చాలా కాలంగా మన పురాణేతిహాసాలకు సంబంధించి నాకొక సందేహం ఉంది. ఖచ్చితమయిన సమాధానం దొరకలేదు. కొద్దోగొప్పో నాకు తెలిసింది హిందూ మతం గూర్చి కాబట్టి నా సందేహం అటువైపు నుంచే వ్యక్తం చేస్తాను.
త్రేతాయుగంలో శ్రీరాముని కాలము అలాగే ద్వాపరయుగములోని శ్రీకృష్ణుని కాలపు అవతార విశేషాలతో కూడిన రామాయణ, మహాభారతాలలో ఉదహరించిన ప్రదేశాలు, స్థితిగతులు అన్నీ హిందూ దేశంలోనే (అఖండ భారతం అనుకోండి ఇరాన్, ఇరాక్ దాకా కలుపుకున్నా) ఉన్నట్లు, జరిగినట్లు తెలుస్తాయి. ఉదా: పట్టణాల పేర్లయిన అయోధ్య, మథుర, గాంధారం లేదా శ్రీలంక మొదలైనవి.
నా సందేహం ఏమంటే, ఇలా భగవంతుడు అవతరించిన ప్రదేశం కేవలం మనకి తప్ప ఇతర ప్రాంతాలవారికి తెలియకపోవటం చేత వారికి మన మతమూ, మన దేవుడూ పట్ల అవగాహన, నమ్మకం ఉండకపోవటంలో ఆశ్చర్యం లేదనుకుంటాను. నాకు ఇతర మతాల గ్రంధాలపై అవగాహన లేదు కానీ, ఒకవేళ అవి కూడా ఇలానే వారివారి పరిస్థితులు, ప్రదేశాలనే ఉదహరిస్తే గనక, దేవుడు ఒకడే అనో లేదా అన్ని మతాలు ఒకటే అని మంచిమాటలు చెప్పినా వివిధ మతాల ప్రజలు పట్టించుకోకపోవటంలో కీలకం ఇలాంటిదేదో ఉందేమో. అసలు అందుకే ఒకరి నమ్మకాలను ఒకరు అర్ధం చేసుకోకుండా మూర్ఖంగా కొట్టుకుంటున్నారేమో కూడా.
ఇతరుల సంగతి పక్కనపెడితే,  నా మరో సందేహం మన గ్రంధాలలో కేవలం మనకు పరిచయమైన ప్రదేశాలనే చెప్పటం (ఈ విషయములో నాకు తెలియని సమాచారం ఉండొచ్చునేమో, దయచేసి నన్ను తప్పని కాస్త గ్రంధ ప్రమాణాలతో చెపితే నాకు చాలా సంతోషం) యొక్క అర్ధం ఏమిటి? అఖండ భారతాన్ని మించిన భూభాగం అప్పట్లో లేదనా లేక ఇంకెక్కడా మనుష్యులే లేరనా? ఏమో, నాకు మటుకు రెండూ సహేతుకంగా అనిపించట్లేదు.
ఈ విషయముపై మీ ఆలోచనలేమిటి?
ఈ మధ్య ఓ అమ్మడు నాకు కాఫీ కలిపేవాడు, అంట్లుతోమేవాడు మొగుడుగా కావాలి అంటూ పాడుతూ తెగ ఊదరగొడ్తోంది. షరతుల పెళ్ళికొడుకుల తర్వాత షరతుల ఆడపిల్లల్ని వెతుకుతున్నానేమో, ఈ అమ్మడి బాధేంటో చూద్దామని ఆ పాట సాహిత్యాన్ని ఓ చూపు చూశా. అంతే, ఆ సాహిత్యపు విలువలకి దిమ్మ పూర్తిగా తిరిగి కళ్ళు బైర్లు కమ్మాయి.
ఈ మధ్యే మన రాకేశ్వరుడు నవతరంగంలో సినిమాల హీనస్థితి గూర్చి రాశారు. ఇది దిగజారుతున్న సినీ సాహిత్యానికి మరో ఉదాహరణ. ఏమాటకామాటే, రాసిన చంద్రబోసు గారు చాలా మంచి పాటలు అందించారు గతంలో. పోనీ డబ్బింగు సినిమానా అంటే అదీ కాదే. ఇలా రాసేంత క్లిష్టపరిస్థితులేమిటో మరి...
ఇక పాట విషయానికొస్తే,
అమ్మడికి కాఫీ కలిపి, కంచం కడిగి, వెనక నక్కుతూ ముందు మొక్కుతూ ఉండే వాడు కావాలిట... అంటే ఉత్త చవట, వెన్నెముక లేనివాడు అనేగా. అబ్బాయికి బైకెక్కి, బ్యాకు నొక్కి, చితక్కొట్టుడు కొట్టని, బట్టలు ఇస్త్రీ చేసేది కావాలిట. ఇదీ సాహిత్యం వరస. ఇంకా నన్ను బాగా హింసించిన వాక్యాలివి.
తాగూ ఊరేగు అది మగలక్షణమని చెప్పే లేడీ కావాలి (ఇది హీరోగారి పలుకండోయ్)
నా అప్పు తానే తీర్చాలి (పూర్తిగా సిగ్గుశరం వదిలేశాడు..వీడి అప్పు తీర్చే అమ్మాయి కావాలా, ఇదెక్కడి డ్యూయెట్టురా దేవుడా). ఉదయాన్నే అయిదింటికొస్తే తలుపు తియ్యాల్ట. (మా ఇళ్ళల్లో తలుపు తీస్తారు గానీ, అలా రోజూ వస్తే మొహాన పేడనీళ్ళు చల్లుతారు బాబూ.)
ఈ లెక్కన సినిమాకి పాట రాయలేనిదెవడు? చూస్తూ, వింటూ ఆనందించండి దిగజారిన మన సినీ సాహిత్యాన్ని.
ఎవడు ఎవడు ఎవడు ఎవడు ఎవడు ఎవడు
ఎవడు ఎవడు ఎవడు ఎవడు ఎవడు ఎవడు
నా కాఫీ  కలిపేవాడు నా కంచం కడిగేవాడు
నా కష్టం తీర్చేవాడు నాక్కావాలి
నా కూడా వుండేదీ నా డ్రెస్సే పిండేదీ
నన్నే ఇస్త్రీ చెయ్యనిది నాక్కావాలి
నా చేత చిక్కేవాడు నా వెనక నక్కేవాడు
నా ముందు మొక్కేవాడు నాక్కావాలి
నా బైకే ఎక్కేదీ నా బ్యాకే నొక్కేదీ
నన్నొదిలి చెక్కెయ్యనిది నాక్కావాలి
సరి అయిన మొగుడు ఎవ్వడు
సుగుణాల మగువ ఎవ్వరు
ఎన్నో అందించేవాడు ఎదురేదీ అడగనివాడు
ఏటీయెం అయ్యేవాడు ఎవడు ఎవ్వడు ఎవడు ఎవ్వడు
ఎవడు ఎవడు హేయ్....
మందూ సిగరెట్టూ చెడు అలవాటంటూ వుండని వాడే కావాలి
తాగూ ఊరేగు అది మగలక్షణమని చెప్పే లేడీ కావాలి
అమ్మాయీ,ఆంటీస్ అసలెవ్వరివంక చూడని వాడే కావాలి
చూడు తెగ చూడు అందరిలో నన్నే చూడమని తను పలకాలి
ఎంతందంగా వున్నావంటూ పొగడాలి
నిజాలు చెబితే నమ్మాలి
ఎంతో ఎంతో ఖర్చే పెట్టి తిప్పాలి
నా అప్పు తానే తీర్చాలి
ఏమైనా చేసేవాడు ఏమన్నా నమ్మేవాడు
పాతికేళ్ళ పసివాడు ఎవడు ఎవడు ఎవడు ఎవడు
ఎవడు ఎవడు హేయ్....
పెళ్ళే అయ్యాక ఇక లవ్వో గివ్వో ఆడే వాడే కావాలి
లవ్వే చేసాక ఇక పెళ్ళి గిళ్ళి ఆడే లేడీ కావాలి
ఆరు మరి యేడు సాయంత్రం లోగా ఇంటికి తానే రావాలి
ఐదు గంటలకే ఉదయాన్నే వస్తే తలుపే తాను తీయాలి
అందరికన్నా నన్నే మిన్నగా చూడాలి
నా వాళ్ళు నాకు కావాలి
జోకులు చెప్పి నవ్విస్తూనే ఉండాలి
కన్నీళ్ళు కూడా కలగాలి
ఆ నా ప్రశ్నకు బదులైనోడు నా మనసుకు మ్యాచ్ అయినోడు
నా సొగసుకు సూట్ అయినోడు ఎవడు ఎవడు ఎవడు ఎవడు
ఎవడు ఎవడు హేయ్....
నా కోసం పుట్టే వాడు నా కోసం బ్రతికే వాడు
నా కోసం చచ్చే వాడు ఎవడు..
తనదైన వ్యక్తిత్వం, గాత్రం భానుమతి గారి సొంతం. వేలమందిలోనూ అలవోకగా గుర్తించగలిగే విలక్షణమైన గొంతుక ఆవిడది. భానుమతి గారి నటనకి నేను పెద్ద అభిమానిని కాకపోయినా, ఆవిడ గాత్రానికి మాత్రం దాసోహమే. ముఖ్యంగా విప్రనారాయణ, గృహలక్ష్మి,  క్షేత్రయ్య, మల్లీశ్వరి సినిమాలలోని ఈ పాటలు నా ఆల్ టైం హిట్స్. వినండి.
రారా నా సామి రారా...
సావిరహే తవదీనా...
మేలుకోవయ్యా...
పిలచినా బిగువటరా...
పక్కల నిలబడి...