2003 నవంబర్ లో ఓ రోజు హైదరాబాదులో మా స్నేహితుల ఇంటికి వెళ్ళాం. హాల్లో కూర్చుని వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే లోపల్నించి వాళ్ళ రెండున్నరేళ్ళ పాప వచ్చింది. ఓ చేతిలో పౌడర్ డబ్బా, ఇంకో చేతిలో న్యూస్ పేపరూ ఉన్నాయి. నాతో ఆ పాపకి బాగా అలవాటే. నా దగ్గరకి వచ్చి, ‘తాతకి ఆయొచ్చింది’ అని చెప్పి పేపరు మీద పౌడరు వేస్తోంది. పేపర్లో ఏం ఉందంటే, నక్సలైట్ల బాంబు దాడిలో గాయపడ్డ చంద్రబాబు నాయుడు గారి ఫొటో. ఆ ఫొటోకి ఆ అమ్మాయి పౌడర్ రాస్తోంది. మేము తెగ నవ్వుకున్నాం. ఇప్పటికీ నాకు ఆ అమ్మాయి గుర్తు వచ్చినప్పుడల్లా ఆ సంఘటనే గుర్తు వస్తుంది.
నిత్యం టీవీలోనూ, పేపర్ లోనూ కనిపించే ప్రముఖులంతా మనందరికీ ఆత్మబంధువులని నాకో గట్టి నమ్మకం - ముఖ్యంగా సినిమా తారలూ, రాజకీయ నాయకులూ. మనల్ని కనిపెంచిన అమ్మా నాన్నా కన్నా, తోడబుట్టిన అక్క చెల్లెళ్ళూ, అన్నాదమ్ముల కన్నా వీళ్ళే మనకి ఆత్మ బంధువులు. వీళ్ళ సమాచారం తెలుసుకోకుండా మనకి రోజు గడవదు. మన మనసుల్లో అంత ప్రముఖస్థానం ఆక్రమించుకున్న వీళ్ళందరి పట్లా నిజానికి మనం మాటల్లో చూపించాల్సినంత ప్రేమ చూపించడం లేదని నా అభిప్రాయం. ఆ పసిపాపకి మనకుండే మొహమాటాలు ఉండవు కాబట్టి ఎంచక్కా మనకన్నా బాగా తన ప్రేమని వ్యక్తపరచగలిగింది.
మా అమ్మాయికి ఇంకా ఏణ్ణర్థం నిండలేదు. అది నెలల పిల్లగా ఉన్నప్పటినుంచీ నేను అప్పుడప్పుడూ మన ఆత్మ బంధువులందర్నీ పరిచయం చేస్తున్నాను. రోజూ ఆఫీసులో న్యూసంతా చదివి, ఇంటికి రాగానే దాన్ని ఎత్తుకుని కబుర్లాడుతూ ఉంటా. ‘అమ్మా, ఇవాళేమైందో తెలుసా, శ్రీజ అత్త శిరీష్ మామని పెళ్ళి చేసేసుకుందే’, అనీ, తర్వాత దాని ఫాలో అప్ గా, ‘చిరంజీవి తాత శ్రీజ అత్తకి ముప్ఫై కోట్లిచ్చాట్టే’ అనీ చెప్పాను. ‘అమ్మా, ఇవాళ వైఎస్ తాత, చంద్రబాబు తాతని కడిగేస్తానన్నాడే’ అని చెప్పా ఓ రోజు. అలాగే, ‘ఇవాళ ఐశ్వర్య పెద్దమ్మా, అభిషేక్ పెదనాన్న మన ఊరు వచ్చార్టే’ అనీ, ‘అమ్మా, ఫలానా పిన్నిదో, పెద్దమ్మదో సినిమా రిలీజైందే’ అనీ కూడా చెప్తూ ఉంటాను. హీరోలందరూ దానికి మామయ్యలూ, హీరోయిన్లు అందరూ పెద్దమ్మలో, పిన్నులో అనీ ఈపాటికి తెలివైన పాఠకులు గ్రహించే ఉంటారు.
రెండు వారాల క్రితం బ్రిటిషు రాణి అధికార నివాసమైన విండ్సర్ కోట కి మొదటిసారి మా పాపని తీసుకువెళ్ళాం. ‘అమ్మా, ఇది తాతమ్మ ఇల్లే. తాతమ్మ ఇంట్లో మంచాలూ, కుర్చీలు ఇలా ఉంటాయే. తాతమ్మకి ముద్దిస్తావా? ఇది చార్లెస్ తాత ఫొటోనే. ఇదిగో ఇది పాత మామ్మ (డయానా). ఇది కొత్త మామ్మ (కేమిల్లా)’.
అయితే మా అమ్మాయికి ఇప్పుడు కొద్దిగా మాటలు వచ్చేస్తున్నాయి. కుక్క, కాకి, అమ్మా, నాన్న మొదలైన రెండక్షరాల పదాలు పలుకుతోంది. నా ధోరణి ఇంకా కంటిన్యూ చేస్తే, రేప్పొద్దున్న నేను ఆఫీసు నుంచి రాగానే, ‘నాన్నా, ఇవాళ జగన్ పెదనాన్న లోకేశ్ బాబయ్యని ఏమన్నాడో తెలుసా?’ అంటుందేమో అని భయంగా ఉంది. ఇంక నోరు కట్టడి చేసుకోవాలి.
ఇది నా యాభయ్యో టపా .. (నిశ్శబ్దం)
ఇద్దీ, నా యాభయ్యో ఠఫా .... (.. చప్పట్లు)
థ్యాంక్యూ, థ్యాంక్యూ. ఈ సందర్భంగా ఎప్పుడూ ఉండే గోడులకి సెలవిచ్చి, మరొక్కసారి మదీయ కలాపోసన జనాలక్కూసింత రుచి చూపిద్దామనుకుంటున్నాను - రొటీన్‌కి కుంచెం భిన్నంగా. (మొదటి కలాపోసన ఇక్కడ)
బంధుమిత్రపరివారంలో పెయింటింగు రంగడిగా నాక్కాస్త పేరుంది. అయితే మొదలెట్టిన దేన్నీ పూర్తి చేయకపోవటం నా విశిష్టత. ఒకటి తొంభై శాతం పూర్తయ్యేసరికి మన దృష్టి మరోదాని మీద పడుతుంది. ఈ విషయంలో పెద్దాయన లియొనార్డో డావించీ నాకు స్ఫూర్తి - ఆయన్లా సర్వంబొచ్చు అనిపించుకోవాలనే కోరికతో రకరకాల రంగాల్లో వేళ్లు పెట్టి తరిస్తుండటం నా ప్రవృత్తి. అంచాత ఇన్నేళ్లలో నేను గీసింది కొన్ని పదుల కళాఖండాలు మాత్రమే. కిందవన్నీ జమానా కాలంలో - అంటే కనీసం పదేళ్ల క్రితం - నేను గిలికిన గీతలు. చూసినోళ్లకి వాటిలో మనుషుల ఆకారాలు కనపడ్డాయట, సరే ఇదేదో బాగానే ఉంది అని దాచి పెట్టుకున్నా. ఈ మధ్య తీసి చూస్తే అవన్నీ దుమ్ము కొట్టుకుని, వెలిసిపోయి ఆకారాలు కనిపించకుండా పోయాయి. ఈ కాలపు టెకణాళజీ వాడి వాటిని కంప్యూటరుకెక్కించి దుమ్ము, ధూళి, బూజు దులిపితే మళ్లీ ఓ ఆకారానికొచ్చాయి. ఈ దులుపుడు ప్రక్రియని స్టైలుగా రిస్టోరేషన్ అంటారట. దాన్నేమంటేనేం, బొమ్మలు తిరిగి గుర్తుపట్టేలా తయారయ్యాయిగానీ పూర్వస్థితికైతే రాలేదు. వాటిలో నాలుగు బ్లాగ్మిత్రుల దర్శనార్ధం ఇక్కడ పెట్టా. మొదటి మూడూ పెన్సిలు గీతలు, చివరాఖరిది పెన్నుతో చుక్కలు పెడుతూ వేసింది. (ఈ చుక్కలు పొడిచే పద్ధతిని pointillism అంటారని ఈ మధ్యనే తెలిసింది. అద్తెల్వకముందు నేనే ఈ టెక్కునిక్కుకాద్యుడ్నంటూ ఎగస్ట్రా పాత్రలు వేస్తుండేవాడ్ని)
ఉపోద్ఘాతమనబడే సోది, సొంతడబ్బా ఐపోయాయి. ఇక చిత్రాలు చూసెయ్యండి.
ఇవాళ ఈ న్యూస్ అయిటం చదువుతుంటే ఒక పాత సహోద్యోగి అనుభవం గుర్తొచ్చింది. గత సంవత్సరం నేను పని చేస్తున్న ప్రోజెక్టులో అతనూ ఉండేవాడు. నా పక్క సీటు. సింహళీయుడు. వయసు నలభై, నలభై అయిదు మధ్య. నాకు పరిచయమైన కొంతకాలానికి కబుర్ల మధ్యలో అన్నాడు,  ‘మన ఉపఖండం వాళ్ళకి ఒక గిఫ్టు ఉంటుంది. అదేమిటో తెలుసా?’ అని. (బ్రిటన్ లో పరిచయమయ్యే బంగ్లాదేశీయులూ, పాకిస్తాన్ వాళ్ళూ కూడా ‘మన ఆసియా వాళ్ళు’ అనో, ‘మన ఉపఖండం వాళ్ళు’ అనో అంటూ ఉంటారు.)  ఏమిటన్నాను. ‘డయాబెటీస్’ అన్నాడు. అతనికి వంశపారంపర్యంగా చిన్నతనంలోనే డయాబెటీస్ వచ్చిందిట. దానికి తోడు గుండె సమస్యలు. అప్పటికే రెండు సార్లు స్టెంటు వేయించుకున్నాడు. పెళ్ళీ, తనకంటూ ఒక కుటుంబం అంటూ ఏమీ ఉన్నట్టు లేదు.
ఒకసారి ఆఫీసులో అన్నాడు, ‘ఈ మధ్య కొంచం తేడాగా ఉంటోంది, మళ్ళీ గుండెకి టెస్టులు చేయించుకోవాలి’ అని. తరవాత టెస్టులకోసం ఒక రోజు సెలవు పెట్టాడు. కానీ ఒక వారంపాటు ఆఫీసుకి రాలేదు. వచ్చాకా ఎలా ఉన్నావని పలకరించాను. బానే ఉన్నాను అన్నాడు. తరవాత మెల్లిగా ‘చాలా అదృష్టం, బతికి బయట పడ్డాను’ అని చెప్పాడు. ఏమైందన్నాను. హాస్పిటల్లో ట్రెడ్ మిల్ టెస్టు చేస్తున్నార్ట. ఉన్నట్టుండి అతను కుప్పకూలిపోయాడట. కాసేపు అతనికి ఏమీ తెలియదు. తరవాత టీవీలో ప్రసారాల్లేకపోతే స్క్రీను మీద చుక్కలు కనిపిస్తాయే, అలా అనిపించిందిట. తరవాత కొద్ది క్షణాలు బొమ్మలు వస్తూ, పోతూ (flicker అవుతూ) కనిపించాయి. ఏమీ అర్థం కాలేదట. తరవాత చుట్టూ డాక్టర్లూ, నర్సులూ మూగిపోయి కనిపించారట. కానీ అంతా బ్లాక్ అండ్ వైట్ లో కనిపించిందిట. ఇంకొన్ని క్షణాలు పోయాకా బొమ్మలు రంగుల్లో కనిపించడం మొదలైందట.
ఇంతకీ ఏం జరిగిందంటే, ట్రెడ్ మిల్ మీద పరిగెడుతూ ఉంటే, అతని గుండె ఆగిపోయింది. డాక్టర్లు పక్కనే ఉన్నారు కాబట్టి వెంటనే షాకులూ గట్రా ఇచ్చి బతికించారు. అలా ఎందుకు జరిగిందో డాక్టర్లు కూడా చెప్పలేకపోయారట. చాలా నీరసంగా ఉండడంతో ఒక వారం రెస్టు తీసుకుని ఆఫీసుకి వచ్చాడు. అతని అనుభవం వింటే చాలా ఆశ్చర్యం వేసింది. కానీ మనిషి చాలా నిబ్బరంగా మామూలుగా ఉన్నాడు. అదే సంఘటన హాస్పిటల్లో కాకుండా ఏ రోడ్డు మీదో జరిగుంటే? తల్చుకుంటే నాకే భయం వేసింది కానీ, అతను మాత్రం పెద్దగా భయపడినట్టో, కదిలిపోయినట్టో అనిపించలేదు. కొన్ని నెలల తరవాత అతనికి మళ్ళా ఇంకో స్టెంటు వేసినట్టు గుర్తు.
ఈ మధ్య టచ్ లో లేను గానీ, అతను చాలా ఆసక్తికరమైన వ్యక్తి. అతను ఒక హాబీగా హోవర్ క్రాప్టుల్ని రిపేర్ చేస్తూ ఉంటాడు. అలాగే రిమోట్ కంట్రోల్ తో నడిచే చిన్న విమానాల్ని కూడా ఎగరేస్తూ ఉంటాడు. ఎప్పుడేనా ఇంటికి రా అవన్నీ చూపిస్తాను అన్నాడు. ఓసారి వీలు చూసుకుని ఎలా ఉన్నాడో ఫోన్ చెయ్యాలి.
అథ వేలా సమాసన్న శైల రంధ్రానునాదినా
స్వరేణోవాచ భగవాన్ పరిభూతార్ణవ ధ్వని: ||
జానే వో రాక్షసాక్రాన్తౌ అనుభావ పరాక్రమౌ
అంగినాం తమసేవోభౌ గుణౌ ప్రథమ మధ్యమౌ ||
పై శ్లోకాలు రఘువంశంలోవి (ప్రస్తుతం నోట్లో ఆడుతున్నవి). ఎందుకో తెలీదు, ఎప్పుడూ ఇలాంటి శ్లోకాలేవో నోట్లో ఆడుతూనే ఉంటాయి - చాలామంది పాటలు హమ్ చేసినట్టుగా.  కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని కొన్ని శ్లోకాలు. చాలా ఏళ్ళుగా ఇంతే. ఒక పెన్ను, కాగితం ఎదురుగుండా ఉంటే, గుర్తొచ్చిన ఏదో ఒక శ్లోకం దానిమీద రాయకుండా ఉండలేను. ఆఫీసులో కూడా.
కొన్నేళ్ళ క్రితం నేను పనిచేసిన తెలుగు బాసు ఒకాయనకి పెద్ద సరదా ఉండేది. నేను ఎప్పుడూ ఆఫీసులో ఎక్కువ మాట్లాడేవాణ్ణి కాను. ప్రతీ వారం టీమంతా పబ్బులకి పోయేవాళ్ళం. అక్కడ ఆరెంజి జ్యూస్ తప్ప ఇంకేమీ ముట్టుకునేవాణ్ణి కాను. అందరూ గోల గోలగా మాట్లాడుతుంటే, ఏదో కొద్దిగా మాత్రమే మాట్లాడేవాణ్ణి. ఇదంతా ఆయన చూశాడు. ఆయనకి నా ఇంట్రస్టులూ, సంగతీ బాగా తెలుసనుకోండి.  అయినా ఓ రోజు నాతో అన్నాడు - ‘మురళీ, నీచేత బాగా తాగించి అప్పుడు నువ్వేం మాట్లాడతావో చూడాలని ఉంది’ అని.  ‘నేను తాగకుండానే నోట్లో సంస్కృతం ఆడుతూ ఉంటుంది, తాగితే నోట్లో ఆడుతున్న శ్లోకాలన్నీ బయటకి వచ్చేస్తాయి, అంతే’ అన్నాను. ఆయన చాలా నవ్వాడు. ‘అయితే నువ్వు తాగితే సంస్కృతం మాట్లాడతావు అన్నమాట’ అన్నాడు. (ఇంతవరకు ఆయనకి నన్ను అలా చూడాలన్న సరదా తీరలేదు అనుకోండి.)
అలాగే ఇంటర్మీడియట్ లెక్కల నోట్సంతా శ్లోకాలే ఉండేవి. ఒకసారి మా ఇంటికి మా నాన్నగారి కొలీగ్ సంస్కృతం లెక్చరర్ గారొకాయన వచ్చారు. నేను ఇంట్లో లేను. ఆయన బల్ల మీద ఉన్న నా లెక్కల నోట్సు మీద మేఘసందేశం శ్లోకాలు చూసి విపరీతంగా సంతోషించార్ట. ఇంటర్మీడియట్ తర్వాత నేను బీఎస్సీ లో చేరాను. అది నాకు చాలా బాడ్ టైము. ఫస్టియర్ పరిక్షలకి చదవలేదు. రాయదల్చుకోలేదు. (సెప్టెంబరుకి రాసి పాసయ్యాను లెండి). అప్పట్లో నాకు కెమిస్ట్రీ అంటే కోపం. కెమిస్ట్రీ పరిక్షకి వెళ్ళాను. పేపరంతా నాకు వచ్చిన శ్లోకాలన్ని ఇంగ్లీషు లిపిలో రాస్తూ కూర్చున్నాను. రెండు, మూడు ఎడిషనల్స్ కూడా తీసుకున్నాను. ఇన్విజిలేటర్ ఎవరంటే, నాకు అంతకు ముందు సంవత్సరం ఇంటర్మీడియట్ లో పాఠాలు చెప్పినాయన. ఇంటర్ లో నేను బ్యాడ్ స్టూడెంటుని కాదు కాబట్టి, మురళీ ఎడిషనల్స్ కూడా తీసుకుని పేపరు ఇరగదీసేస్తున్నాడు కాబోలు అని ఆయన అనుకున్నాడు. నేను మొత్తం పేపరంతా రాసేసి ఆయనకి ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఏం రాశాడో చూద్దామని ఆయన నా పేపరు చూసి మూర్ఛ పోయాడు. మొత్తం ఊళ్ళో అడిగినవాళ్ళకీ, అడగని వాళ్ళకీ పిలిచి మరీ చెప్పాడు. మా అమ్మ పేరంటానికి వెళ్తే అక్కడ కూడా ఒకళ్ళిద్దరు అడిగార్ట, మీవాడు కెమిస్ట్రీ పేపర్లో సంస్కృతం రాశాట్ట కదా అని.
బీఎస్సీ అయిందనిపించాకా ఏం చెయ్యాలి అన్న మీమాంస వచ్చింది. నేను గట్టిగా తెగించి ఎమ్మే సంస్కృతం చేస్తానని నాన్నతో అన్నాను. ఎంసీయే లో సీటు రాకపోతే అలాగే చేద్దువు గాని లే అన్నారు. ఆయన మాత్రం ఏదో విధంగా నన్ను ఎంసీయేలో చేర్చేయాలని ఆలోచిస్తున్నారు. నేను ఎంసీయే ఎంట్రన్సు కోచింగ్ కి వెళ్ళి ఒక్క రోజు కూడా పుస్తకం తియ్యకుండా కాలక్షేపం చేసి, పరిక్ష మాత్రం రాసి ఇంటికి వచ్చేశా. ఆ సమయంలో నేను అనుభవించిన అంతర్మథనం, డిప్రెషన్ గురించి చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకం రాయాలి. అయినా ఆ అంతర్మథనంలో ఒక ‘మొమెంట్ ఆఫ్ క్లారిటీ’ వచ్చింది. ఈ వెధవ ఎంసీయేలో సీటు రాకపోయినా నష్టమేమీ లేదు. ఈ జీవితాన్ని సంస్కృతానికి అంకితం చేసి, పెళ్ళీ పెటాకులూ లేకుండా గడిపేద్దామని ఘట్టిగా నిర్ణయించుకున్నాను. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడని, ఏమీ చదవకపోయినా ఎంసీయేలో ఓమాదిరి రాంకొచ్చేసి, సీటొచ్చేసింది. మళ్ళా సంస్కృతంలో కృషి చెయ్యడానికి అవకాశం చిక్కలేదు. మరి భవిష్యత్తులో ఏమైనా చెయ్యగలనేమో చూడాలి.
ఏమైనా దేవుడితో చాలాకాలం నుంచీ బేరాలాడుతున్నాను. వచ్చే జన్మలోనైనా నన్ను మధ్యతరగతి లో పుట్టించకు, బాగా రిచ్చిగా పుట్టిస్తే, నాకు నచ్చిందేదో నేను చదువుకుంటాను అని.
ఆనాడు విదేశీయులు మన దేశాన్ని బలప్రయోగంతో ఆక్రమించుకుంటే ఇవ్వాళ మన నాయకులే మన దేశాన్ని ఎకరాల చొప్పున వేలం వేస్తున్నారు. మన రాష్ట్రంలో చంద్రబాబుతో మొదలైన ఈ అమ్మకాలు రాజశేఖరరెడ్డి రాకతో విశ్వరూపం దాల్చాయి.
ఒకవైపు ఎపి.ఐ.ఐ.సి, మరో వైపు హుడా, అటుపక్కన హౌసింగ్ బోర్డ్, ఇటుపక్కన డక్కన్ ఇన్-ఫ్రాస్ట్రక్చర్ ... ఈ నాలుగు సంస్థలు కలిసి రాజధాని నగరాన్ని వేలంపాటలు వేసి మరీ విక్రయిస్తుంటే, నగరం నాలుగు మూలలా సమాధి రాళ్లలా పాతిన మెట్రో రైలు బోర్డులు అనేకమంది పౌరులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఇటు చివర ఉన్న నెల్లూరు నుండి మొదలుకొని అటు చివర ఉన్న విజయనగరం వరకూ కోస్తా కారిడార్ పేరిట లక్షల ఎకరాలు సేకరించడానికి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది.
ఇక ప్రత్యేక ఆర్ధిక మండలాలకైతే  లెక్కే లేదు. పుట్టగొడుగుల్లా రోజుకొకటి పుట్టుకువస్తున్న ఈ సెజ్ ల వల్ల భూమిని, ఉపాధినీ పోగొట్టుకున్న అభాగ్యులు లక్షల్లో ఉన్నారు మన రాష్ట్రంలో.
ఇప్పుడు రాష్టంలో జరుగుతున్నది అచ్చంగా భూయజ్ఞమే. ఇందులో సమిధలు అవుతున్నది సామాన్యులే.
అయితే ఈ మొత్తం కథలోనూ గమనించాల్సిన విషయం ప్రభుత్వం భూసేకరణ జరుపుతున్న విధానం. అడ్డగోలుగా రైతుల భూములు లాక్కుంటున్న ప్రభుత్వం వారికి నష్టపరిహారం పేరిట నాలుగు చిల్లర డబ్బులు విసురుతున్నది. ఎమ్మార్వో, ఆర్డీవో మొదలుకొని కలెక్టర్ వరకూ ప్రజలకు మోసపు మాటలు చెప్పి వారి భూములు కాజేసే బ్రోకర్లుగా తయారయ్యారు.
ప్రభుత్వం చేస్తున్న అక్రమ భూసేకరణకు వ్యతిరేకంగా అనేక చోట్ల ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఇటు తెలంగాణలో పోలేపల్లి సెజ్ (http://polepally.wordpress.com) అటు ఆంధ్రలో కాకినాడ సెజ్ కు వ్యతిరేకంగా రైతులు వీరోచిత పోరాటం చేస్తున్నారు.
ఇదివరకు జరిగిన అనేక భూసేకరణల్లో చట్టం గురించీ, తమకు గల హక్కుల గురించీ తెలియని ప్రజలు ఎంతో నష్టపోయారు. ఇకముందైనా అలా జరగొద్దనే సంకల్పంతో మానవ హక్కుల వేదిక (Human Rights Forum - HRF) వారు ఒక చక్కని పుస్తకాన్ని విడుదల చేశారు.
పుస్తకం పీడిఎఫ్ ఫైలు లంకె కింద ఇస్తున్నాం. అవసరమైన రైతులు, ఇతర పౌరులు, ప్రజా సంఘాలు, స్వచ్చంద సంస్థలు, రాజకీయ పార్టీల వారు ఇలా ఎవరైనా దీని కాపీ ప్రింట్ చేసుకోవచ్చు.
నెజ్జనుల కొరకు పుస్తకం పూర్తి పాఠం యూనికోడ్ లో కూడా ఇస్తున్నాం.
దయచేసి ఈ పుస్తకానికి మీ బ్లాగుల, ఈ మెయిల్ ద్వారా విస్తృత ప్రచారం కల్పించాల్సిందిగా నెజ్జనులను కోరుతున్నాం.
పుస్తకం పీడిఎఫ్ ఫైలు ఇక్కడ దిగుమతి చేసుకోండి
పూర్తి పాఠం యూనికోడ్ లో ఇక్కడ చదవండి
'దేవుడిని నమ్ముతావా?' అని ఎవరడిగినా నే చెప్పే మాట 'నేనాస్తికుడిని'. ఎవరికి కావలసిన అర్ధం వాళ్లు తీసుకోగలిగే వెసులుబాటున్న గొప్ప పదమిది. విన్నవారి దృక్కోణాన్ని బట్టి దానర్ధం 'నే నాస్తికుడిని' కావచ్చు, 'నేను ఆస్తికుడిని' అనీ కావచ్చు. ఇంతకీ ఎవరు నేను?
దీనికి సమాధానం నాకూ తెలీదు. నాదో ప్రత్యేకమైన ఫిలాసఫీ. దేవుడనేవాడు లేకుంటే మనం ఎన్ని కోరికలు కోరినా ప్రయోజనమేముంది? ఒకవేళ దేవుడుంటే గింటే - మతాలన్నీ చెప్పేలా ఆయన విశ్వాంతర్యామే అయితే, 'అంతా ఈశ్వరేఛ్చ' టైపులో లోకంలోని చీమలన్నీ ఆయన ఆజ్ఞ ప్రకారమే కుడుతుంటే - ఎవరికి ఎప్పుడు ఏం కావాలో తెలిసిన పెద్దాయనకి నాకు ఫలానాది కావాలి అని అర్జీలు పెట్టుకోవాల్సిన అవసరమేముంది? కాబట్టి, దేవుడున్నా లేకున్నా ఆయనకి పూజలు చేయాల్సిన పనిలేదు. పూజలతో పని లేనప్పుడు ఏ దేవుడు, ఏ మతస్తుడు లాంటి ప్రశ్నలూ రావు. ఏతా వాతా, అసలు దేవుడున్నాడా లేదా అన్న సందేహమే నాకు లేదు. నావరకూ ఆయనున్నా లేకున్నా తేడా లేదు.
దేవుడితో పని లేదన్నంత మాత్రాన నేను నాస్తికుడిని కాను. అలాగని ఆస్తికుడినీ కాను. నాలా అటూ ఇటూ కాని వాళ్లనేమంటారో తెలీదు. ఏ మతాన్నీ ఆచరించను కానీ అన్ని మతాలూ గొప్పవేననే నమ్మకం నాది. అదే సమయంలో మతాల పేరిట దేవుడిని ఆర్గనైజ్ చెయ్యటం తప్పనే అభిప్రాయమూ నాదే. ఈ భూమ్మీది మతాలూ, వాటినేలే సంస్థలూ మాఫియా కన్నా భయంకరమైనవని నేననుకుంటాను. కానీ అటువంటి సంస్థలే వివిధ సమాజాల వృద్ధికీ పాటు పడ్డాయన్న తెలివిడి కూడా నాకుంది. బైబిల్, గీత, ఖురాన్ అన్నీ చదివా. గుళ్లూ గోపురాలూ, దర్గాలూ మసీదులూ, చర్చ్‌లూ చాపెళ్లూ, గురుద్వారాలూ సినగోగులూ.... కనబడ్డ ఆరాధనా స్థలాలన్నిట్లోనూ అడుగు పెడతా - అయినా ఏ దేవుడికీ మొక్కను. గుడికెళ్లటం ఆస్తికత్వమా, భక్తి నాస్తి అయితే నాస్తికత్వమా? ఆస్తికులకీ, నాస్తికులకీ ఉన్నట్లు నాలాంటి అయోమయపు జగన్నాధాలకీ సంఘాలేవైనా ఉన్నాయా?
'సైన్సే సత్యం. దేవుడు మిధ్య. ఎక్కడున్నాడో చూపించు' అని శాస్త్రీయ సవాళ్లు చేసే హేతువాదులూ, 'ఆకలి దప్పికల్ని చూపించగలవా? అవి ఉన్నట్లే దేవుడూ ఉన్నాడు' అనే వేదాంతభరిత వితండవాదులూ ఇద్దరూ శాస్త్రానికి కొనసాగింపే వేదాంతం అన్న చిన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతారో నాకెప్పుడూ అంతుపట్టదు. వేదాంతం స్థూలంగా చెప్పే విశ్వ రహస్యాల్నే సైన్స్ సూక్ష స్థాయిలో వివరిస్తుందనీ, అవి రెండూ ఒకే నాణానికి రెండు వైపులని వీళ్లెందుకు గ్రహించరు? ఇలా మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ నాకెదురయిన ప్రశ్న ఒకటే: 'ఇంతకీ నువ్వు దేవుడిని నమ్ముతావా, లేదా'. దీనికి నా సమాధానం మీకు తెలిసిందే.
ఆ మధ్య ఒకానొక సాహితీ సదస్సులో ఓ మహానుభావుడు పరిచయమయ్యాడు. తనను తానో కరడుగట్టిన హేతువాదిగా అభివర్ణించుకున్న ఈ పెద్దమనిషి పోకడ నాకు చాలా సిల్లీగా అనిపించింది. సభాకార్యక్రమాలు ప్రారంభం కావటానికి ఇంకా సమయముండటంతో మేమిద్దరం వెనక వరసలో కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ఆ సభలో ఆయనది కూడా హేతువాదమ్మీద ఓ లెక్చరుందట. అప్పటి దాకా నా పక్కన కూర్చుని బాతాఖానీ వేస్తున్న హేతువాదిగారు 'ఇప్పుడు ప్రముఖ రచయిత్రి శ్రీమతి సుబ్బాయమ్మ గారు జ్యోతి ప్రజ్వలన చేస్తారు' అన్న ప్రకటన వినపడగానే చివ్వున లేచి ఏదో పనున్నట్లు హడావిడిగా బయటికెళ్లిపోయారు. ప్ర.ర.శ్రీ.సుబ్బాయమ్మగారు దీపమంటించిన ఐదు నిమిషాలకి గానీ ఆయన మళ్లీ లోపలకి అడుగుపెట్టలేదు. మళ్లీ నాతో బాతాఖానీ షురూ. కార్యక్రమాల వరసలో మూడోది 'వేద పఠనం'. ఇది మొదలవబోయే ప్రకటన వినగానే హేతువాదిగారు మళ్లీ బయటికి లగెత్తారు. వేద పఠనం అయిపోయాక తిరిగొచ్చారు. ఈ తంతు చూసి విస్తుపోతూ నేను 'అదేమిటండీ' అంటే ఆయన 'ఇలాంటివి నేను ఛస్తే చూడనండీ' అంటూ ఓ పోజిచ్చారు. ఇదో రకం చాదస్తం. హేతువాదమంటే పిడివాదమనుకునే ఇలాంటివాళ్ల వల్ల దానికి వస్తున్న చెడ్డపేరు అంతాఇంతా కాదు. ఆ సంగతి ఆయనకి సున్నితంగా చెప్పబోతే చిరాగ్గా చూసి నన్నో ప్రశ్న అడిగాడాయన. ఆ ప్రశ్నా, దానికి నా సమాధానమూ రెండూ మీకాల్రెడీ తెలుసు.
ఈ మధ్య అనుకోకుండా జీ-టీవీ లో రెండు మూడు జీడిపాకం సీరియళ్లు చూడాల్సిన అవసరం పడింది (ఎవరి వత్తిడితోనో చెప్పుకోండి చూద్దాం). లేని కధ గురించి చెప్పుకోటానికేమీ లేదుగానీ, ఈ సీరియళ్లలో నన్నాకర్షించినవి కొన్ని పాత్రల పేర్లు. ఇంత వింత పేర్లు నిజ జీవితంలో ఎక్కడా వినుండలేదు నేను. వాటిలో మచ్చుకు కొన్ని: జిగ్యాస, దక్ష్, నహర్, కాళిక, శుభ్ర, నర్పత్, క్షితిజ్, భవిష్య్, రసిక్.
ఇలాంటి పేర్లు పెట్టే ఆలోచన రచయితలకెలా వస్తుందో కానీ కొన్నిసార్లు ఆ పేర్లకి అర్ధం కూడా తెలుసుకోకుండా పెట్టేస్తారేమో అనిపిస్తుంది. ఇవి ఇంకా నయం. కేవలం సీరియళ్లలో పాత్రల పేర్లు మాత్రమే ఇవన్నీ. తమిళనాట దర్శక శిఖామణులు తాము పరిచయం చేసే నటీమణుల తెరనామధేయాలు ఎంత ఘోరంగా పెడతారో చూడండి: రసిక (ఈమె సంగీత గా తెలుగు సినిమాల్లో ప్రసిద్ధురాలు), రహస్య (ఒక్కడున్నాడు లాంటి ఒకటి రెండు తెలుగు చిత్రాల్లోనూ కనిపించిన ఐటం డాన్సర్), విచిత్ర (మరో ఐటం డాన్సర్) .... రేపో మాపో అసహ్య, రక్కసి, కురూప లాంటి పేర్లూ పెట్టేస్తారేమో!
పేర్ల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి తెలుగు వాళ్ల చాంతాడు పేర్లపై చలామణిలో ఉన్న జోకొకటి చెబుతాను. పాతది కాబట్టి మీరిప్పటికే వినుండొచ్చు.
ఓ సారి జేమ్స్ బాండ్ విమానంలో ప్రయాణిస్తూ పక్క సీట్లో ఉన్న తెలుగు కుర్రాడితో మాటలు కలిపాడు. కరచాలనం కోసం చేతిని ముందుకు చాపుతూ అలవాటు ప్రకారం ఇలా పరిచయం చేసుకున్నాడు:
'My name is Bond, James Bond'.
ఇక మన తెలుగబ్బాయి మొదలెట్టాడు.
'Nice to meet you. My name is Lakshman, Sai Lakshman, Venkata Sai Lakshman, Veera Venkata Sai Lakshman, Vangivarapu Veera Venkata Sai Lakshman, Vundraju Vangiva.... '
పాపం, మొట్టమొదటిసారిగా 007 మరొకడి దెబ్బకి కళ్లు తేలేశాడు.
నిజంగా ఇంత పొడుగు పేర్లుంటాయా తెలుగు వాళ్లకి అని నా పరభాషా మిత్రుల సందేహం. తెలుగు వాళ్లలోనూ కొంతమంది ఈ విషయాన్ని నమ్మకపోవచ్చు. నా మిత్రుల్లో కొందరికి ఇలాంటి పొడుగాటి పేర్లున్నాయి. వాటిలో మచ్చుకి రెండు.
నేను ఎలిమెంటరీ స్కూల్లో చదివే రోజుల్లో నా సహ విద్యార్ధి పేరిది: కొమ్మిరెడ్డి వెంకట రామ నాగేంద్ర కోటి రెడ్డి. అప్పట్లో నాకు తెలిసిన అతి పొడుగు పేరదే. వాడు కూడా ఆ పేరు చూసుకుని విర్రవీగుతుండేవాడు - తనని మించిన మొనగాడు స్కూల్లోనే లేడని. ఐతే మేం హైస్కూల్లోకొచ్చేసరికి వాడి ఇగోకి భీకరమైన దెబ్బ తగిలింది. ఆరో క్లాసులో పక్క ఊర్నుంచి వేరే కుర్రాడొచ్చి మా క్లాసులో చేరాడు. వీడి పేరు - కాస్త ఊపిరి బిగపట్టి చదవాలి మీరు:
గ్రంధి వెంకట లక్ష్మీ నరసింహ శివ రామ కృష్ణ కోటి సూర్య సుధాకర సుబ్రహ్మణ్య ఆంజనేయ దేవీ పద్మ ప్రసాద చిరంజీవి అజయ్ బాబు
ఇదేదో నేను కల్పించిన పేరు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఈ పేరుగల వ్యక్తి నిఝ్ఝంగా ఉన్నాడు. రికార్డుల్లో మాత్రం ఇతని పేరు పట్టక 'జి. అజయ్ బాబు' అని కుదించేశారు. ఇతనికి ఒక తమ్ముడు, ఒక అన్న ఉన్నారు. వాళ్లిద్దరికీ మిగతా తోకంతా ఉంటుంది - తేడా అల్లా 'అజయ్ బాబు' బదులు ఒకతను 'విజయ్ బాబు' మరొకడు 'సుజిత్ బాబు'. 'ఉరేయ్, ఎందుకురా మీకింత పొడుగు పేర్లెట్టారు' అంటే 'మాది చాలా పెద్ద ఫ్యామిలీ. చుట్టాలంతా ఎవరికి తోచిన పేరు వాళ్లు చెబితే అవన్నీ కలిపి మాకెట్టేశార్రా' అనేవాడు దిగులుగా. పాపం, కొ.వెం.రా.నా.కో.రెడ్డిలా పేరు పొడుగు చూసుకుని మిడిసిపడే రకం కాదు వీడు. హైస్కూలు చదువుల తర్వాత తలో దారిన వెళ్లటంతో ఇప్పుడెక్కడున్నారో తెలియదు వీళ్లిద్దరూ.
ప్రచారసభ వాళ్ళ పరిక్షల్లో ఒకదానిలో లెటర్ రైటింగ్ ఉండేది. వార్తాపత్రిక ఎడిటర్ కి లెటర్ రాయమనో, హాస్టల్లో ఉండి చదువుకుంటూ నాన్నకి డబ్బు పంపమని రాయమనో పాఠాలు ఉండేవి. నేనోసారి ఇంట్లో పోస్టు కార్డు తీసుకొచ్చి, దానిమీద నాన్నకి డబ్బు పంపమని ఉత్తరం హిందీలో రాసేసి పోస్టు చేసేశా. మర్నాడు ఆయన పోస్టు తీసుకుని, హిందీలో కార్డు వచ్చిందేమిటా, నార్తు నుంచి మనకి ఎవరు రాస్తారబ్బా అని ఆశ్చర్యపడుతూ కూడబలుక్కుని ఆ ఉత్తరం చదువుకున్నారు. నేను ఒకటే నవ్వు. విషయం అర్థమయ్యాకా ఆయన నవ్వుకుంటూనే నన్ను కూకలేశారు. ఈ సంగతి తరవాత మా హిందీ టీచరు గారికి కూడా తెలిసి చాలా సంతోషించారు.
నేను మెల్లిమెల్లిగా ఒక్కో పరిక్షా పాసైపోవడం మొదలుపెట్టాను. ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్రభాష, ప్రవేశిక కూడా అయిపోయింది. అన్నీ అత్తెసరు మార్కులే. ఏదో ముక్కునపట్టి రాసెయ్యడమే. మరీ అధ్వాన్నంగా ఇంత తక్కువ మార్కుల్తో పాసవ్వడమేమిటి అని మా టీచరు గారు అడిగేవారు కాదు. పాపం చిన్నపిల్లాడు, క్లాసు పాఠాల్తో బిజీగా ఉండి కూడా ఈ పరిక్షలు పాసవుతున్నాడు, పోనీలే అని వదిలేసేవారు.
మా నాన్నగారి కొలీగ్సు కొంతమందికి నన్ను చూస్తే సరదాగా ఉండేది. నేను హిందీ ట్యూషన్ కి వెడుతూ దారిలో కనిపిస్తే నవ్వుతూ వచ్చీ రాని హిందీలో పలకరించేవారు. ఒకసారి ఒకాయన సాయంత్రం మా ఇంటికి వచ్చారు. కరెంటు పోయింది. కొవ్వొత్తులు పెట్టుకుని అందరం కబుర్లు చెప్పుకుంటున్నాం. ఆయన జోకులేస్తూ నన్ను హిందీలో మాట్లాడమన్నారు. నేను నదురూ బెదురూ లేకుండా కన్యాశుల్కంలో వెంకటేశంలా నా నోటికొచ్చిన హిందీ ముక్కలన్నీ వాగేశా. అప్పుడాయన, ‘ఒరే, నేను ఎప్పుడైనా ఉత్తరాదికి వెళ్ళాననుకో. అర్జెంటుగా ఒకటికి వచ్చిందనుకో. ఎక్కడికి వెళ్ళాలో ఏమని అడగాల్రా?’ అని అడిగారు. నేను తడుముకోకుండా ‘మూత్ర విసర్జన్ కే లియే కహా జానా హై?’ అని అడగాలండీ అని చెప్పేశా. ఆయన ఘొల్లుమని ఒకటే నవ్వు. ‘మరీ అంత గ్రాంథికంలో మాట్లాడితే ఎలాగరా?’ అన్నారు.
ప్రతీ ఆర్నెల్లకీ ఒక్కో పరిక్ష పాసవుతూ విశారద పూర్వార్థ, ఉత్తరార్థ కూడా పూర్తి చేసేశా. విశారద పూర్తయితే సర్టిఫికెట్టుతో పాటూ ఒక శాలువా కూడా పంపారు ప్రచారసభ వాళ్ళు. అప్పటికి నేనింకా తొమ్మిదోక్లాసు మొదట్లో ఉన్నాను. విశారద పాఠాలూ గట్రా చూస్తే చాలా ఎక్కువ స్టాండర్డ్ లోనే ఉండేవి. తులసీ రామాయణంలో భాగాలు, పాత నాటకాలు, కవిత్వాలు, సాహిత్య చరిత్ర, నవల్లు గట్రా గట్రా అన్నీ ఎలా మానేజ్ చేసి పాసయ్యానో తల్చుకుంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అత్తెసరు మార్కులు తెచ్చుకోడానికి ఏవో కొన్ని వ్యాసాలు మాత్రం ముక్కున పెట్టేసి రాసేసేవాణ్ణి.
నాకున్న కాస్త హిందీ జ్ఞానం పుణ్యమా అని రామాయణ్, మహాభారత్ ఇంకా కొన్ని హిందీ సీరియల్సూ చాలామటుకు అర్థం చేసుకుంటూనే చూసేవాణ్ణి. వాటిల్లో డైలాగులు మా క్లాసులో ఫ్రెండ్సు దగ్గర చెప్తూ ఉండేవాణ్ణి.
తొమ్మిదో క్లాసుకొచ్చాకా ప్రవీణ్ పరిక్షకి పాఠాలు మొదలయ్యాయి. ఇది కూడా రెండు భాగాలు- పూర్వార్థ, ఉత్తరార్థ అని. పూర్వార్థ లో పాఠాలు బీయే స్టాండర్డ్ లో ఉండేవి. ఏవేవో వ్యాసాలు, సాహిత్య చరిత్రా గట్రా, గట్రా. అవన్నీ బోరుకొట్టి చిరాకు పుట్టింది. పదోక్లాసులో హిందీ పరిక్షలు రాయద్దు అని మా టీచరుగారూ, ఇంట్లోవాళ్ళు కూడా డిసైడ్ చేసేశారు. మా టీచరు గారి ఉద్దేశ్యమేమిటంటే, తొమ్మిదో క్లాసు పూర్తయ్యి, పదికి వచ్చేసరికి ప్రవీణ్ పూర్తి చేయించేస్తే, మెల్లిగా ఏ ఇంటరో అయ్యాకా సాహిత్యరత్న పరిక్షకి కట్టిద్దామని. దానితరవాత పండిట్ ట్రైనింగైపోయి టీచరుగా సెటిలైపోవచ్చు.
నాకు మాత్రం ప్రవీణ్ పరిక్షకి పూర్తిగా విసుగొచ్చేసింది. ఈసారి ఎలాగైనా సరే ఫెయిలైపోవాలని నిశ్చయించుకున్నాను. కానీ రెండు ఆటంకాలు ఉన్నాయి. మరీ అధ్వాన్నంగా అన్ని పేపర్లలోనూ ఫెయిలైతే పరువు తక్కువ. అదొక్కటే కాదు, మా పక్క వీధిలో, వేరే కాన్వెంట్లో నా క్లాసే చదువుతున్న ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి వేరే టిచరుగారి దగ్గర హిందీ ట్యూషన్ కి వెడుతూ నాతో సమానంగా పరిక్షలు రాసి పాసైపోతూ ఉండేది. ఆ అమ్మాయి కూడా నాతోపాటు ప్రవీణ్ పూర్వార్థ పరిక్ష రాస్తోంది. నేను ఫెయిలయ్యి, ఆ అమ్మాయి పాసైతే మనకి ఇంకా పరువు తక్కువ. ఎలాగరా భగవంతుడా అనుకున్నాను. నా అదృష్టం పండి, సరిగ్గా పరిక్షల సమయంలో ఆ అమ్మాయికి ఏదో ఫంక్షనై పరిక్షలు రాయలేదు. నేను మనసులోనే ఎగిరి గంతేశాను. ‘భగవంతుడా, అన్ని పేపర్లూ పాసై, ఒక్క పేపర్లో మాత్రం కొద్ది మార్కుల తేడాతో ఫెయిలైపోయేలా చెయ్యి’ అని గట్టిగా దణ్ణం పెట్టుకుని యథాశక్తి అలాగే ఫెయిలయ్యే విధంగా పరిక్షలు రాశాను.
రిజల్టు చూస్తే ఏముంది? అన్ని పేపర్లూ పాస్. ఒక్క కష్టమైన పేపర్లో మాత్రం నాలుగైదు మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్. నేను మహా ఆనందించాను, గొడవ వదిలింది అని. రిజల్టు తెలిశాకా మా టీచరు గారి రియాక్షన్ ఇప్పటికీ నాకు గుర్తే. పాపం చాలా బాధ పడ్డారు. ‘అయ్యో, చాలా కొద్దిలో పోయిందే’ అని చాలా సార్లు అన్నారు. ఇప్పటికీ ఆ సందర్భంలో ఆవిడ పడిన బాధ తల్చుకుంటే మనసు కలుక్కుమంటుంది.
తరవాత మళ్ళీ ఎప్పుడూ హిందీ జోలికి పోలేదు. టెన్తు పాసయ్యాకా, ఇంటర్లో మా నాన్న హిందీ తీసుకోమని అన్నారు. నేను మొదట హిందీకి అప్లై చేసినా, మార్కులు బాగా వస్తాయి అని స్నేహితులు చెప్పడంతో వెంఠనే సంస్కృతానికి మారిపోయా. నా జీవితంలో నేను చేసిన ఉత్తమోత్తమమైన పనుల్లో అది ఒకటి. సంస్కృతం లెక్చరరు గారు పాఠం చాలా చాదస్తంగా ప్రతీ పదానికీ విశేషాలన్నీ విడమర్చి పాఠం చెప్పేవారు. దానితో అంతకు ముందు ఒక్క ముక్క పరిచయం లేకపోయినా నాకు సంస్కృతం ఆరోప్రాణమై కూర్చుంది. అందులో పెద్ద సాధించిందేమీ లేదుగానీ, అప్పుడు చదువుకున్న నాలుగు ముక్కలకీ, ఇప్పటికి కూడా అపారమైన ఆత్మ సంతృప్తీ, ఆనందమూ మాత్రం మిగిలినై.
ఇంటర్లో నాకు ఒకతను (వేరే ఊరినుంచి వచ్చాడు లెండి) పరిచయమయ్యాడు. వాడు హిందీ తీసుకున్నాడు. వాడిక్కూడా నాలాగే మిడి మిడి జ్ఞానమేగానీ పండితుళ్ళా కనపడేవాడు కాదు. ఓసారి వాడితో మాటల సందర్భంలో హిందీ పరిక్షల గురించి వచ్చింది. విషయం తెలిసి షాకయ్యాను. వాడు టెన్తు క్లాసులోనే సాహిత్యరత్న పాసయ్యాడట. వాడి ఫొటో పేపర్లో వేశార్ట. ఆ పేపర్ కటింగ్ కూడా తీసుకొచ్చి నాకు చూపించాడు. అన్ని పరిక్షలు ఎలా పాసయ్యావురా, అని అడిగాను. ‘పాసయ్యాం, బాబూ. ఎలా అని అడక్కు. ఏదో ముక్కునపెట్టి రాసేశాం, పాసైపోయాం, అంతే,’ అన్నాడు. అప్పుడనిపించింది, నేను సాహిత్యరత్న పాసైనా వీడి లెవెల్లోనే ఉండేవాణ్ణి అన్నమాట అని.
తరవాత పై చదువులకి హైదరాబాదు వచ్చాకా తెలిసింది, మనకి తెలిసిన హిందీ బయట ప్రపంచంలో చిల్లిగవ్వకి మారదు అని. నేను మాట్లాడితే మా ఫ్రెండ్సంతా పగలబడి నవ్వేవారు. క్షణక్షణం సినిమాలో శ్రీదేవి ఆటోవాలాతో ‘యే బహుత్ అన్యాయ్ హై’ అంటుంది. అలాగే ఉండేది నా హిందీ కూడా. దానితో మన హిందీకి కొంత కామెడీ వేల్యూ ఉంది అని అర్థమయ్యింది. అప్పట్నించీ ఎప్పుడేనా కామెడీ కోసం మాట్లాడ్డమే తప్ప హిందీ జోలికే పోను. అసలు నాకు ఆ భాష మీద ఆసక్తే లేకపోవడం వల్ల కనీసం నేర్చుకున్నది కొద్దిగా ఇంప్రువ్ చేసుకుందాం అని కూడా అనిపించదు. ఈమధ్య ఏదో టపాకి కామెంట్లు చూస్తూ రానారే గారు అన్న మాటలు చూశాను. ఆయనలాగే నాకు కూడా చిన్నతనంలో కొంచం బలవంతంగా రుద్దబడింది కాబట్టి ఇప్పటికీ ఆ భాషమీద కోపం పోలేదు.
మా ఆవిడ ఇలాంటి బాధలేమీ పడకుండానే కేవలం టీవీ చూసి హిందీ చక్కగా నేర్చుకుంది. తనకి హిందీ సినిమాలన్నా, సీరియల్సన్నా ఇష్టం. ఎప్పుడేనా బోరు కొట్టినప్పుడు కాస్త కామెడీకోసం నన్ను హిందీలో మాట్లాడమంటూ ఉంటుంది. నేను మాట్లాడుతుంటే తెగ నవ్వుతుంది. ఓసారి తను ఒక్కతీ ఇండియాకి వెళ్తోంది. బొంబాయిలో దిగి ఫ్లయిటు మారాలి. అక్కడ లగేజీకి ఎవర్నైనా హెల్పు అడగాలి అంటే ఏమని అడగను అంది, నేనేమంటానో చూద్దామని. ‘భాయీ సాబ్, భాయీ సాబ్, థోడా సహాయ్ కరో’ అని అడుగు అని చెప్పాను.
(అయిపోయింది)
ఆ హిందీ టీచరు గారికి మా అమ్మమ్మ వయసు ఉంటుంది. మా అమ్మమ్మకి ఆవిడ స్నేహితురాలు కూడా. హిందీ పండిట్ గా పని చేసి రిటైరయ్యారు. చాలా మంచావిడ. పిల్లల్ని చాలా ప్రేమగా చూసేవారు. ఆవిడ దగ్గరకి ఏడెనిమిదేళ్ళ పిల్లల దగ్గరనించీ నడివయస్కులదాకా అందరూ హిందీ నేర్చుకోడానికి వచ్చేవారు. ఎక్కువమంది మాత్రం హైస్కూలు పిల్లలు. ఆవిడ పిల్లలకి చాలా చనువు ఇచ్చేవారు. పాఠాల విషయంలో పెద్ద స్ట్రిక్టుగా, పద్ధతిగా ఉండేవారు కాదు. అదే నాకు అపకారం చేసింది.
ఆవిడని కూడా మా అమ్మమ్మలాగే ట్రీట్ చేసేవాడిని. ఆవిడ ఏదో చెప్తూ ఉండేవారు. నా కాలక్షేపం నేను చేసేస్తూ ఉండేవాడిని. ఎందుకో నాకు హిందీ మీద పెద్దగా ఆసక్తి కలగలేదు. అలా అని విముఖతా కలగలేదు. తేలికైన భాష, ఇదెంతలే అన్న భావమే ఉండేది. నేను ఊరికెనే కాలక్షేపం ఎక్కువ చేస్తున్నాను, దీనిమీద సరైన ఆసక్తి లేకుండా ఇలా రోజూ ఓ గంట వృధా చేసుకునే కంటే, ఏ ఆటలో ఆడుకుంటే ఉత్తమం అని ఆలోచించలేకపోయాను. అంత ఆలోచనకి అప్పటి నా వయసు చాలదు.
కొన్నేళ్ళ క్రితం లండన్ లో భారతీయ విద్యాభవన్ కి వెళ్ళి కొంత కాలం వేణువు నేర్చుకున్నాను. ప్రతీ ఆదివారం క్లాసు. చాలా చిన్న పిల్లలు కూడా క్లాసుకి వచ్చేవారు. అందులో ఒక తమిళుల కుర్రాడు. చాలా చిన్నవాడు. ఎనిమిది, తొమ్మిది సంవత్సరాల వయస్సు ఉంటుంది. వాణ్ణి చూస్తే, సరిగ్గా చిన్నప్పుడు నేను హిందీ ట్యూషన్ కి వెళ్ళడమే గుర్తు వచ్చేది. వాడికి నేర్చుకునేదాని మీద ఏమీ ఆసక్తి ఉన్నట్టు కనిపించదు. వాళ్ళ అమ్మా, నాన్నా పంపిస్తున్నారు కాబట్టి క్లాసుకి వచ్చేవాడు. మేష్టరు ఏదో చెప్పేవాడు. వాడు ఏదో వాయించేవాడు. సరిగ్గా వాయించు, హన్నా అంటే వెంటనే ఏడిచేవాడు. చాలా సేపు అలా కుమిలి, కుమిలి ఏడుస్తూనే ఉండేవాడు. తరవాత కాలక్షేపం చేసి వెళ్ళిపోయేవాడు. (నేను హిందీ ట్యూషన్ లో ఎప్పుడూ ఏడిచేవాణ్ణి కాదు లెండి). వాడికి చాలా బోరు కొడుతోంది అని మొహం చూస్తే తెలిసిపోయేది. నాకెంతో జాలి వేసేది. ఈ మధ్య విచారిస్తే ఆ కుర్రాడు చాలా ఇంప్రువ్ అయ్యాడని తెలిసింది. చిన్నప్పుడు కష్టపడినా, పెద్దయ్యాకా హాయిగా వేణువు వాయించుకుంటూ ఉంటే తప్పకుండా ఆ కుర్రవాడు చిన్నప్పుడు నేర్చుకున్నందుకు చాలా సంతోషిస్తాడని నాకు అనిపించింది. ఎటొచ్చీ చిన్నప్పుడు హిందీ వెలగబెట్టినా అందుకు సంతోషించే ఘడియలు నాకు మాత్రం ఇంతవరకూ రాలేదు.
కుంచం నిలువుగా కొలవడానికి లేకపోతే అడ్డంగా కొలిచినా కొన్ని గింజలు వస్తాయని సామెత. అదే విధంగా దృష్టి పెట్టి నేర్చుకోపోయినా హిందీ ముక్కలు నాకు బానే వంటపట్టేవి. మై ఆతా హూ, మై జాతా హూ అంటూ ఉండేవాడిని. ఏకాదశీ అచ్చా హై, ద్వాదశి బురా హై అని కూడా అనేవాణ్ణి. ప్రాథమిక పాఠాలు అన్నీ అయిపోయి మెల్లిగా భాష పాకంలో పడ్డం మొదలెట్టింది. గ్రామరంతా ఈ చెవిలో విని, ఆ చెవిలోంచి వదిలేసేవాణ్ణి. కథలూ గట్రా మాత్రం ఆసక్తిగా చదివేవాణ్ణి. సూఖే సంతరే, టోకరే కీ గవాహీ, గంగారామ్ కీ కహానీ, లగీ మిఠాయీ కడువా ఉన్ కో (ఇది ప్రచార సభ వాళ్ళ పాఠాల్లోది కాదు) ఇలాంటి కథలు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి. దోహాలు గట్రా చదివేవాణ్ణి. సుఖ్ మే సుమరిన్ సబ్ కరై, దుఖ్ మే కరై న కోయి ఇలాంటి దోహాలు కూడా ఒకటో రెండో ఇంకా గుర్తు ఉన్నాయి.
ఏదైనా ఒక ట్యూషన్ కో, స్కూలుకో వెళ్ళడం వల్ల అన్నిటికన్నా గొప్ప ప్రయోజనం ఏమిటంటే రకరకాల జనాల్తో సోషలైజ్ అవ్వడం. నాకన్నా పెద్ద కుర్రాళ్ళతో సరదాగా స్నేహాలయ్యేవి. వాళ్ళ దగ్గర బేవకూఫ్, కంబఖ్త్, మొదలైన పదాలు తెలిసేవి. ఇంకో పెద్ద బూతు మాట కూడా తెలిసింది, కానీ అర్థం మాకెవ్వరికీ తెలియదు. ఓసారి ఏమైందంటే, మా టీచరు గారు అరుగుమీద నిలబడి ఉన్నారు. ఎవరో సర్దార్జీ వచ్చి ‘అమ్మాజీ, కైసే హై’ అంటూ ఏదో మాట్లాడుతున్నాడు. ఈవిడ కూడా ఏదో చెప్పి లోపలికి వెళ్ళారు. అతనికి ఏదో ఇవ్వాలి కాబోలు. అతను బయట వెయిట్ చేస్తున్నాడు. అరుగు మీదకొచ్చి కిటికీలోంచి మమ్మల్ని పలకరించాడు. అప్పుడు లోపల నేను, పెద్ద కుర్రాడింకోడు మాత్రమే ఉన్నాము. ఆ సర్దార్జీ దగ్గర మా హిందీ పాండిత్యం ప్రదర్శిద్దామని మేము ఉత్సాహపడిపోయాం. నా ఫ్రెండు సర్దార్జీకి నన్ను చూపిస్తూ ‘యే బేవకూఫ్ హై’ అన్నాడు. నేను ఊరుకుంటానా, ‘యే -- హై’ అన్నాను - అర్థం తెలీకపోయినా నాకు తెలిసిన అతి పెద్ద బూతు మాటని ఉపయోగించి. సర్దార్జీ కంగారు పడిపోయి ‘తప్పు, బాబూ, తప్పు. బూతు మాటా మాటాడకూడదు’ అని తెలుగులో చెప్పాడు. ఈలోగా మా టీచరుగారు లోపలినించి రావడం, మేము గప్ చుప్ గా కూర్చోడం జరిగిపోయింది.
మా నాన్న తెలుగు లెక్చరరు కావడంతో నేను చిన్నప్పటినుంచే పెద్దయ్యాకా తెలుగు టీచరవ్వాలని కలలు కంటూ ఉండేవాణ్ణి. తెలుగు పద్యాలు గట్రా ఇష్టపడుతూ ఉండేవాణ్ణి. మా నాన్నగారి సహోద్యోగులు కొంతమంది వాళ్ళ పిల్లల్ని కాన్వెంటులకే పంపుతున్నా, ఆయనకి కాన్వెంటు చదువులు ఇష్టం ఉండకపోవడంచేత నన్ను మునిసిపల్ స్కూల్లో తెలుగు మీడియంలో పడేశారు. అక్కడ అయిదో క్లాసు వచ్చేంతవరకూ ఏబీసీడీలు కూడా చెప్పరు. నేను రెండో క్లాసుకి వచ్చాక మా అమ్మా, నాన్నా నన్ను కూచోబెట్టి నాచేత ఏబీసీడీలు దిద్దించడానికి  బ్రహ్మ ప్రయత్నం చేశారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు అంత చిన్నతనంలో కూడా నాకు ఊరంత తిక్క ఉండేది. చచ్చినా దిద్దేవాణ్ణి కాదు. మా అన్న కూడా తనవంతు ప్రయత్నం చేసేవాడు. ఇంగ్లీషు పాఠాల పుస్తకం తీసి ‘వాటీజ్ దిస్’ అంటే నేను ‘వంకాయ పుల్స్’ అనేవాణ్ణి. విసుగొచ్చి మా అమ్మా, నాన్నా ‘వీడు దుంపల బళ్ళో ఏకోపాధ్యాయుడు కావల్సిందే, వెధవ’ అని తిట్టుకునేవారు.
ఇంగ్లీషు నేర్చుకోడానికి నేను మరీ మొండికెత్తడం చూసి మా అమ్మ బెంగ పెట్టేసుకుంది. కానీ ఆవిడకి నా పల్సు బాగా తెలుసు. మంచి టీచరెవరైనా దొరికి, వాళ్ళు ‘అమ్మా, బాబూ, మా బంగారు తండ్రి కదూ’ అంటూ పాఠం చెప్తే మాత్రం నేను చక్కగా చదివేసేవాణ్ణి. అది కూడా మరీ అలుసు ఇస్తే మాత్రం పని జరిగేది కాదు. ఇంట్లో అలుసు ఎక్కువైపోయేగదా మొండికెత్తేసింది! టీచరు భయంలో పెట్టాలి. కానీ మెచ్చుకుంటూ ఉండాలి. అప్పుడే మనం చదువుతాం. అందులోనూ చిన్నప్పుడు ఆడ టీచర్లంటే మరీ బుద్ధిగా చదివేవాణ్ణిట. (చెప్పుకుంటే సిగ్గుచేటు.) అంచేత ఈ లక్షణాలన్నీ ఉన్న ఇంగ్లీషు టీచరు కోసం మా అమ్మ వెతకడం మొదలు పెట్టింది. ఆవిడ అదృష్టం పండి నేను మూడో క్లాసుకి రాంగానే మా పక్కవీధిలో ఇంకో లెక్చరరు గారింట్లో ఒకావిడ చాలామంది పిల్లలకి పాఠాలు చెప్తోందని తెలిసింది. ఆవిడ కాన్వెంటు టీచరు. ఆవిడ దగ్గరకి వెళ్ళే పిల్లలు కూడా ఎక్కువమంది కాన్వెంటు పిల్లలే. వాళ్ళలో నా స్నేహితులు, అంటే మా నాన్నగారి సహోద్యోగుల పిల్లలు కూడా ఉన్నారు. అంచేత గొడవచెయ్యకుండానే శ్రద్ధగా ఆవిడ దగ్గరకి వెళ్ళేవాణ్ణి. మా అమ్మ నోచిన నోములు ఫలించి ఆ ట్యూషన్ టీచర్ గారిని నేను వరించడం, ఇంగ్లీషు ముక్కలు శ్రద్ధగా నేర్చుకోవడం, అయిదో తరగతికొచ్చేసరికి మిగతా కాన్వెంటు పిల్లల్తో సమానంగా ఇంగ్లీషులో పట్టు సాధించడం చూసి మా అమ్మ తెరిపిన పడింది.
నేను బాగా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మా అమ్మా, నాన్న ఇంకో రెండు కుటుంబాలతో కలిసి పూరీ, కోణార్క్ చూసి వచ్చారుట. మావాళ్ళు పుట్టిపెరిగిన ఊళ్ళలోగానీ, మా ఊరిలో గాని బొత్తిగా హిందీ వాసన కూడా లేకపోవడంతో మావాళ్ళకి అసలు హిందీ ఒక్క ముక్క కూడా తెలియదు. పాపం వాళ్ళు పూరీలోనూ, కోణార్క్ లోనూ జనాలతో వేగలేక నానా అవస్థలూ పడాల్సి వచ్చింది. అయితే వాళ్ళతోపాటూ వచ్చిన మా కుటుంబ మిత్రుల్లో ఒకళ్ళకి యూనివర్శిటీ చదువులు చదువుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళే ఒరిస్సా జనాలతో హిందీలో మాట్లాడుతూ మొత్తం అందరికీ కావలసిన ఏర్పాట్లన్నీ చూడాల్సి వచ్చింది. పాపం ఆ అనుభవంతో మనం ఊరు దాటితే ఎక్కడా పైసాకి మారం అని మా అమ్మకి భయం పట్టుకుంది. అంతేకాకుండా ఆవిడకి ముందు చూపెక్కువ. నేను అయిదో క్లాసుకొచ్చాక, ఈ వెధవ ఇప్పట్నించీ హిందీ నేర్చుకోకపోతే పెద్ద చదువులు చదివేటప్పుడో, ఉద్యోగాలు చేసేటప్పుడో ఆంధ్రా దాటితే చిల్లిగవ్వకి మారడు అని ఆలోచించి, దక్షిణ భారత హిందీ ప్రచార సభ వాళ్ళ పరిక్షలు రాయించడానికి నన్ను ఇంకొక టీచరుగారి దగ్గరకి ట్యూషన్ కి పంపడం మొదలు పెట్టింది.
అంతమందిలో నేనొక్కడినే దొరికినట్లు, వద్దన్నా వినకుండా ఫొటో ఖీచుతానంటూ వెంటపడటం మొదలెట్టాడు. జంటలుగా వచ్చిన వాళ్లనో, ఫ్యామిలీలనో చూసుకోవయ్యా బాబూ, నన్నొదిలెయ్యి అంటే వినడు. ఈ గొడవలో అనుకోకుండా తాజ్ మహల్ వైపు తలతిప్పి చూసేశాను. మొదటి సారిగా తాజ్ ని చూసినప్పుడు కలిగే అద్భుతమైన అనుభూతి గురించి చాలామంది వర్ణనలు చదివి నేనూ అటువంటి అనుభూతిని పొందాలని కష్టపడి అక్కడికొస్తే, ఈ ఫొటోగ్రాఫరుడి పుణ్యాన ఆ క్షణాన నాకే భావమూ కలగలేదు. మబ్బుల కింద, పొగమంచు తెరల వెనక తాజ్ నాలాగే దిగాలుగా కనిపించింది!
ఎంత చెప్పినా వినేలా లేడు, పట్టించుకోకుండా నాదారిన నేనెళితే వదిలేస్తాడేమో అనుకుని తాజ్ కేసి నడవటం మొదలెట్టాను. అయినా వదలకుండా నేనెటు వెళితే అటు వెంటపడి రాసాగాడు. చాలా ఛండాలంగా అనిపించింది నాకు. రోడ్డుమీద నడిచెళుతున్నప్పుడు ఊర కుక్క తోకాడిస్తూ మన వెంటబడి వస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది నా పరిస్థితి. చివరికి, ఓ ఫొటో తీయించుకుంటే నన్నొదిలేస్తాడేమో అనుకుని 'సరే కానీ' అంటూ ఓ పోజిచ్చాను. అనటమే ఆలస్యం, నేను వారించేలోగా టక టకా డజను ఫొటోలదాకా క్లిక్కుమనిపించాడు. నాకు ఒళ్లు మండిపోయింది. 'ఒకటో రెండో తీస్తావనుకుంటే అడగా పెట్టాకుండా ఇన్ని తీయటమేమిటి' అని నాదైన హిందీలో కోప్పడ్డా.
'ఫొటో యాభై రూపాయలే సాబ్. మీకదో మొత్తమా?' అన్నాడతను నన్నో పీనాసివాడిలా చూస్తూ.
'ఎంతనేది నాకనవసరం. అసలు నాకు వద్దన్నా కదా. ఇంత లావు కెమెరా ఉంది నాదగ్గర. నీ ఫోటోలెందుకు' అన్నా మరింత కోపంగా.
'కెమెరా ఉన్న ప్రతివాడూ ఫొటోగ్రాఫరేనా సాబ్' అన్నాడతను. పుండుమీద కారం అద్దినట్లనిపించింది. హిందీ అర్ధం కాకపోయినా బాగుండేది - ఆ వెటకారం తెలిసేది కాదు. గట్టిగా జవాబు చెప్పేంత హిందీ పాండిత్యం నాకు లేదు. కోపంతో మాటలు రాని పరిస్థితి.
అటుగా వెళుతున్న ఉత్తరాది జంటొకటి మా గొడవ చూసి ఆగింది. జంటలో ఉన్నతను సంగతి అర్ధం చేసుకుని ఫొటోగ్రాఫర్ మీద ఇంతెత్తున లేచాడు, 'సౌత్ వాడని మోసం చెయ్యాలని చూస్తున్నావా? నీ లైసెన్స్ రద్దు చేయిస్తా, సాలే' అంటూ. ఆ దెబ్బకి ఫొటోగ్రాఫర్ తోకముడిచి పారిపోయాడు.
ఎట్టకేలకి స్వతంత్రం! ఆ అపరిచితుడికి ధన్యవాదాలర్పించి తాజ్ దిశగా నడవటం మొదలెట్టాను, మూటలో నుండి కెమెరా తీసి ఫొటోలు తీస్తూ. అప్పటికే చీకట్లు ముసురుకుంటున్నాయి. ఫొటోలు బాగా వస్తాయన్న ఆశ లేదు. అలాంటి ల్యాండ్ స్కేప్ కి ఫ్లాష్ వాడినా ఉపయోగం లేదు - మరింత పాడవటం తప్ప.
అంతలో - నా సరంజామా చూసి నన్నో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ అనుకున్నారేమో - ఓ చైనా కుటుంబం నా ముందు నిలబడి పోజులివ్వటం మొదలెట్టింది. ఫొటోలు తీస్తానంటూ వెంటబడ్డవాడిని వదిలించుకునేసరికి ఫొటోలు తియ్యమంటూ వెంటబడేవాళ్లు తయ్యార్! నేనూ మీలాంటి టూరిస్టునే, ఫొటో స్టూడియోవాడిని కాదని ఎన్ని రకాలుగా చెప్పినా వాళ్లగోల వాళ్లదే. పైగా 'యూ తేక్ ఫోతొ, ఐ గివ్ యు ఫిఫ్తీ రూపి' అంటూ ఆఫరొకటి! డిస్నీల్యాండ్ లాంటి చోట్లా ఇలాంటి అనుభవాలెదురయ్యాయి కానీ అప్పుడవి వినోదాన్ని పంచాయి. ఇప్పుడున్న పరిస్థితిలో నన్ను విసిగించిన వాళ్లందరినీ కరిచేసేటట్లున్నాను. దాంతో, వాళ్లని కసురుకుని విసురుగా ముందుకెళ్లిపోయాను.
తాజ్ ప్రధాన కట్టడం లోకి పాదరక్షలతో వెళ్లనీయరు. వాటిని ఉంచటానికి ఒక పక్కగా స్టాల్ లాంటిది ఉంది. అక్కడో టూరిజం శాఖ ఉద్యోగి కాపలాగా ఉంటాడు. ఇది పూర్తిగా ఉచిత సర్వీసు. అక్కడా ఒక లైన్ ఉంది. లైన్లో నిలబడి ఉండగా ఓ విషయం గమనించాను - కాపలాదారు విదేశీ సందర్శకులను మాత్రమే డబ్బులు అడగటం!
నా వంతు వచ్చింది. కాపలా అతను నన్నేమీ అడగలేదు కానీ, నా వెనుకనున్న తెల్లతన్ని డబ్బుల కోసం సైగ చేశాడు. తెల్లతను విసుగ్గా చూస్తూ Why aren't you asking them? అన్నాడు, పక్కనున్న భారతీయుల్ని చూపిస్తూ. నాకు తలకొట్టేసినట్లనిపించింది. He thinks you're rich అన్నా నేను నవ్వుతూ (ఏడవలేక). I'm rich because I'm white? అన్నాడతను మరింత విసుగ్గా. పాపమతనికి నాకన్నా ఘోరమైన అనుభవాలెదురయినట్లున్నాయి.
మొత్తానికి తాజ్ లోపలికెళ్లాను. వెలుతురు పూర్తిగా పోవటంతో ఫొటోలు తీసీ ఉపయోగం లేదని ఆ కార్యక్రమానికి స్వస్తి చెప్పాను. అంత చిరాకులోనూ తాజ్ అందం నన్ను ముగ్ధుడిని చేసింది. అయితే, 'ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో' బదులు 'తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు' గుర్తొచ్చింది అక్కడున్నంతసేపూ. నా మూడ్ మహిమ!
బయటికొచ్చేసరికి బాగా చీకటిపడిపోయింది. కారు దగ్గరికి నడక మొదలు పెట్టబోయాను. అంతలో మళ్లీ ఊడిపడ్డాడు ఇందాకటి ఫొటోగ్రాఫరు. ఫొటోలకి ప్రింట్లు వేయించి సిద్ధంగా ఉన్నాడు. నాకోసం ఇంతసేపూ కాపేసినట్లున్నాడు. పన్నెండు ఫొటోలనీ కొనమని గొడవ మొదలు. 'నువ్వు చేసిన వెటకారానికి అసలు నేనేమీ తీసుకోనక్కరలేదు. నాకు నచ్చినవి రెండో మూడో మాత్రమే తీసుకుంటాను' అన్నా నేను. కాసేపు వాదులాడి చివరికి గొణుక్కుంటూ ఒప్పుకున్నాడు. ఆ గొణుగుడుకి అర్ధం 'నీలాంటి కస్టమర్లు మరో నలుగురుంటే నా చేతికి చిప్పే'. లాగిపెట్టి కొట్టాలనే కోపాన్నాపుకుని అతనికో రెండొందలిచ్చి నాలుగు ఫొటోలు తీసుకుని అక్కడినుండి బయటపడ్డాను.
తిరుగు ప్రయాణంలో ఇదంతా రాజుకి చెబితే, 'పోలీసులకి చెప్పుండాల్సింది సాబ్. టూరిస్టుల్ని విసిగిస్తున్నట్లు కంప్లైంట్ చేస్తే వాళ్లు చాలా సీరియస్ గా తీస్కుంటారు' అన్నాడతను. 'నాకేం తెలుసు బాస్. పోలీసులూ అలాగే ఉంటారనుకున్నాను' అని ఊరుకున్నా. ఆగ్రాలో ఓ మంచి ఎంపోరియం దగ్గరాగి నాలుగయిదు పాలరాతి తాజ్ మహల్ గిఫ్టు సెట్లు కొని హైవే ఎక్కాము. ఢిల్లీ చేరేసరికి రాత్రి మూడయ్యింది.
ఉపసంహారం
ఇది జరిగి ఆరు నెలలయింది. ఆ తరువాతి రోజు అక్షర్ ధాం వెళ్లాను. తిరుగు ప్రయాణానికి ఎక్కువ సమయం లేకపోవటంతో గంటకన్నా ఎక్కువ సేపు ఉండలేకపోయానక్కడ. మళ్లీ ఢిల్లీ వెళితే అక్షర్ ధాం లో ఎక్కువ సమయం గడపాలనుకున్నాను.
తాజ్ కి వెళ్లిన రోజు అంత విసుగెత్తిపోయినా తరువాత అనిపించింది - ఆ రోజంత ఘోరంగా ఉండకపోతే ఇంత వివరంగా గుర్తుండేది కాదేమో అని. నాకెదురయిన అనుభవాల వల్ల అప్పటికప్పుడు తాజ్ నన్ను మురిపించలేకపోయినా ఇప్పుడనిపిస్తుంది, వీలయితే మళ్లీ ఓ సారి వెళ్లి తాజ్ మహల్ చూడాలని. ఇప్పుడయితే దారిలో ఎన్ని వింతలెదురవుతాయో నేనూహించగలను కాబట్టి పోయినసారిలా తాజ్ నన్ను దోచుకోకపోయే ప్రసక్తి లేదు.
ఫొటోలు (కనిపించే క్రమంలో)
1. తాజ్ - మంచు తెరల వెనక
2. తాజ్ ప్రధాన మందిరం
3. లోటస్ టెంపుల్ - న్యూ ఢిల్లీ
4. అక్షర్ ధాం - న్యూ ఢిల్లీ (స్టాక్ ఫొటో)
5. అక్షర్ ధాం - న్యూ ఢిల్లీ (స్టాక్ ఫొటో)
ఈ ఐదు గంటల ప్రయాణంలో రాజు ఆసక్తికరమైన కబుర్లు చెప్పాడు. ముఖ్యంగా ట్యాక్సీవాళ్లు, రిక్షావాళ్లు నాబోటి టూరిస్టుల ముఖాలు చూడగానే వాళ్లదే ప్రాంతమో ఎలా పట్టేస్తారో సోదాహరణంగా వివరించాడు. 'మీరు చాలా సంవత్సరాలనుండి ఇండియాలో ఉండటం లేదు సాబ్' అని చెప్పాడు దానికి ఋజువుగా. 'అదెలా కనుక్కున్నావు?' అంటే 'చాలా తేలిక సాబ్. ఎన్నారైలు చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు. వాళ్లు నోరు తెరిచి మాట్లాడకపోయినా ఆ సంగతి పట్టేయొచ్చు' అన్నాడు. 'అబ్బో, మనవి అంత సాఫ్ట్ లుక్సా?' అని ఆనందపడ్డాను కాసేపు.
సరే. మొత్తానికి బండి ఆగ్రా కోట దగ్గరాగింది. దాన్ని కూడా ఎర్ర కోట అనే పిలుస్తారని అప్పుడే తెలిసింది నాకు. మన గోల్కొండ కోట లాగా ఇదీ చాలావరకూ పడిపోయి ఉంటుందనుకున్నా కానీ నా అంచనా తప్పని లోపలికెళ్లాక తెలిసింది. నిర్వహణ బాగుంది. కోటలో కొంత భాగం పునర్నిర్మాణ పనుల వల్ల మూసి వేసి ఉంది. పదవీచ్యుతుడయ్యాక షాజహానుని ఖైదు చేసిన గది చూశాను. చరిత్ర పుస్తకాల్లో చదివినప్పుడు షాజహాన్నుంచిన జైలంటే ఇరుకుగా ఉండే చిన్న గది అనుకున్నా కానీ నిజానికదో సౌధం. పుస్తకాల్లో 'షాజహాను జైలు పాలయ్యాడు' అనేకన్నా 'గృహ నిర్బంధానికి గురయ్యాడు' అంటే సరిగా ఉండేదేమో.
'గదిలోనుండి నా ముంతాజ్ మహల్ నాకు కనిపించే విధంగా ఏర్పాటు చెయ్యి' అని షాజహాను కొడుకుని వేడుకున్నట్లు, ఔరంగజేబు అలాగే ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చదివినప్పుడు నా మనసు కరుణరసంతో పొంగి పొర్లేది. కానీ ఆయన్నుంచిన జైలనబడే సౌధాన్ని చూసినప్పుడు 'హార్నీ. ఈ కవులు ఎంత బాగా డ్రమటైజ్ చేస్తారు ప్రతి విషయాన్నీ' అనిపించింది. ఆయన 'జైలు' లో దాదాపు ప్రతి చోటినుండీ వద్దన్నా తాజ్ మహల్ కనిపిస్తుంది. ఇక ప్రత్యేక ఏర్పాట్లు చేయటానికేముంది?
యమునా నదికి ఇవతలి ఒడ్డున ఎర్ర కోట, అవతలి ఒడ్డున తాజ్ మహల్ ఉన్నాయి. మామూలుగానయితే కోట నుండి నుండి తాజ్ కాంప్లెక్స్ మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆ రోజు బాగా మబ్బులు పట్టి ఉండటం, దానికి తోడు మంచు తెరలు కమ్మేసి ఉండటంతో తాజ్ లీలగా మాత్రమే కనిపించింది. 'ఇదీ ఒకందుకు మంచిదేలే, మొదటి సారి తాజ్ ని ఇంతదూరం నుండి చూడటం కన్నా దగ్గరి నుండి చూస్తే వచ్చే అనుభూతి మరింత గొప్పగా ఉంటుంది' అనుకున్నా.
ఎర్ర కోట లో మరీ ఎక్కువసేపు ఉండలేదు నేను. అప్పటికే సాయంత్రమవుతుండటంతో 'తాజ్ మూసేస్తారు. త్వరగా వచ్చేయండి' అన్న రాజు మాటలు గుర్తొచ్చి గంటలోపే కోట చూడటం ముగించేశా. అక్కడి నుండి మూడు కిమీ లోపే ఉంటుంది తాజ్. అయితే ఆగ్రా గొందుల్లోనుండి వెళ్లటానికి ఆ కాస్త దూరానికే అరగంట పట్టింది.
తాజ్ కి కిలోమీటరు ముందు నుండే మోటారు వాహనాలని నిలిపేస్తారు - వాటి కాలుష్యం వల్ల తాజ్ మసకబారిపోకుండానట. పార్కింగ్ స్థలంలో రాజు ఆగిపోయాడు, 'మీరు వెళ్లండి సాబ్. నేనిక్కడే ఉంటా' అని చెప్పి. నా బిచాణా (కెమేరా మూట, ట్రైపాడ్) అందుకుని కారు దిగగానే గుప్పున ముక్కులు బద్దలు కొట్టే దుర్వాసన! అది పక్కన పారుతున్న డ్రైనేజి వారి సమర్పణ. తాజ్ లాంటి ప్రపంచ ప్రసిద్ధ కట్టడాన్ని చూడటానికొచ్చినవారికి చందనపు అగరొత్తుల వాసనలు స్వాగతం పలుకుతాయని నేనేమీ ఆశపడలేదు కానీ మరీ ఇంత ఘోరంగా ఉంటుందనీ అనుకోలేదు.
అంతలో బిలబిలా పదిమంది రిక్షావాళ్లు చుట్టుముట్టారు. ఆ కిలోమీటరూ నడిచి వెళదామనుకున్నాను కానీ అప్పటికే ఆరు కావటంతో త్వరగా వెళ్లటానికి రిక్షా ఎక్కక తప్పలేదు. ఎక్కాక తెలిసింది నేనెంత తప్పు చేశానో.
రిక్షావాలా సగం దూరం తీసుకెళ్లి ఆగిపోయాడు. పక్కనున్న ప్రభుత్వ హ్యాండ్ లూమ్స్ ఎంపోరియం లోకెళ్లి ఏదన్నా కొనమని గోల మొదలెట్టాడు. వచ్చీ రాని హిందీలో 'వచ్చేటప్పుడు కొంటాలే బాబూ. ముందు తాజ్ కి వెళ్లిరానీ' అని ఎంత మొత్తుకున్నా వినలేదు. పైగా, 'మీరు వెళ్లకపోతే నా రిక్షా లైసెన్స్ రద్దు చేస్తారు సాబ్' అని దీనంగా మొహం పెట్టాడు. నేను షాపింగ్ చేయటానికీ అతని రిక్షా లైసెన్స్ కీ సంబంధమేమిటో నాకర్ధం కాలేదు. ఒక వంక సూర్యుడు దిగిపోయేలా ఉన్నాడు, మరోవంక మేఘాల వల్ల ఉన్న ఆ కాస్త వెలుతురు కూడా సరిగా లేదు. ఫొటోలు సరిగా రావేమో అని నా బాధ. ఆ షాపులోకెళితే వాళ్లెంత సేపు పట్టుకుంటారో, అప్పుడు ఉన్న వెలుతురు కూడా పోతుంది అని భయం. నానా తిప్పలూ పడి అదే విషయం రిక్షావాలాకి హిందీలో చెబితే 'షాపు తలుపు దాకా వెళ్లి వచ్చేయండి. లోపలకి అవసరం లేదు' అన్నాడు కన్సెషన్ ఇస్తూ.
చేసేది లేక రిక్షా దిగి ఎంపోరియం దాకా నడిచి గుమ్మం దగ్గరనుండి వెనక్కొచ్చా. అప్పుడు నాకెంత ఎంబర్రాస్మెంట్ కలిగుంటుందో ఊహించుకోండి. తీరా వెనక్కొచ్చాక అతను మళ్లీ పేచీ పెట్టాడు. ఎటూ షాపు తలుపుదాకా వెళ్లిన వాడిని లోపలికీ ఓ అడుగేస్తాననుకున్నాడేమో మరి, నేను సిగ్గు లేకుండా అక్కడినుండే వెనక్కొచ్చేసరికి అతనికి కోపమొచ్చింది. నేను లోపలికెళ్లొస్తే కానీ రిక్షా కదలదని మొండికేశాడు.
నా సహనం ఆవిరైపోయింది. ఇప్పటిదాకా వృధా అయిన సమయం చాలు, నడిచి వెళితే ఇప్పటికే తాజ్ కి వెళ్లిపోయుండేవాడిని అనుకుంటూ అతనికివ్వాల్సిన డబ్బు అతని చేతిలో పెట్టి మిగిలిన సగం దూరమూ నడిచే వెళ్లాను. 'హమ్మయ్య. వచ్చేశాను. ఇక లోపలికెళ్లటమే' అనుకోబోతుండగా ఎదురుగా పెద్ద లైను కనబడింది. తాజ్ కాంప్లెక్స్ లోపలికెళ్లటానికి సెక్యూరిటీ చెకప్ కోసం వేచి ఉన్నవాళ్ల లైనది. నేనూ ఓ టికెట్ తెచ్చుకుని లైను చివర్లో నిలబడ్డాను. వానపాములాగా కదులుతుందది. నేను లోపలికెళ్లేసరికి పూర్తిగా చీకటిపడేటట్లుంది.
నిక్కుతూ నీలుగుతూ లైనుతో పాటు సాగి ఎట్టకేలకు సెక్యూరిటీ పాయింట్ దగ్గరకొచ్చాను, నా బిచాణాని ఈడ్చుకుంటూ. మెటల్ డిటెక్టర్ టెస్టు పాసై ముందుకెళ్లాను. ఇక్కడ బ్యాగులు, పర్సులు వగైరా చెక్ చేస్తున్నారు. అదీ అయిపోతే ఇక లోపలికెళటమే. ఇక్కడ తెలిసింది నాకో బ్రహ్మాండమైన రహస్యం - క్యాలిఫోర్నియా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అమెరికా పౌరసత్వం ఉన్నట్లే అని! (చదువరీ, ఈ సంగతి ఏళ్ల తరబడి గ్రీన్ కార్డుల కోసం పడిగాపులు పడుతున్న భారతీయ సోదర సోదరీమణులకు చెప్పి బోలెడు పుణ్యం మూటగట్టుకొమ్ము)
సెక్యూరిటీ ఆఫీసర్ - కాస్త చాదస్తపు ముసలాయన లాగున్నాడు - నా పర్సు తీసి చూయించమన్నాడు. చూపించాను. తిరిగి నాకిచ్చేయబోతూ ఉండగా ఆయన దృష్టి నా డ్రైవింగ్ లైసెన్స్ మీద పడింది. క్యాలిఫోర్నియా లైసెన్సది. ఇక చూడండి ఆయన వీరంగం. 'నువ్వు అమెరికన్ సిటిజెన్ వి. ఎంచక్కా ఇరవై రూపాయలెట్టి ఎంట్రన్స్ టికెట్ కొని లోపలకి దూరిపోతావేం? ఠాట్, కుదర్దంటే కుదర్దు. వెనక్కెళ్లి ఐదొందల రూపాయలెట్టి ఫారినర్లకిచ్చే టికెట్ కొనుక్కుని మళ్లీ లైన్ చివరాకర్న నిలబడు ఫో' అని హూంకరించాడు అందరికీ వినపడేలా. లైన్లో వెనకున్నోళ్లెవరో పళ్లు బయటపెట్టినట్లనిపించింది. ఆ రోజుకి రెండో ఎంబర్రాసింగ్ మూమెంట్ ఇది.
లేని ఓపిక తెచ్చుకుని 'నేను భారతీయుడేనండీ బాబూ. నా మొహం చూస్తే తెలీటంలా? క్యాలిఫోర్నియా లైసెన్స్ ఉన్నంత మాత్రాన అమెరికన్ పౌరుడినెలా అయిపోతాను?' అని ఆంగ్లంలో లా పాయింటు తీశాను - ఇంగ్లీషు మాట్లాడితే ఆయన కాస్త తగ్గుతాడేమోనని. నా ఇంగ్లీషు ఆయనకి కాస్త కూడా అర్ధమయినట్లు లేదు. 'హిందీ మే బోల్' అని గద్దించాడు కోపంగా మొహం పెట్టి.
'చచ్చాం. ఇప్పుడు హిందీలో ఇంత పెద్ద వాక్యం ఎలా అఘోరించాలి నేను?' అనుకున్నాను. కానీ తప్పదుగా. రెండు నిమిషాలపాటు తిప్పలు పడి పది హైఁలు, పాతిక హుఁలతో ఎలాగో దాన్ని హిందీలోకి తర్జుమా చేసి చెప్పాను. 'ఐతే నీ పాస్ పోర్టు చూపించు మరి' అన్నాడాయన 'చూశారా నా తెలివి' అన్నట్లు తోటి ఆఫీసర్లకేసి ఓరచూపులు చూస్తూ.
'మళ్లీ చచ్చాం. మనదేశంలో తిరగటానికి మనకి పాస్ పోర్ట్ ఎందుకు,  ఎక్కడన్నా పోయిందంటే తలనొప్పవుతుందని ఇంట్లోనే భద్రంగా పెట్టొచ్చా. ఇప్పుడెలా? నా దేశంలోనే నా పౌరసత్వాన్ని ఋజువు చేసుకోవాల్సిన ఖర్మ పట్టటమేమిటి' అనుకుంటూ ముఖం వేలాడేశాను. ఈ భావాలన్నీ మళ్లీ హిందీలోకి తర్జుమా చేయటం మొదలెడితే తెల్లారిపోయేటట్లుంది. గొడవ ఆపేసి ఆయన చెప్పినట్లు ఐదొందల రూపాయల టికెట్ తెచ్చుకుందామంటే మళ్లీ లైన్ చివరినుండీ మొదలు పెట్టాలి. అప్పుడు నిజంగానే తెల్లారిపోతుంది. 'అసలు భారతీయులకి ఇరవై రూపాయలు, విదేశీయులకి ఐదొందల రూపాయలేమిటి? అతిధి దేవోభవ అని గప్పాలు కొట్టుకుంటూ విదేశీయులని ప్రభుత్వమే దోపిడీ చేయటమేమిటి' అనుకున్నాను.
నా ముఖాన్ని చదివినట్లున్నాడు పక్కనున్న కుర్ర ఆఫీసరొకతను. 'నే చూసుకుంటా ఇతని సంగతి' అని ఆ పెద్దాయన్ని పక్కకి పంపించి నా దగ్గరికొచ్చాడు. 'ఆయనంతేలెండి. మీరెళ్లండి త్వరగా. మళ్లీ ఆయనొచ్చేస్తాడు' అంటూ లోపలకి దారి చూపించాడు. పెద్దాయన చూడకుండా కుర్రాఫీసరు కవర్ చేస్తుండగా బతుకుజీవుడా అనుకుంటూ నా ముల్లెతో సహా పిల్లిలా లోపలకు జారుకున్నాను. ఎడమ వైపు తలతిప్పితే తాజ్ కనిపిస్తుందనుకుంటా; అందరూ అటే వెళుతున్నారు. నేనూ అటు తిరగబోయాను. ఇంతలో ఓ ఫొటోగ్రాఫర్ తగులుకున్నాడు నన్ను - మరో ఎంబర్రాసింగ్ మూమెంట్ కి తెర తీస్తూ.
(సశేషం)
ఫొటోలు (కనిపించే క్రమంలో)
1. ఆగ్రా ఎర్ర కోటలో ఓ కుఢ్య విలాసం
2. ఆగ్రా కోటపైనుండి తాజ్ వీక్షణం - పొగమంచులో
3. ఆగ్రా కోట సందర్శకులు
4. ఆగ్రాలో ఓ వీధి దుకాణం
5. తాజ్ మహల్ ప్రవేశ ద్వారం