్లెలా వాచిపోయాయో తెలీదుగానీ ఉప ఎన్నికల వేడిలో నోటికొచ్చిన వాగ్దానమల్లా చేసిపారేస్తున్న అధికార పక్షీయులు మాత్రం ఆయన గోల అసలు పట్టించుకోనట్లే ఉన్నారు. ఎవడిగోల వాడిదే అంటే ఇదే కాబోలు.
ఈ గోలంతా పత్రికల్లో చదువుతున్న, టివిల్లో చూస్తున్న సాధారణ పౌరులకు మాత్రం అంతుపట్టని విషయమొకటుంది. ముఖ్యమంత్రిగారి ఉత్తుత్తి వాగ్దానాలు, ఉత్తుత్తి జివోల్లాగా ఎన్నికల కమిషన్ కోపం కూడా అంతా ఉత్తుత్తిదేనా? అవన్నీ తాటాకు చప్పుళ్లేనా? లేకపోతే ఇసి ఎంత గొడవచేసినా ముఖ్యమంత్రి, తతిమ్మా మంత్రిగణం తమ మానాన తాము ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తూ పోవటమేంటి?
దీనికి సమాధానం తెలుసుకోవాలంటే ఒక సారి పాత ఎన్నికలని గుర్తు తెచ్చుకుంటే చాలు. గత పదిహేనేళ్లుగా - అంటే టి.ఎన్.శేషన్ జమానాలో  జాగృతమైననాటినుండీ - ఎన్నికల కమిషన్ ఎన్ని సార్లు నిజంగా కొరడా ఝళిపించింది? ఎప్పుడూ హద్దు మీరిన వాళ్లపై కన్నెర్రచేసి ఊరుకోవటమే కానీ శిక్షలు పడిందెవరికి? తాటాకు మంటలాంటి ఇసి కోపాన్ని ఇప్పుడెవరూ లెక్కచేయకపోవటంలో వింతేముంది?
అసలు, కోడ్ ఉల్లంఘించినవారికి శిక్షలు వేసే లేదా వేయించే అధికారం ఎన్నికల కమిషన్ చేతిలో ఉందా? ముఖ్యమంత్రిపై వచ్చిన కొన్ని ఫిర్యాదులు నిరూపించబడితే ఆయనకి భారీ జరిమానా, రెండేళ్లకి తక్కువకాకుండా జైలు శిక్ష తప్పవని ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సెలవిచ్చారు. అలాంటి చర్యలు తీసుకునే అధికారం ఇసికి లేదని హైకోర్టు న్యాయమూర్తొకరు వెంటనే స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ కేవలం కాగితం పులేనా? ఒక వేళ ఇసి పట్టుదలగా ముఖ్యమంత్రిమీద చర్యకుపక్రమించినా, మహాపరాధాలు చేసీ దర్జాగా తిరుగుతున్న చట్ట సభల సభ్యులు వందలకొద్దీ ఉన్న మన దేశంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించాడన్న కారణంతో ఒక ముఖ్యమంత్రి జైలుపాలవటం జరిగే పనేనా?
'ఆ దేశంలో చట్టం తన పని తను చేసుకుపోతుంది, దొంగలు వాళ్ల పని వాళ్లు చేసుకుపోతారు. ఒకరి పనిలో ఒకరు జోక్యం చేసుకోరు' అనేది మన వ్యవస్థకున్న ఒకానొక వ్యంగ్య నిర్వచనం. ఎన్నికల కమిషన్ హెచ్చరికలనూ, వాటిని లెక్కచేయని రాజకీయ నాయకుల ధైర్యాన్నీ కూడా ఈ కోణంలోనుంచే అర్ధం చేసుకోవాలేమో.
రెండు రోజుల క్రితం కర్ణాటక ఎన్నికల ఫలితాలొచ్చాయి. భాజపా అత్యధికంగా 110 స్థానాల్లో గెలిచి దక్షిణాదిన మొదటిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో వడి వడిగా అడుగులేస్తుంది. పూర్తి మెజారిటీకి మరో మూడు స్థానాలు తక్కువయ్యాయి కానీ స్వతంత్రులుండనే ఉన్నారుగా. ఈ సారి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన వారి పంట పండినట్లే.
దక్షిణాదిలోకెల్లా అత్యంత అనిశ్చితమయిన ప్రభుత్వాలుండేది కర్ణాటకలోనే. కప్పల తక్కెడ రాజకీయాలకీ రాష్ట్రం గొప్ప ఉదాహరణ. ఇక్కడ ఐదేళ్లలో ఎందరు ముఖ్యమంత్రులు మారతారో చెప్పటం ఎప్పుడూ కష్టమే. 1988లో ఎస్.ఆర్.బొమ్మై నుండి పోయినేడాది ఆఖర్లో బి.ఎస్.యెడ్యూరప్ప దాకా ఇరవయ్యేళ్ల కాలంలో సరిగా పదిమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు! అంటే సగటున ప్రతి రెండేళ్లకూ ఒకరు మారినట్లు. ఈ సారీ ఆ పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చు. దక్షిణాదిన పాగా వేసిన సంతోషంలో ఇల్లలకగానే పండగ కాదనే విషయాన్ని కమలనాధులు మర్చిపోతే ప్రమాదమే. కొన్నేళ్లలో కాంగ్రెసు, దేవెగౌడ కలిసిపోయి భాజపాని చీల్చే ప్రయత్నం చెయ్యరనే నమ్మకమేమీ లేదు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రికి కర్ణాటక భాజపాలోని కొందరు ముఖ్య నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలుండటం ముందు ముందు కాషాయదళానికి కలవరం కలిగించే విషయం కావచ్చు.
ఈ ఎన్నికల ఫలితాలలో ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, మొదటి స్థానంలో ఉన్న భాజపా కన్నా రెండవ స్థానంలో ఉన్న కాంగ్రెసుకి ఎక్కువ శాతం ఓట్లు పడటం. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెసుకి 34.6 శాతం ఓట్లు రాగా భాజపాకి 33.9 శాతం మాత్రమే లభించాయి. అంటే కర్ణాటకలో కాంగ్రెసు గెలిచీ ఓడినట్లా?
అసలు మనదేశంలో ఎన్నికల్లో గెలుపు ఓటములు నిర్ధారించే పద్ధతే అర్ధరహితంగా ఉంటుంది. ఉదాహరణకి, ఒక పార్లమెంటు స్థానంలో పది లక్షల ఓట్లున్నాయనుకుందాం. అక్కడ నలుగురు పోటీ చేశారనుకుందాం. పోలయిన ఓట్లు ఆరు లక్షల చిల్లర - వాటిలో చెల్లినవి ఆరు లక్షలు ఉంటే, గెలిచిన వాడికి రెండున్నర లక్షలు, రెండో స్థానంలో ఉన్నవాడికి లక్షన్నర, మిగతా ఇద్దరికీ కలిపి రెండు లక్షలు వచ్చాయనుకుందాం. అంటే, విజేత తన సమీప ప్రత్యర్ధిపై లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచాడన్న మాట. ఆహా, ఎంత పెద్ద మెజారిటీయో అనుకుంటాం మనం.
అయితే, ఇందులో ఓ తిరకాసుంది. రెండున్నర లక్షల మంది ఇతను మాకు కావాలంటే, మిగతా మూడున్నర లక్షల మంది ఇతను మాకొద్దు మొర్రో అన్నారు. ఇతను కావాలన్న వారి కంటే వద్దన్న వారు లక్ష మంది ఎక్కువ. అయినా ఇతను గెలిచి ఎం.పి. అయ్యాడు! అదృష్టం బాగుంటే ఇతనే ప్రధాన మంత్రి కూడా కావచ్చు. ఇంత సొంపుగా ఉంది మన ప్రజాస్వామ్యం.
పోలయిన ఓట్లలో సగం కన్నా ఎక్కువ ఓట్లు పడితేనే గెలిచినట్లు అనే నియమం కొన్ని దేశాల్లో అమల్లో ఉంది. మన దగ్గర కూడా అటువంటిదెందుకు పెట్టరు? సగం కన్నా ఎక్కువ ఎవరికీ రాకపోతే ఏం చెయ్యాలన్న ప్రశ్న వస్తుంది వెంటనే. అప్పుడు మళ్లీ ఓటింగ్ పెట్టమనండి. అలా ఎన్ని సార్లంటారా? ఎవడో ఒకడు గెలిచేటన్ని సార్లు. డబ్బు దండగంటారా? ఎవడి మీదో అలిగొకడు, ఏదో చేసేస్తున్నట్లు కనిపించటానికి ఇంకొకడు, ఏం చెయ్యాలో అర్ధం కాక మరొకడు  .. ఇలా పనికిమాలిన కారణాలతో రాజీనామాలు చేసేవాళ్లకోసం సంవత్సరం పొడుగూతా ఎక్కడో ఒకచోట ఉప ఎన్నికలు జరుగుతూనే ఉండే డేశంలో ఒక మంచి మార్పు కోసం మళ్లీ మళ్లీ ఎన్నికలు పెట్టినా దండగేముంది?
బిసి, ఎస్ టి, ఎస్ సి విద్యార్ధులకు రాష్ట్రంలోని ప్రైవేటు ఎం బి బి ఎస్, బిడిఎస్ కళాశాలల్లో ప్రవేశానికి అర్హతా పరీక్షల (ఇంటర్, ఎం సెట్) కనీస మార్కులను 50 నుండి 40 శాతానికి తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా తరగతుల అభ్యర్ధుల్లో 50 శాతం మార్కులు వచ్చిన వారు ఎక్కువమంది లేకపోవటంవల్ల కొన్ని కళాశాలల్లో సీట్లు మిగిలిపోవటం దీనికి కారణమట.
ఇదంతా ప్రభుత్వానికి వెనకబడిన వర్గాల మీదున్న ప్రేమకి తార్కాణంలా కనిపిస్తున్నా, అసలు కారణం మాత్రం ఏదోలా ప్రైవేటు కళాశాలల్లో సీట్లన్నీ నింపుకునేలా చెయ్యటమేనన్నది సుస్పష్టం. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల విద్యా వ్యాపారాన్ని మరింత లాభసాటిగా చేయటమే అర్హతా మార్కుల తగ్గింపు వెనుక అసలు రహస్యం. కుప్పలు తెప్పలుగా కళాశాలలకు అనుమతులిస్తూపోతే సీట్లెలా నిండుతాయి? మరి కొన్నేళ్లు పోయాక - ఇప్పుడున్న కాలేజీలకు మరిన్ని తోడయ్యాక - ఇదే వంకతో కనీస మార్కుల శాతాన్ని 40 నుండి 30 కి తగ్గిస్తారేమో.  ఇంటర్ లోనూ, ఎం సెట్ లోనూ నూటికి నలభై మార్కులు కూడా రాని వారు ఏ రకంగా కఠినమైన వైద్య విద్య పూర్తిచేయగలుగుతారు? ఈ సంగతి ఎవరికీ పట్టదు.
మన దేశంలో రిజర్వేషన్లగురించి ప్రశ్నించడమో పాపం. అవెందుకని ఒక గొంతు అడిగితే సామాజిక, ఆర్ధిక కారణాల చిట్టా విప్పుతూ వంద గొంతులు వినిపిస్తాయి. దాదాపు అరవయ్యేళ్లుగా అమల్లో ఉన్నా వెనుకబడినవర్గాలకు రిజర్వేషన్లతో ఒరిగినదెంత? ఆ తాయిలం చూపించి వాళ్లని ఎప్పటికీ వెనుకనే ఉంచటమే తప్ప నిజంగా ఆ వర్గాలని ఉద్ధరించాలనే సంకల్పం ఏ ప్రభుత్వానికుంది? కోటాలు లేని వారికి అవి ఉన్నవారిపై ఆగ్రహావేశాలు, ఆ పేరిట వెనుకబడిన కులాల వారికి మరిన్ని అవహేళనలు. అసలు, కులాల పేరుతో వెనకబాటుతనాన్ని కొలవటమేమిటి? నాలుగు ఓట్లు రాలతాయంటే అడిగిన వారికీ, అడగని వారికీ కూడా ఎంతో కొంత రిజర్వేషన్ ముష్టి విదిలించే ప్రభుత్వాల కాలమిది. కోటాల వల్ల వచ్చిందేమీ లేకపోగా అవి అనుభవించే కులాల మధ్య ఎవరికెంత అనే విషయంలో గొడవలు మొదలై ఉద్యమాలదాకా వెళ్లాయి. ఇప్పటికే ఉన్న గోల చాలనట్లు మతాల పేరిట కూడా రిజర్వేషన్లిచ్చే ఆచారమొకటి కొత్తగా తలెత్తుతుంది.
రిజర్వేషన్ల మీద పిడకల వేట పక్కనబెట్టి అసలు కధలోకొస్తే, ఇలా 40 శాతం మార్కులతో ఎలాగో గట్టెక్కి ఎం సెట్ లో కూడా ఎక్కువ ర్యాంకు తెచ్చుకున్న వారికి బి-కేటగిరీ కింద అధిక ఫీజులు వసూలు చేసి సీట్లిస్తారట. అయ్యా, అదీ సంగతి. అధిక ఫీజులు కట్టగలుగుతున్నారంటే వెనుకబాటుతనం చదువులోనే కానీ డబ్బులో కాదన్నమాట! ఇప్పటికే గొందికొకరుగా ఉన్న డొనేషన్ వైద్యులకి ఈ నలభై శాతం నారాయణులూ తోడయితే రోగుల గతేమిటి హరీ?
కర్నూలు జిల్లాలో కొన్నేళ్ల నిద్రావస్థ తర్వాత మళ్లీ పడగ విప్పిన ఫ్యాక్షన్ భూతం గతవారం స్థానిక కప్పట్రాళ్ల గ్రామ తెలుగుదేశం నేత పాలెగారు వెంకటప్పనాయుడుతో సహా తొమ్మిదిమందిని బలితీసుకుంది. దీనిపై స్పందిస్తూ తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పటిమాదిరిగానే వైఎస్ పై, ఆయన ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. ఇది ఫ్యాక్షన్ ప్రభుత్వమని, ఈ ముఖ్యమంత్రి హయాంలో తమ పార్టీ కార్యకర్తలెవరి ప్రాణాలకూ భరోసా లేదనీ, .. ఇలా మనం ఎన్నో సార్లు వినున్న వాక్యాలే మళ్లీ వల్లె వేశారు. అయితే, హతుల నేపధ్యం తెలిసినవాళ్లకు చంద్రబాబు మాటలు గురివింద చందంగా అనిపిస్తే అది వాళ్ల తప్పుకాదు.
కాంగ్రెసు అధికారంలోకొచ్చాక రాయలసీమలో ఫ్యాక్షనిస్టుల ఆగడాలు పెరిగిపోయిన మాట నిజమే. అయితే, ఫ్యాక్షనిజం మహమ్మారిని ప్రోత్సహించటంలో తెలుగుదేశం కూడా తక్కువేమీ తినలేదు. రాజకీయావసరాల కోసం వైరివర్గాలను చేరదీసి రాయలసీమలో రక్తపుటేర్లు పారిస్తున్న తిలాపాపం కాంగ్రెసు, తెలుగుదేశాలకు తలా పిడికెడు. కత్తితో చంపేవాడు కత్తితోనే మరణిస్తాడన్న బైబిలు వాక్యం సాక్షిగా ముఠా తగాదాలతో మమేకమైపోయిన జీవితాలు అలాగే ముగిసిపోతాయి. చేసుకున్న వారికి చేసుకున్నంత. ముప్పై ఎనిమిదేళ్లుగా ఫ్యాక్షన్ తో పెనవేసుకున్న వెంకటప్పనాయుడి బ్రతుకూ అలాగే తెల్లారిపోయింది. నిజమిలా ఉంటే, హతుల గత చరిత్ర తెలియనట్లు చంద్రబాబు అమాయకత్వం ఒలకబోయటం విడ్డూరం.
'ఫ్యాక్షన్ అనేది ఫాషన్ కాదు. ఒక సారి ఈ ఊబిలో కూరుకున్నారంటే బయటకు రాలేరు. నా కధ విన్నాకైనా దీనికి దూరంగా ఉండండి' అని నాలుగేళ్లనాటి ఈనాడు ఇంటర్వ్యూలో చెప్పిన వెంకటప్పనాయుడి మాటల వెనుక ఒక నిస్సహాయుడి ఆవేదన కనిపిస్తుంది. అతని ప్రత్యర్ధులని కదిలించినా దాదాపు ఇవే మాటలు చెబుతారేమో. ఇరు వర్గాలూ విసుగెత్తిపోయి ఉన్నా ఇంకా ఫ్యాక్షన్ బ్రతికే ఉండటానికి కారణం నిస్సందేహంగా రాజకీయ పార్టీల చదరంగమే. ఫ్యాక్షన్ గురించి చంద్రబాబు, వైఎస్ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవటం ఆపి దీన్ని అరికట్టటానికి కలిసి కృషి చెయ్యాలి. ఫ్యాక్షనిస్టులకు తమ పార్టీలలో చోటు ఇవ్వమని ప్రకటనలతో సరిపెట్టటం కాకుండా దాన్ని చేతల్లో చూపించాలి. పోలీసులకు ఈ విషయంలో పూర్తి అధికారాలిచ్చి వారిపై రాజకీయ ఒత్తిడి లేకుండా చూడాలి. ఫ్యాక్షన్ నుండి రాజకీయాన్ని విడదీసిన నాడు ఎందుకు లొంగదీ పెనుభూతం?
ఫ్యాక్షనిజాన్ని పౌరుషానికి చిహ్నంగా చూపుతూ తొడలుగొట్టి మెడలు నరికే సినిమాలు పదులకొద్దీ తీస్తున్న తెలుగు చిత్రపరిశ్రమ కూడా ఈ విషయమై పునరాలోచించుకోవాలి. ఇన్నాళ్లూ ఫ్యాక్షన్ పేరిట సొమ్ముచేసుకున్న నిర్మాతలు కాస్తంత సామాజిక బాధ్యత వహించి అదే ఫ్యాక్షనిజాన్ని తెగనాడుతూ సందేశాత్మక చిత్రాలెందుకు తీయకూడదు? సొంత లాభం కొంత మానుకుని సినీ మాధ్యమానికున్న శక్తిని సమాజ హితంకోసం ఎందుకు వాడకూడదు?
చిరంజీవి రాజకీయ ప్రవేశం ఖాయమైన నేపధ్యంలో తెలుగుదేశానికి మరింత సినీ గ్లామర్ అద్దే ప్రయత్నాలు ఇటీవల ముమ్మరమయ్యాయి. ఎన్టీయార్ వారసులందరూ తెదెపా వెనుకే ఉన్నారన్న సంకేతాలు జనంలోకి పంపే లక్ష్యంతో బాలకృష్ణ తదితర కధానాయకులని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావటం కోసం చంద్రబాబు కృషి చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనివల్ల ఉపయోగం ఎంతుందో తెలీదు. బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చినా, రాకపోయినా ఆయనే పార్టీకి మద్దతిస్తాడో ఎవరికి తెలియదు? ఇప్పుడు ఆయన తెదెపాలో ప్రధాన పాత్ర పోషించినంతమాత్రాన ఆ పార్టీ అదృష్టం రాత్రికి రాత్రి మారిపోతుందనేది అనుమానమే.
మరో వంక, చిరంజీవి పార్టీ వల్ల ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంతెంత నష్టం కలగనుందో తెలీని అయోమయ పరిస్థితి. ఒకటి మాత్రం నిజం. 1983లో ఎన్టీయార్ లా ఇప్పుడు చిరంజీవి ప్రభంజనం సృష్టించే పరిస్థితులు రాష్ట్రంలో లేవు. కానీ ఆయన కోస్తా, రాయలసీమల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రధాన పక్షాల ఓటు బ్యాంకులకు గండికొట్టవచ్చు. కులాలవారీ ఓట్ల ప్రాతిపదికన చూస్తే ఈ నష్టం కాంగ్రెసుకే ఎక్కువుంటుందని కొందరి అంచనా. తెలంగాణలో పరిస్థితిపై ఈ నెలాఖరున జరగబోయే ఉప ఎన్నికల ఫలితాలొచ్చేదాకా ఏమీ చెప్పలేం. కెసియార్ ఎంత కష్టపడినా తెరాస ఎన్నో కొన్ని సీట్లు కోల్పోక తప్పేలా లేదు. అదే జరిగితే తెలంగాణ సెంటిమెంటుపై నీళ్లుజల్లేలా ఆయన ప్రత్యర్ధుల రాజకీయాలు నడవటం తధ్యం. అయితే, కెసియార్ పనయిపోయిందనుకున్నపుడల్లా ఆయన ఒక కొత్త ఎత్తుగడతో తిరిగి రావటం ఇప్పటికే చాలాసార్లు చూసి ఉన్నాం కాబట్టి, ఉప ఎన్నికల ఫలితాలెంత నిరాశాజనకంగా ఉన్నా కెసియార్ ఏదో ఒక టక్కుటమార ప్రదర్శన చేసి వచ్చే సాధారణ ఎన్నికలనాటికి కూడా తెలంగాణలో ఒక నిర్ణయాత్మక శక్తిగానే ఉండే అవకాశాలు ఉన్నాయి.
కమ్యూనిస్టుల వైఖరెలా ఉండబోతుందో కొంత స్పష్టంగానే ఉంది. 2009 నాటికి సి.పి.ఎం. తెదెపాతో జట్టుకట్టే సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. సి.పి.ఐ. ప్రస్తుతానికి వేచిచూచే ధోరణిలో ఉన్నా, ఎన్నికలనాటికి తన సహచర కామ్రేడ్స్ తోనే కలసి నడవొచ్చు. బి.జె.పి.ది ఒక వింత పరిస్థితి. 1999 నుండి 2004 మధ్యకాలంలో తప్ప, రాష్ట్రంలో ఆ పార్టీ ఎప్పుడూ అంటరాని పక్షమే. వచ్చేసారి కూడా ఎన్నికల్లో వాళ్ల ప్రాబల్యం కనిపించే సూచనలు లేవు. ఆదర్శాలు బాగున్నా ఎన్నికల సమరాంగణంలో లోక్ సత్తా సత్తా ఎంతో ఇంకా తెలియదు కాబట్టి వాళ్లతో పొత్తులకు ఎవరూ పెద్దగా ఉత్సాహం చూపించకపోవచ్చు.
తెలుగుదేశం - చిరంజీవి పార్టీల నాయకత్వంలో ఒక ఉమ్మడి ప్రతిపక్ష వేదికకై కమ్యూనిస్టులు ప్రయత్నాలు చేయవచ్చనేది కొందరు విశ్లేషకుల అభిప్రాయం. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వాళ్లు చిరంజీవి సన్నిహిత బృందంలో ఎక్కువమంది ఉండటం కూడా ఈ ఊహకి ఆధారం కావచ్చు. బి.వి.రాఘవులు ఈ మధ్య చేసిన వ్యాఖలు దీన్ని బలపరిచే విధంగానే ఉన్నాయి. సినీ రంగంలో ప్రత్యర్ధులుగా ఉన్న చిరంజీవి, బాలకృష్ణ రాజకీయాల్లో చేతులు కలిపితే పెద్ద విశేషమే. మీడియా మొగల్ రామోజీరావు కూడా తెరవెనుక ఇవే ప్రయత్నాలు చేస్తున్నట్లు కొన్ని పుకార్లు. ఇటీవల చిరంజీవిని వ్యక్తిగతంగా ఇబ్బందుల పాల్జేసిన పలు సంఘటనల వెనుక కాంగ్రెసు నాయకుల ప్రమేయం ఉన్నదనీ, అందువల్ల, ఆయన ఎవరో ఒకరి వైపు మొగ్గుచూపే పరిస్థితే వస్తే అది తెదేపా వైపే అవుతుందనీ మరికొందరి వాదన. మొత్తమ్మీద వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో సినీ తారల హంగామా ముందెన్నడూ లేనంత ఎక్కువగా ఉండొచ్చు.
చిరంజీవి ఎవరితో జట్టు కడతాడు అనే విషయంలో పుకార్లు, అంచనాలు ఎలా ఉన్నా, ఆయన కాంగ్రెసు పార్టీతో కలవడని మాత్రం తేలికగానే చెప్పవచ్చు. కాంగ్రెసుని తిరిగి అధికారంలో ఉంచటానికి ఆయన సినిమాలు మానుకుని రాజకీయాల్లోకి రాడు కదా. అలాగే చంద్రబాబునో, బాలకృష్ణనో ఉద్దరించటానికి కూడా చిరంజీవి రాజకీయాల్లోకి రాడు. వ్యక్తిగతంగా ఎంత కాంగ్రెసు వ్యతిరేకత ఉన్నా ఎన్నికలకు ముందే తెదెపాతో చిరంజీవి పొత్తు పెట్టుకోకపోవచ్చు. పైగా, ఎన్నికలకు ముందే తెదెపాతో చెలిమి చేస్తే తన సామాజిక వర్గం ఓట్లుకూడా గణనీయమైన సంఖ్యలో ఆయనకు పడకుండా పోయే ప్రమాదం ఉంది - దీనికి కారణం ఎక్కువమంది కాపులు మొదటినుండీ తెదెపాకి వ్యతిరేకంగా ఉండటం. కాబట్టి చిరంజీవి ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి మెజారిటీ రాని పక్షంలో కాంగ్రెసేతర కూటమితో చేతులు కలపొచ్చు. అదే జరిగితే (తెరాస - కాంగ్రెసుల ఏడాదిన్నర కాపురాన్ని లెక్కలోకి తీసుకోకుండా ఉంటే) రాష్ట్రంలో మొదటి సంకీర్ణం అధికారంలోకొచ్చినట్లే. ఎందుకంటే, గెలుపుపై వైఎస్సార్ ఎంత ధీమాగా ఉన్నా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే 2004లో చంద్రబాబుకి లాగానే చేదు ఫలితాలు ఎదురవక తప్పదు. దీనికి విరుగుడు, తిరిగి ఎవరో ఒకరితో చెయ్యి కలపడం. తెదెపా, చిరంజీవి, బిజెపి, కమ్యూనిస్టులని తీసేస్తే ఇక మిగిలింది తెరాస. తప్పకుండా తెలంగాణ ఇస్తామంటే తెరాస అందుకు ఒప్పుకోవచ్చు. కానీ, ఒక సారి అనుభవమయ్యాక కాంగ్రెస్ మాటని కెసియార్ మళ్లీ నమ్మినా తెలంగాణ ప్రజలు నమ్ముతారా?
నాలుగేళ్లుగా ఏడాదికోసారి ఆర్భాటంగా పునరంకిత సభ పేరుతో జరుపుతున్న జాతర ఈ మారు కూడా వందిమాగధగణం సమక్షంలో కమనీయంగా జరిపుకున్నారు ముఖ్యమంత్రివర్యులు. ఈ సభలో యధాప్రకారం పరనిందతో పాటు ఆత్మస్థుతి కూడా కావలసినంత చేసుకున్నారు. నాలుగేళ్ల పాలనలో స్వపరివారంపై తాము జరిపించినన్ని విచారణలు దేశంలోనే ఏ ముఖ్యమంత్రీ జరిపించలేదని చెప్పుకుని మురిసిపోయారు. ఇదొక రికార్డని ఆయన ఉద్దేశ్యమేమో. అయితే, ఒక ముఖ్యమంత్రిపై, ఆయన పరివారంపై ఇన్ని ఆరోపణలు రావటం కూడా ఒక రికార్డేనని ఆయనకి తెలియకపోవటం వింతే. ఆయా విచారణల్లో ఎన్ని పూర్తయ్యాయి, వాటిలో ఏమి తేల్చారు లాంటి విషయాలు మాత్రం ఆయనెంత తెలివిగా దాటవేసినా జనాల దృష్టిలోంచి తప్పుకుపోవు.
1999 ఎన్నికల అనంతరం చంద్రబాబు తనకి మంత్రి పదవి కాకుండా ఉపసభాపతి పదవి ఇచ్చినందుకు అలిగి కెసియార్ తెరాస పార్టీ పెట్టాడని వైఎస్సార్ కి ఈ మధ్యనే తెలిసింది. నాలుగవ పునరంకిత సభలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించటమే కాకుండా 'ఇది నిజమా కాదా' అంటూ కెసియార్ ని నిలదీశారు. ఆ విషయం నాలుగేళ్ల క్రితమే తెలిసుంటే 2004 ఎన్నికలప్పుడు తెరాసతో సర్దుబాటు చేసుకునేవాళ్లు కాదేమో! 'తెలంగాణా ఏమన్నా మీ ఒక్కరి సొత్తా?' అని కెసియార్ ని ఒకవంక నిలదీస్తూనే మరోవంక 'ఈ సమస్యకి పరిష్కారం చూపగలిగేది కాంగ్రెస్ ఒక్కటే' అని ముక్తాయించటం ద్వారా తెలంగాణా కాంగ్రెసు పార్టీకి మాత్రమే గుత్త సొత్తు అని చెప్పకనే చెప్పారు. కమిటీలపై కమిటీలేయటం, అందరి అభిప్రాయాలూ తీసుకుని తమ అభిప్రాయం మాత్రం చెప్పకపోవటం, రోజుకో రకంగా మాట్లాడటం .. ఇలాంటి వాటితో తెలంగాణా సమస్య పరిష్కారమవుతుందనేది ఆయన ప్రగాఢ నమ్మకం కావచ్చు.
వైఎస్సార్ కి ఈ మధ్య కలిగిన మరో కనువిప్పు కమ్యూనిస్టుల గురించి. ఇన్నాళ్లూ సి.పి.ఎం. సిద్ధాంతాలున్న పార్టీ అని ఆయన అనుకునే వాడట. తమని కాదని ఉప ఎన్నికల్లో తెదెపాతో జట్టు కట్టేసరికి ఆ పార్టీ సిద్ధాంతాలు గాలికెగిరిపోయానని ఈయన ఆవేదన చెందటం మొదలెట్టాడు. పదిహేనేళ్ల పాటు తెదేపాతో అంటకాగి 2004లో కాంగ్రెసుతో కలిసి నడిచినప్పుడు కమ్యూనిస్టుల సిద్ధాంతాలకు ఢోకారాలేదేమో మరి.  'కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదొద్దు' అని చంద్రబాబు నుద్దేశించి బి.వి.రాఘవులుకి సభాముఖంగా సలహా ఇచ్చారు. 'మరి నాలుగేళ్ల క్రితం మీ తోక పట్టుకుని ఈదాం కదా. మీరూ కుక్కేనా, లేక మరేదన్నా జంతువా?' అని రాఘవులు గారు ధర్మ సందేహం వ్యక్తం చేశారు కానీ దానికి సమాధానమిచ్చేంత తీరికా, ఓపికా వైఎస్ కేవీ?
ఇదే సభలో, ఏడాదిలో రాబోయే సాధారణ ఎన్నికలకోసం ఇప్పటినుండే జనంలోకెళ్లి నాలుగేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిని వాళ్లకు వివరించాలని కాంగ్రెసు కార్యకర్తలను ఆదేశించారు వైఎస్. అవినీతి వరదలో కొట్టుకుపోతున్న జలయజ్ఞం, సెజ్ ల పేరిట బక్కరైతుల పొట్టకొట్టి అస్మదీయులకు చేస్తున్న భూసంతర్పణ, రాష్ట్రమంతటా రకరకాల పార్కుల పేరుతో సాగుతున్న రియల్ ఎస్టేట్ దందా, రాజధానిలో విచ్చలవిడిగా ప్రభుత్వ భూముల వేలం, దేవుడి పాలనలోనూ ఆగని రైతుల ఆత్మహత్యలు, రాయలసీమలో పెచ్చరిల్లిన ఫ్యాక్షన్ హత్యలు, వెగటు పుట్టించే రాజీవ నామ జపం, నాలుగేళ్లయినా పాలనపై పట్టు చిక్కలేదని వస్తున్న విమర్శలు, ఎంతటికైనా తెగించి స్వజనానికి లాభం చేకూర్చటం, కొన్ని వర్గాలను పనిగట్టుకుని సాధించటం, అవినీతిపై ఎవరేమి ప్రశ్నించినా తెగబడి ఎదురుదాడి చెయ్యటం .. ఇవా అభివృద్ధి సూచికలు? అభివృద్ధి ఉంటే ప్రచారంతో పనిలేకుండానే జనాలకర్ధమవుతుంది. ఇప్పటికైనా తీరు మారకుంటే 2004 ఎన్నికల్లో చంద్రబాబుకు పట్టిన గతే వచ్చేసారి వైఎస్ కూ పట్టటం తధ్యం.