ఈ సినిమాను నేను గత వారమే చూసాను. ఈ మధ్య హాస్యం ముసుగులో వచ్చే ద్వంద్వార్థ సంభాషణల సినిమాలనీ, సందేశం పేరుతో వచ్చే హింసాత్మక సినిమాలనీ, భక్తి పేరుతో వచ్చే అశ్లీల చిత్రాలనీ చూసి విరక్తి కలిగి కొన్నాళ్ళు తెలుగు సినిమాలనుంచీ విశ్రాంతి తీసుకొన్నాను. కానీ ఈ సినిమాకి వచ్చిన మంచి సమీక్షలు చదివి, అప్పటికీ అంతగా నమ్మకం లేకపోయినా, ఒక రాయి విసిరి చూద్దామన్న ఉద్దేశ్యంతో వెళ్ళిన నన్ను ఈ సినిమా నిరాశ పరచలేదు. పైగా చాలా కాలానికి ఒక చక్కటి కుటుంబ హాస్య కథా చిత్రాన్ని చూసిన అనుభూతి మిగిల్చింది.
ఇక కథ విషయానికి వస్తే సాదాసీదా కథే.. ఇద్దరు యువతీ యువకులు ప్రేమించుకోవడం.. ప్రియురాలు ప్రియుడి ఇంటికి అతిథిగా వచ్చి ప్రియుడి తల్లితండ్రులనీ, అతడి కుటుంబ సభ్యులనీ తన ప్రవర్తనతో ఆకట్టుకోవడం.. ఆ తరువాత ప్రియుడు ప్రియురాలి ఇంటికి వెళ్ళి ఆమె కుటుంబాన్ని నయానో, భయానో, యుక్తితోనో, పట్టుదలతోనో ఒప్పించడం వంటి కథాంశం మీద గతంలో చాలా సినిమాలే వచ్చాయి. 'మైనే ప్యార్ కియా..', 'దిల్‌వాలే..', 'నిన్నే పెళ్ళాడతా..' కాలం నుంచీ.. ఈ మధ్య వచ్చిన 'నువ్వొస్తానంటే..', 'చందమామ' వంటి సినిమాల వరకూ కొంచెం అటూ ఇటూగా ఇలాంటి కథలే.. అటువంటి మూస కథనుకూడా జనాన్ని మెప్పించగలిగేలా చిత్రీకరించడంలో స్క్రీన్‌ప్లే చాలా ఉపయోగపడింది. ముఖ్యంగా ప్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌ను కూడా హాస్య, వినోద ప్రథానంగా చిత్రీకరించడంతో చక్కని నవ్వులు పండించగలిగారు.
సినిమా ప్రథమార్థంలో వచ్చే సన్నివేశాలు రొటీన్‌గానే అనిపిస్తాయి. హీరో హీరోయిన్లు అడవిలోకి పారిపోవడం, అక్కడ ప్రేమలో పడడం వంటి సన్నివేశాలు 'క్షణక్షణం', 'గుడుంబా శంకర్' లాంటి సినిమాలను గుర్తుకు తెస్తాయి. ఇక హీరోయిన్ అమెరికా వెళ్ళిపోవాలనుకోవడం, పాస్‌పోర్ట్ వచ్చేంతవరకూ హీరో తన ఇంటిలో ఆశ్రయం కల్పించడం వంటివి 'ఒక్కడు' సినిమాను పోలి ఉన్నాయి. ఈ విధంగా ప్రథమార్థం మరీ గొప్పగా లేకున్నా, బోర్ మాత్రం కొట్టించలేదు. అడవిలో వచ్చే ఒక ఫైట్‌ను బాగా చిత్రీకరించారు.
సినిమా ద్వితీయార్థం వచ్చేసరికి వేగం పుంజుకొంటుంది. అందుకు ముఖ్యకారణంగా బ్రహ్మానందం పోషించిన 'మెక్‌డవల్ మూర్తి ' పాత్రను చెప్పుకోవాలి. ద్వితీయార్థం సగభాగం వరకూ అసలు నిజం తెలియక, జరుగుతున్న నాటకంలో తనో పావుగా వాడుకోబడుతున్నానన్న విషయం గ్రహించలేక, తనకేదో అతీంద్రీయ శక్తులున్నట్టుగా భ్రమలో బతికే సన్నివేశాలు ఒక ఎత్తయితే... అసలు విషయం గ్రహించి, మింగలేక, కక్కలేక, తను ఎంత బయటకు రావాలంటే అంతకు మరింత ఊబిలో కూరుకొని మథనపడే పాత్రలో బ్రహ్మానందం జీవించాడు. ముఖ్యంగా బ్రహ్మానందం పాత్రను 'డీ' సినిమాలోని 'చారి' పాత్రకు కొనసాగింపుగా చెప్పుకోవచ్చు. కానీ ముఖ్యమైన తేడా అల్లా 'డీ' లో అతని పాత్ర లేకున్నా కథాగమనానికి వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు, కానీ ఈ సినిమాలో అతని పాత్ర లేకుండా కథే ముందుకు నడవదు. అంతటి ముఖ్య పాత్రను అవలీలగా పోషించి తనకు తనే సాటి అని మరోసారి నిరూపించుకొన్నాడు.
ఇక ఇతర పాత్రల విషయానికి వస్తే హీరో రాం చక్కటి ఈజ్ తో నటించాడు. డ్యాన్స్‌లు, ఫైట్‌లతో పాటు చక్కటి హావభావాలను కూడా పలికించగలిగాడు. కానీ ఇతని నటనపై 'పవన్ కళ్యాణ్' ప్రభావం చాలా చోట్ల కనిపించింది. అది పోగొట్టుకొని సొంత శైలిని అలవరచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 'జెనీలియా'కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి అయిపోయినట్టున్నాయి. ఆమె మొదటి సినిమాలతో పోలిస్తే నటనలో చాలా పరిణతి సాధించినట్టే చెప్పుకోవాలి.
ఇక శాస్త్రీయ నృత్యం నేర్చుకొంటూ, ఆ క్రమంలో తన మగలక్షణాలు కోల్పోయి ఆడంగి వేషాలు వేసే పాత్రలో సునీల్, హీరో హీరోయిన్లకు లిఫ్ట్ ఇచ్చి ఆపై విలన్లకు దొరికిపోయి చివరి వరకూ వారి గొడ్లచావడిలో బందీగా పడిఉండే పాత్రలో ధర్మవరపు చక్కగా ఇమిడిపోయారు. ఫ్యాక్షనిస్టు సోదరులుగా అటు విలనీని, ఇటు హాస్యాన్ని సమపాళ్ళలో పోషించగలిగే కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి లను ఎంచుకోవడం పాత్రల ఎంపికపై దర్శకుడు పెట్టిన శ్రద్ధను చూపుతుంది. వీరి కొడుకులుగా నటించిన 'షపీ', 'రవితేజ తమ్ముడు' పాత్రలు కొంత విలనీని సృష్టించేదుకు తప్ప అంతగా ప్రాధాన్యం లేని పాత్రలు. 'చికాగో సుబ్బారావు' గా నాజర్, 'డల్లాస్ నాగేశ్వరరావు' గా తనికెళ్ళ భరణి బాగానే నటించారు.
ఈ సినిమాలో మరో హాస్య ప్రధాన పాత్ర.. జయప్రకాష్ రెడ్డి మనవడై తాతగారి అడుగుజాడల్లో నడిచి పెద్ద ఫ్యాక్షనిష్టు అయిపోవాలని బిల్డప్పులిచ్చే పిల్లవాడి పాత్ర. ఈ పిల్లవాడిని 'పంచత్రంత్రం' సినిమాలో మొట్టమొదటిగా 'హార్టులో హోళు ' ( hole in the heart ) ఉన్న మళయాళం అబ్బాయి పాత్రలో చూసినప్పుడే ఎంతో ఆకట్టుకొన్నాడు. చక్కటి టైమింగ్, హావభావాలు పలికించగలిగే ఈ పిల్లవాడు భవిష్యత్తులో మరింత పెద్ద కమెడియన్‌గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను.
ఈ విధంగా సినిమాలో ప్రతీ పాత్ర దానికై ఒక ప్రాధాన్యతను కలిగి ఉండి, అదే సమయంలో కథలో ఇమిడిపోయి, తనవంతుగా కథనాన్ని రక్తికట్టించడంలో తోడ్పడడంతో ద్వితీయార్థం మొత్తం నవ్వుల జల్లు కురిసి చక్కటి సినిమా చూసిన అనుభూతితో బయటకు వస్తాడు ప్రేక్షకుడు.
ఇక సంభాషణల విషయానికి వస్తే చాలా చోట్ల హాస్యాన్ని పండించడంలో తోడ్పడ్డాయి. చివరిలో 'వాళ్ళు మనల్ని మోసం చేయలేదు.. మనుషుల్ని చేసారు..' వంటి సెంటిమెంట్ సంభాషణలు కూడా సన్నివేశానికి అనుగుణంగా బాగున్నాయి. సంగీతం విడిగా అంత గొప్పగా లేకున్నా, సినిమాలో సందర్భానుసారంగా చూస్తే బాగున్నట్టే చెప్పాలి.
మొత్తం మీద ఒక రెండున్నరగంటల సేపు అన్నీ మరచిపోయి సరదాగా కుటుంబంతో నవ్వుకొని రావాలంటే మిస్ అవ్వకుండా తప్ప చూడాల్సిన సినిమా 'రెడీ'. మరెందుకు ఆలస్యం.. పోయి చూసి రండి..!!
కొసమెరుపు: ఇంతటి చక్కటి టాలెంట్ ఉన్న దర్శకుడు 'శ్రీను వైట్ల ', చిరంజీవి లాంటి స్టార్‌హీరోతో 'అందరివాడు ' లాంటి పరమ చెత్త సినిమాను ఎలా తీసాడో తలచుకొంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది..!!
ఈరోజు బాక్స్ పట్టుకు రాలేదు. subway కానీ, sandwich కానీ లంచ్ కి తిందాము అనుకున్నా. పన్నెండో గంట కొట్టగానే, బయటకి వచ్చా. చిన్న చినుకుతో వర్షం పడుతోంది. రోజూ ముందుగా కనపడే తోపుడు బండివాడు కనపడ్డాడు. ఆ బండి ముందు కనీసం పదిహేను మంది అనుకుంటా ఉన్నారు. రోజూ అంతే. చాలా busy గా ఉంటుంది వాడి బండి దగ్గర. నాకు ఈరోజే తెలిసింది వాడు శాఖాహారం కూడా అమ్ముతాడని. సరే ఎలా ఉంటుందో చూద్దాం అని, వెళ్ళి లైన్ లో నుంచున్నా. పావుగంటలో నా వరకూ వచ్చింది. Menu లో మొత్తం మీద మూడో నాలుగు రకాలు ఉన్నాయి. చికెన్ రైస్, చికెన్ sandwich, దాల్ (పప్పు) రైస్ లు main items. నేను దాల్ రైస్ అని చెప్పాను. Salad కావాలా అని అడిగాడు. OK అన్నాను. అప్పుడు చూసాను. వాడి బండి చిన్నదే అయినా, నాలుగు గిన్నెలలో ఉడికిన అన్నం ఉంది. ఒక పెనం మీద చికెన్ వేడెక్కుతోంది. ఒక డబ్బాలో తరిగిన cabbage, carrot, tomato ముక్కలు ఉన్నాయి. వాడికి
ఇంకొక మనిషి orders ని pack చెయ్యడానికి సహాయం చేస్తున్నాడు. దాల్ రైస్ ఒక డబ్బాలో వేసి, పక్కనే పాలకూరతో చేసిన కూరా, salad వేసి ఇచ్చాడు. మొత్తం 5$. ఆఫీస్ కి తెచ్చుకుని తిన్నాను. చాలా రుచిగా ఉంది. న్యూయార్క్ లో, Roadside బండిలో, ఇంత మంచి  శాఖాహార భోజనం దొరుకుతుందని ఎన్నడూ అనుకోలేదు. మామూలుగా అంత పట్టించుకో పోయినా, "street vendors in New York" అని Google లో వెతికాను. Manhattan లో
ఎక్కడో ఒక తమిళుడు, చాలా మంచి దోశలు వేస్తాడుట. అతని పేరు తిరు ’దోశ’ కుమార్. [2007 vendy awards] వాడి దగ్గర చాలా మంది తింటూ ఉంటారుట. ఏటా జరిగే పాటీలలో వాడికి మొదటి బహుమతి కూడా వచ్చిందిటా. ఈసారి ఆ చుట్టు పక్కల ఉంటే వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాను.
e-తెలుగు ఒక సంఘంగా ఏర్పడిన తరువాత జరిగిన మొట్టమొదటి సమావేశం ఇది!
ఈ సారి సమావేశం ఎప్పటకన్నా బిన్నముగా జరిగినది!సమయం ఇట్టేగడచిపొయినది, సమావేశం మొత్తం చాలా ఆశక్తిగా,చురుకుగా
సాగింది,కొత్తవ్యక్తుల పరిచయ కార్యక్రమాలు ముగుయగానే e-తెలుగు అధ్యక్షులు చదువరి గారు మొదటిగా సభనుప్రారంభించి e-తెలుగు గురించి వివరించారు,తరువాత పద్మనాభం గారు e-తెలుగు ఇంకా పారదర్శకముగా ఉండాలని అభిప్రాయపడ్డారు,చదువరి గారు
తెలుగు ఫాంట్లగురించి,అనువాదాలగురించి,డిక్షనరి గురించి వివరించి సభికుల అభిప్రాయాలు తేసుకున్నారు,
సి.బి.రావు గారు ఆంగ్లపద్యాల సంపుటి సభికులకు పంచారు నేను దానిపైన ఆటొగ్రాఫ్ తేసుకున్నాను.
చదువరిగారు e-తెలుగు అధికారిక వెబ్ సైట్ గా etelugu ను ప్రకటించారు!మధ్యమధ్యలొ  కొన్ని జొకులు పేలాయి,
తెలుగు బ్లాగులు e-తెలుగు లొ ఒక భాగమని అన్నారు, తెలుగు అనువాదాల గురించిన సమాచారం కొరకు తెలుగువికి లొ చూడమని వేవెన్ అన్నారు,లేఖిని,కూడలి అన్ని మనవే(e-తెలుగు) వారివే అని అన్నారు,కొత్తగా వచ్చిన కిరణ్ సభికులందరిని
ఒక ఫొటొ తేసుకుని ,తనుకూడా మాతొ  ఒక ఫొటొ దిగారు తరువాత చిన్నగా అందరం బయలు దేరాం! చిన్నగా కాసేపు పిచ్చాపాటి  మాట్లాడుకుంటూ బయలు దేరాం, ఈ సమావేశం నేను హాజరైనదానిలొ మరచిపొలేనిది!
ఇది నా అనుభవం మాత్రమే అని పాటకులు గ్రహించాలి,మేకు మరింత వివరణాత్మకమైన సమాచారం కొరకు సందర్శించండి
e-తెలుగు అధికారిక పేజి eతెలుగు
నా రేటింగ్  2.5 / 5.0
కంత్రి హిట్ టాక్ తొ ఉదయం 8 గంటలనుంచి  ప్రయత్నిస్తే  10 గంటలకు కాని బుకింగ్ దొరకలేదు!
సినిమా బాగుందని వెళ్తే ....నాకు ఒక పొకిరి కనిపించాడు!
ఆశ్చర్యపొకండి పొకిరి లొ మహేష్ బాబు ఎలాగ డైలాగులు చెబుతాడొ అలాగే చెప్పాడు!అదె పద్దతి ?మావాళ్ళు మరొ పొకిరి అంటే ఎమిటొ అనుకున్నాను ఇది సంగతి? కధ కూడా హాంకాగ్ ,ఇక్కడ గ్యాంగ్ల చుట్టూరా తిరుగుతు ఉంటుంది,కాని కధలొ కొత్తదనం ఏమిలేదు!కాని పాటలు కొంతవరకు సినిమాని నిలబెట్టాయి అని అనుకొవచ్చు, యన్.టి.ఆర్ పాటలలొ వాడిన కాస్ట్యుమ్స్ చాలా బావున్నాయి, హన్సిక  పర్లేదు ఒక మొస్తరుగా బానే చెసింది,కాని కొద్ది విడివి కల
పాత్రతొ ఉన్న ఇంకొక హేరొయిన్ మాత్రం అందాలు ఆరబొసింది ఆమె పేరు నాకు తెలియదు!!
సినిమాలొ విలన్లు ఎక్కువయ్యారు! కధ లొ పట్టులేదు.సినిమాకి ఒకరొజు ముందు మన టి.వి లలొ అదర గొట్టేశారు టివి9 వాడైతే వార్తలు ఎమిలేనట్టు పొద్దాక ఇదే స్ట్తొరే? సినిమా పబ్లిసిటికి తగ్గట్టుగాలేదు!
రూపాయి విలువ గాడిలొ పడినట్టుంది!అదే పెరుగుతుంది..గత ఐదారు నెలలుగా తగ్గుముఖం పట్టిన రూపాయి నెమ్మదిగా పెరుగుతుంది ఇక్కడ చూడండి!
ఈ రొజు ఈనాడు లొ ఏదొకొత్త తేడా కనిపించింది! ఏంటా అని మళ్ళీ తిరగేశా  చివరికి పట్టేశా ఎమి లేదు మనొడికి రంగులపిచ్హి పట్టినట్టుంది అన్ని పేజీలు రంగులతొ నింపేశాడు! కలర్ ఫొటొలు కాదులెండి శీర్షికలు మాత్రమే!!
1963 ఆగస్టు, వాషింగ్టన్‌ నగరం. లక్షలాది ప్రజలు ఒక్క నినాదంతో కదం తొక్కిన వేళ. ఒక్క గొంతుతో పౌరహక్కుల కోసం నినదించిన వేళ. అమెరికా చరిత్రలో, ప్రపంచ పౌరహక్కుల ఉద్యమ చరిత్రలోనే చిరకాలం గుర్తుండిపోÄేలా 'ఐ హావ్‌ ఏ డ్రీమ్‌' అంటూ మార్టిన్‌ లూథర్‌కింగ్‌ ఉద్వేగంగా ఉపన్యసించిన సందర్భం. అంతలో నిర్వాహకుడు మైకు ముందుకొచ్చి 'న్యూయార్కు నుంచి వచ్చిన ఈ యువకుడు ఒక గాయకుడు. ఇతని పేరు 'బాబ్‌ డిలన్‌' అంటూ జీన్స్‌, కాటన్‌ షర్టు వేసుకున్న ఒక బక్క పలచని యువకుడిని పరిచయం చేశాడు.
బాబ్‌ డిలన్‌ రాసిన పాటలు ఇప్పటికీ ప్రజాస్వామిక వాదుల హృదయాల్లో, హక్కులకోసం కదను తొక్కుతున్న ప్రజల నినాదాల్లో సజీవంగా ఉన్నాయి. కొలంబియా విశ్వవిద్యాలయం డిలన్‌కి 'పులిట్జర్‌'ని ప్రకటించి ఆ బహుమతి విలువని ద్విగుణీకృతం చేసింది.
ఆయనతో పాటు ఓ అందమైన అమ్మాయి కూడా మైకు మందుకొచ్చింది. ఆ అమ్మాయి జోన్‌బయాజ్‌. ఆమె అప్పటికే పౌర హక్కుల ఉద్యమంతో చాలా సన్నిహితంగా పనిచేస్తూ అనేక సభల్లో, ప్రదర్శనల్లో గొం తెత్తి అద్భుతంగా పాడుతున్నది. బాబ్‌ డిలన్‌ ఒకసారి గొంతు సవరించుకున్నాడు. 'ఇప్పుడు నేను పాడబోయే పాట పౌరహక్కుల ఉద్యమ నాయకుడు మెడ్గర్‌ ఎవర్స్‌ ని హత్య చేసిన హంతకుడి గురించి' అంటూ పాట ఎత్తుకున్నాడు.
'పొద వెనక నుండి పేలిన బులెట్‌
మెడ్గర్‌ ఎవర్స్‌ రక్తాన్ని రుచి చూసింది.
...అయితే వాడిని నిందించలేము
అతడు వాళ్ళ ఆటలో ఒక పావు మాత్రమే!'
అట్లా సాగిన పాట, తెల్లవాళ్ళ ఆధిపత్య వ్యవస్థ ఒక పేద తెల్లవాడికి ఎలా అబద్ధాలు చెప్పి మోసం చేస్తుందో, ఎట్లా వాడిలో తప్పుడు చైతన్యాన్ని విషంగా నింపుతోందో అద్భుతంగా విశదీకరించింది. 1941 మే 24 న అమెరికాలోని మిన్నెసోటాలో డలత్‌ పట్టణంలో ఒక సామాన్య మధ్య తరగతి యూదుల కుటుంబంలో రాబర్ట్‌ అలెన్‌ జ్మిర్మేన్‌ (డిలన్‌) పుట్టాడు. చిన్నప్పటి నుంచే సంగీతం పట్ల ముఖ్యంగా ఫోక్‌, కంట్రీ(జానపద సంగీతంలో భిన్న పాయలు)సంగీతం పట్ల మక్కువ పెంచుకున్న రాబర్ట్‌ హై స్కూల్‌ తర్వాత కాలేజీలో చేరినా చదువు మీద మనసు పెట్టలేకపోయాడు. ఫోక్‌ సంగీతంపై అమితమైన ఆసక్తితో రాబర్ట్‌ కాఫీ క్లబ్బుల్లో, ఫోక్‌ సంగీత సర్క్యూట్లలో పాటలుపాడడం ప్రారం భించాడు. అయితే మినియాపాలిస్‌ ఆయన సంగీత తృష్ణని తీర్చలేకపోయింది.
1961 జనవరిలో మంచుపడే ఒక రోజు తన సూట్కేసు సర్దుకుని జేబులో పది డాలర్లతో ఎవరి దగ్గరో లిప్టు తీసుకుని న్యూయార్క్‌ నగరాని కి బయలుదేరాడు. న్యూయార్క్‌ నగరంలోని గ్రీన్‌ విచ్‌ విలేజి చేరుకున్న రాబర్ట్‌ ముందుగా తన పేరు మార్చుకున్నాడు. తనకు ఇష్టమైనకవుల్లో ఒకరైన డిలన్‌ థామస్‌ పేరులోని మొదటి భాగం డిలన్‌ని తన చివరి పేరుగా మార్చుకున్నాడు. బాబ్‌ డిలన్‌గా అవతారమెత్తాడు. బాబ్‌డిలన్‌ చేరుకున్న సమయానికి నూయార్క్‌ గ్రీన్‌విచ్‌ విలేజి ఒక మహాద్భుతమైన ప్రదేశం. ఒక ప్రత్యామ్నాయ సాంస్క­ృతిక కేంద్రం.
అమెరికా ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొని తన పాటలను ప్రజలకు అంకితం చేసిన నిబద్ధ కవీ, సంగీతకారుడు వూడీ గథ్రీ ఒక ఆస్పత్రిలో చికిత్స పొం దుతుండటంతతో వెళ్ళి కలిశాడు బాబ్‌. అమెరికా సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న సామాజిక రాజకీయ ఉద్యమా లు, పౌరహక్కుల ఉద్యమం, ముఖ్యంగా నల్ల జాతి వాళ్లకు సమానహక్కుల కోసం సాగుతున్న బ్రహ్మాండమైన పోరాటాలు, తెల్లపాలకుల అప్రజాస్వామిక పాలన నూ, వారి యుద్ధోన్మాదాన్ని నిరసిస్తూ ఉవ్వెత్తున ఎగుస్తున్న నిరసన ప్రదర్శన జ్వాలలు, అన్ని అధికార విలువల్నీ, చట్రాల్నీ, వ్యవస్థీకృత ఆధిపత్యాన్నీ ధిక్కరిస్తూ సాంస్క­ృతిక రంగంలో ముందుకొచ్చిన ప్రత్యామ్నాయ, ప్రతికూల సాం స్క­ృతికోద్యమం- బాబ్‌డిలన్‌ని తీవ్రంగా ప్రభావితం చేశాయి.
అప్పటి దాకా తనకు తానుగా ఒకటి రెండు పాటలు మాత్రమే రాసి ఎక్కువగా ఇతరుల పాటలు పాడుతున్న బాబ్‌డిలన్‌ ( ఆయన రాసిన తొలి పాటల్లో ఒకటి వూడీ గథ్రీపై రాసింది) స్వయంగా పాటలు రాయడం ప్రారంభిం చాడు. యుద్ధ వాతావరణాన్ని, పాలకుల మృత్యుదాహాన్ని, సామాన్య ప్రజానీకంలో ఉన్న నిర్లిప్తతనూ వ్యతిరేకిస్తూ డిలన్‌ రాసిన 'బ్లోయింగ్‌ ఇన్‌ ది విండ్‌' పాట అమెరికా సంగీత ఆకాశంలో ఒక కొత్త సూర్యుడిలా ప్రజ్వలించింది. అటువంటిదే మరొకటి 'మాస్టర్స్‌ ఆఫ్‌ వార్‌'. దాని స్వేచ్ఛానుసరణ చూడండి.
యుద్ధోన్మాద పాలకుల్లారా!
తుపాకులని తయారుచేసేది మీరు-
మృత్యువిమానాలని తయారుచేసేది మీరు-
భూతాల్లాంటి బాంబులు తయారు చేసేది మీరు-
గోడలవెనుక దాక్కుంటున్నారా
అందమైన ఆఫీసు డెస్కులవెనుక దాక్కుంటున్నారా
మీకు తెలుసో లేదో
నేను మీ ముసుగులనీ చీల్చి చూడగలను!
మీరిప్పటిదాకా ఏంచేశారు
విధ్వంసం చేయడానికి నిర్మించడం తప్ప
అంటూ పాలకుల యుద్ధోన్మాదాన్ని చీల్చి చెండాడుతూ డిలన్‌ రాసిన పాట వాషింగ్టన్‌ మర ఫిరంగి పేల్చింది. ఆపాటలో చివరగా
'మీరు చచ్చిపోవాలని కోరుకుంటున్నా-
అతి తొందరగా మీకు చావు రావాలని
యెంతో ఆశపడుతున్నా!
పాలిపోయిన ఒక మధ్యాహ్నం పూట
స్మశానం దాకా నడుస్తా మీ శవపేటికల వెంట!
చూస్తా మృత్యుశయ్య మీదికి
మిమ్మల్ని దించుతుంటే
నిలబడుతా మీ సమాధివద్ద
మీరు చచ్చి పోయిండ్రని ఖరారయ్యేదాక!!'
అని డిలన్‌ రాయడం ఒక గొప్ప నిరసన జ్వాలై ఎగసింది. ఎక్కడ యుద్ధ వ్యతిరేక ప్రదర్శన అయినా, ఏ మారుమూల పౌరహక్కుల కోసం ప్రజలు కదనుతొక్కినా 'బ్లోయింగ్‌ ఇన్‌ ది విండ్‌' , 'మాస్టర్స్‌ ఆఫ్‌వార్‌ 'పాటలు ప్రజల నాలుకల మీద సామూహికం గా పలికినయి. 'ఎ హార్డ్‌ రెయిన్‌ ఈజ్‌ గోయింగ్‌ టు ఫాల్‌' పాట అతని కవిత్వంలోకెల్లా అత్యంత శక్తివంతమైంది. సెప్టెంబర్‌ 1962 లో తలెత్తిన క్యూబా సంక్షోభం, అనాటి సామాజిక స్థితిగతులూ దృష్టిలో పెట్టుకుని రాసిన ఆ పాట సమకాలీనతనూ విశ్వజనీనతనూ సంతరించుకుని మైలురాయిగా నిలిచింది.
అమెరికా ఖండాన్ని కొలంబస్‌ కనుగొన్నప్పటి నుంచి నాలుగు శతాబ్దాలపాటు తెల్లవాళ్ళు నేటివ్‌ అమెరికన్లని ఎంత దారుణంగా ఊచకోత కోశారో, ఎన్ని సంస్క­ృతులని. తెగలని, భాషలని సర్వనాశనం చేశారో చెప్పనలవి కాదు. వారిని గురించి రాస్తూ 'దేవుడు మా వైవునున్నాడు' అనే పాటలో ప్రపంచ చరిత్రలో దురాక్రమణలు చేసి, వూచకోతలు కోసిన 'వాళ్లందరి వైపునా దేవుడున్నాడు' అంటూ ఎద్దేవా చేస్తాడు డిలన్‌. 1950 అ మధ్య నుండి 1960 ల మధ్య దాకా అమెరికా లో ఫోక్‌ సంగీతం పునరుజ్జీవనం పొంది, ప్రజాస్వామిక ఉద్యమాలకు, యుద్ధవ్యతిరేకోద్యమాలకూ అత్యంత శక్తివంతమైన మాధ్యమైంది. కనెక్టికట్‌ రాష్ట్రంలోని న్యూపోర్ట్‌ పట్టణంలో ప్రతి ఏటా జరిగే ఫోక్‌ ఫెస్టివల్‌ 1962లో బాబ్‌ డిలన్‌ కొత్తగా సుడిగాలై వీచాడు.
ప్రేమ, జీవనవిషాదం, వైఫల్యం, దేశదిమ్మదితనం ఇంకా అనేకానేక అంశా ల మీద డిలన్‌ పాటలు రాశాడు. అయితే కవి అని పిలిపించుకోవడానికి ఇష్టపడలేదు. తానెప్పుడూ గాయకుడు, సంగీతకారుడిగానే అని చెప్పుకునేవాడు. తనని ఒక రాజకీయ కవిగా, గాయకుడిగా అందరూ ముద్ర వేయడం డిలన్‌కు నచ్చలేదు. ఒక ముద్ర అంటూ పడ్డాక అందరూ తన నుంచి ఎప్పుడూ అదే ఆశిస్తారని అట్లా చేయ డం తనకిష్టంలేదని బాహాటంగా చెప్పుకున్నాడు. 1963 డిసెంబర్లో అత్యవసర పౌరహక్కుల కమిటీ డిలన్‌ కు ప్రకటించిన టామ్‌ పేన్‌ అవార్డుని స్వీకరిస్తూ తనపై ఒక నిరసన కవి అనో, వామపక్ష కవి అనో ముద్రలు వేయడాన్ని వ్యతిరేకిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అందరి ఆగ్రహానికి గురయ్యాడు. తనని ఎంతో చేరదీసి, ప్రేమించి, తన పాటలకెన్నింటికో గొంతునిచ్చిన జోన్‌బయాజ్‌ని దూరం చేసుకున్నాడు.
1965 న్యూపోర్ట్‌ ఫోక్‌ ఫెస్టివల్‌లో ఎలెక్ట్రిక్‌ గిటార్‌ వాయిస్తూ పాడి, ఫోక్‌ సంగీతానికి బద్ధ విరుద్ధమైన శబ్ద కాలుష్యం సృష్టించాడు. అప్పటి దాకా తనకి ఊపిరి పోసి, ఊతాన్నిచ్చిన ఫోక్‌ సంగీతాన్ని, సాంస్క­ృతికోద్యమ మిత్రులనీ వదిలి రాక్‌ సంగీతంలోకి వెళ్ళిపోయాడు. 1966లో ఒక మోటర్‌ సైకిల్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఏడాదిన్నర పాటు సంగీత ప్రపంచానికి దూరంగా ఉన్నాడు. తర్వాత 1970లో క్రిష్టియన్‌గా పునర్జన్మ ఎత్తానని చెప్పుకుని మత సంబంధమైన పాటలు రాశాడు. మళ్ళీ 1975లో దాదాపు పన్నెండేళ్ళ తర్వాత 'హరికేన్‌' అనే ఒక నిరసన గీతాన్ని రాశాడు.
రూబిన్‌ కార్టర్‌ అనే ఒక నల్లజాతి బాక్సింగ్‌ యోధుడిని మూడు హత్య కేసుల్లో ఇరికించిన శ్వేత జాత్యంహకార ప్రభుత్వాన్ని తూర్పారబడుతూ రాసిన ఈ పాట గతంలో ఆయన రాసిన నిరసన గీతాల స్థాయిలో చాలా శక్తివంతమైంది. అనెన్‌ గిన్స్‌ బర్గ్‌, జాక్‌ ఎలియట్‌, మిక్‌ రాన్సన్‌ లాంటి అనే క మంది ప్రత్యామ్నాయ సంస్క­ృతికి చెందిన కవులు,కళాకారులతో డిలన్‌ కలిసి పనిచేశాడు. ఇప్పటికీ కళాకారుడిగా, సంగీతకారుడి గా, కవిగా పాటలు రాస్తున్నాడు, పాడుతున్నాడు, ఈ మధ్యే 'మోడర్న్‌టైమ్స్‌' అని డిలన్‌ విడుదల చేసిన పాటల సంకలనం చార్ట్స్‌ లో మొదటి స్థానంలో నిల్చింది.
అయితే అందులో పాడిన చాలా పాటలు ఆయన తొలిరోజుల్లో రాసిన నిరసన గీతాలే కావడం యాదృచ్ఛికం కాదు. ఇప్పటికే కనీసం రెండున్నర లక్షల మంది ఊచకోతకు గురయిన మారణ కాండ ఇరాక్‌లో జరుగుతున్నది. ఇరాన్‌ మీద కూడా యుద్ధం ప్రకటిస్తానని అమెరికా రంకెలు వేస్తున్నది. ఈ సందర్భంలో యుద్ధాన్ని నిరసిస్తూ, యుద్ధోన్మాద పాలకు ల చావు కోరుకుంటూ డిలన్‌ రాసిన పాటలు ఎంతో సమకాలీనంగా ధ్వనిస్తాయి. ఆయన రాసిన పాటలు ఇప్పటికీ ప్రజాస్వామిక వాదు ల హృదయాల్లో, పోరాడుతున్న, నిరసిస్తున్న, హక్కులకోసం, న్యా యం కోసం కదను తొక్కుతూ కవాతు చేస్తున్న ప్రజల నినాదాల్లో సజీవంగా ఉన్నాయి. కొలంబియా విశ్వవిద్యాలయం డిలన్‌కి ప్రతిష్ఠాత్మక పులిట్జర్‌ని బహుకరించి ఆ బహుమతి విలువని ద్విగుణీకృతం చేసింది.
(Courtesy: 14th April 2008 AndhraJyothy)
http://sakshi.com
ఈ'సాక్షి' లొ సరుకు లేదు..!
కంప్యుటర్ లొకి వైరస్ వచ్హిందా ఐతే ఫార్మ్యాట్ చేయటమే నాకుతెలిసిన సులభమైన విషయం, ఎందుకంటే ఉప్డేటెడ్ software కాని net కాని నాకు అప్పుడు అందుబాటులొ ఉండేవికావు!! నన్ను ఎవరైనా అడిగినా ఇదే సుచనచేసేవాడిని కాని ఇదిఎమంత మంచిగాపనిచేసిన ధాఖలాలు చాలాతక్కువ?కాని ఇప్పుడు నెట్టు అందుబాటులొకివచ్హింది(64కేబిపీయస్), pendrive ల పున్యమా అని మళ్ళీ virus లు ,ఏది ఒపెన్ కాదు  computer చాలా slow గా నడిచేది! చాలా ఇబ్బందిపడ్డాము! ఒకానొక దశలొ మళ్ళీ format తప్పదేమొనని అనుకున్నా ,అప్పుడే మన 'కంప్యుటర్ ఏరా' గుర్తుకువచ్హింది! నేను కొంచంపనిఉండి మాస్నేహితుడికి సుచనలు చేసి వెళ్ళాను వాడికి సరీగా కుదరలేదు,ఇక రాత్రి సుమారు 1 గంటకి అనుకుంట మళ్ళి సహాయంకొసం మొదలుపెట్టాం ! ఒక గంటలొనే పని అయిపొయింది,మాకు రవీంద్ర కాట్రగడ్డ గారు చాలాసహయపడ్డారు సుమారు ఉదయం 3 గంటలకి అనుకుంటా మా  system మళ్ళి మా ఆధీనంలొకి వచ్హింది చలాసంతొషం గానిపించింది అప్పటికప్పుడు ఎవరొవుకరు సహయంచేసేవారు! మాకు ఏతే రవీంద్ర కాట్రగడ్డ గారు సరాసరి మా computer లొకివచ్హి సరిచెసివెళ్ళరు నిజంగానే గ్రేట్ కదూ! అదీ అర్ధరాత్రి సహాయం .
ధన్యవాధములు ముఖ్యంగా శ్రీధర్ గారికి మరియూ రవీంద్ర కాట్రగడ్డ గారికి నాతరుపున మరియు నా మిత్రులతరుపున!!
ఇది http://vijaykumarkatta.blogs.com/  నా మొదటి బ్లాగు..ఎలా రాయాలొ,ఏమి రాయాలొ తెలియక వదిలివేశా..పాత ఉత్తరాలలొ దొరికింది,అప్పట్లొ స్వంత వెబ్ పేజీలమీద అభిరుచి కొద్ది తయారుచేసిన బ్లాగు ఇది!!
మొత్తానికి అబిమానం హద్దులు దాటిన మాట వాస్థవమే!!దాడి  చేసింది ఎవరు ? చేఇంచిది ఎవరు ? స్వయంగా పొలీసు స్టేషను  దగ్గరే దాడిజరిగితే పొలీసులు ఎమిపీకినట్టు ??ఇవన్ని ఒకసారిపరికిస్థే !!
మొత్తానికి ఎదొ అన్నాడు  అనుకుందాం?  అందులొ ఏమీ లేదు "రాజకీయానుబవం లేదు " అనీన్నడు ? నిజమే ఇది ఎమంత విషయం కాదు !కాని అభిమానులకి కొంచం  బాధకలిగించినమాట వాస్థమేఐనా? అందరూంటున్నమాటనే తనూ అని ఉరుకున్నా,అబిమానులు  వీడు కూడా మన నాయకుడిని అనేవాడేనా అని... కొంచం అతిజరిగిందనే మాట వాస్థవమే? ఆవిషయం  అంథటితొ పొథుందని  అంధరూ పొరపడివుంటారు ? కాని కార్లలొ కాపుకాయడమేంటి,చేజింగులు చేసి తరమడమేంటి...పొలీసు స్టేషనులొ ఎవరులేకపొవడమెంటి ??కనీసం ఉకడన్నా కాపలాకి ఉండాలావద్దా!!?అక్కడ కొట్టటం  మనొడు రక్షణకొసం నగరం అంతాతిరగటం తరువాత అంతాతెలిసిందే!! అసలు మీడియావాళ్లు అందరిదగ్గర చిరంజీవి విష్యం అడగటం ఎదైనా సందుదొరికితే  పండగచేసుకొవడం మామూలు ఏంది!
మరి అంతదిరయముగా దాడిజరగటం ...రక్షణ కొసం పిల్లలని తీసుకొని తిరగటం ..పొలీసు వాళ్ళు స్పందించినతీరు విచారైకరం !!
ఎదినా అభిమానులు అక్కడ సందుఇవ్వబట్టే ఇక్కడ వాళ్లపేరుచెప్పుకొని  దాడిజరిగింది అని అనిపిస్థుంది?
కాని ఏ దిక్కులేదు కాబట్టే రాజశేకర్ మీద దాడిజరిగింది? అదే ఏదినా పెద్దతలకాయమీద ఇలా అభిమానం పేరుమీద దాడిచెయమనడి?? ఇందులొ మాత్రం బలైంది మాత్రం రాజశేకర్ , అదీ ఎదొ వరసకి అన్న మటలవల్ల  అందరు అంటున్నారుకదా  అనిమనొడు అన్నడు పాపం?! ఏదైనా గాని  ఇక్కడ మనకు ముక్యంగా మీడియా అతి,అభిమానుల ఆవేశం,పొలీసుల వైఫల్యం వల్ల కుళ్ళు రాజకీయాలు లబ్ధిపొందగా..రాజశేఖర్ బలయాడు అన్నది వాస్థవం! చివరికి చిరంజీవి బావమరిది సమేతంగావచ్చి పలకరించటం  బగుంది ?
మీరు మరో 100 రోజుల్లో చనిపోతారని మీతో మీ వైద్యుడు చెబితే ఏం చేస్తారు? మొదట హతాశులవుతారు. తేరుకున్నాక ఏం ఆలోచిస్తారు.తీర్థ యాత్రలు, బాధ్యతల బదిలీ, కోరుకున్నవన్నీ అనుభవించే ప్రయత్నం, ఆస్థిపాస్థుల ఆరా, వాటి సంబంధించిన లావా దేవీలు, ఇష్టమైన ప్రాంతాలన్నీ తిరగడం మొదలైనవి కదూ.. ఒక పెద్ద బహుళ జాతి సంస్థకి ముఖ్య కార్యనిర్వహణాధికారి(సి.ఈ.ఓ) గా ఉద్యోగం, విలాసవంతమైన జీవితం, మంచి కుటుంబం, వెనక్కి తిరిగి చూసుకోనక్కర లేని బ్యాంక్ బ్యాలెన్స్, విదేశీ ప్రయాణాలు వగైరా.. వగైరా...ఇలా సాగిపోతున్న ఈజిన్ ఓ కెల్లీ తో అతన్ని పరీక్షించిన వైద్యుడు కూడా ఇదే మాట అన్నాడు.
నేనెంతో అదృష్టవంతుణ్ణి, నేను మరో మూడు నెలలు బ్రతికుంటానని తెలిసింది
పుస్తకం మొదటి వాక్యంతోనే మనల్ని ఆశ్చర్య చకితులను చేస్తాడు కెల్లీ.
కె.పి.ఎం.జి. (ప్రపంచ ప్రఖ్యాత అక్కౌంటింగ్ సంస్థ) సంస్థలో సి.ఈ.ఓ.గా ఉన్న కెల్లీ, తన రంగంలో తనను విజేతగా నిలిపిన నిబధ్ధత, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే చాతుర్యం, మరణం ముందు బేలగా నిలబడే పరిస్థితి రాకుండా చేశాయంటాడు. వైద్యులు కెల్లీ మరణం చాలా సహజంగా, ఏం నొప్పి, బాధ అనుభవించకుండా జరిగిపోతాయని చెప్పడంతో, ఇంతకన్న అదృష్టమేమిటని అడుగుతాడు కెల్లీ.
క్రైసిస్ మేనేజ్ మెంట్ లో భాగంగా, సంస్థ అనుకోకుండా కష్టాల్లో కూరుకుపోయిన అనేక సందర్భాల్లో, ఆ పరిస్థితి నుండి బయట పడేసిన అనుభవం, తన జీవితంలో వచ్చిన హఠాత్పరిణామాన్ని ఎదుర్కోడంలో సాయపడింది కెల్లీకి.
వైద్యులు కెల్లీకి బ్రెయిన్ క్యాన్సర్ అని నిశ్చయ పరచి, నీకు, మరణానికి మధ్య వ్యత్యాసం మూడు నెలలే అని చెప్పినప్పటి నుంచి, ఆయన తన మరణాన్ని ఆహ్వానించడానికి ఎలా సిద్ధ పడ్డాడు, చివరి 100 రోజులు ఎలా గడిపాడన్నదే చేజింగ్ డే లైట్.
కెల్లీ తమ సంస్థలో మెంటరింగ్ కార్యక్రమానికి శ్రికారం చుడతాడు. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి, ఒక్కొక్క మెంటర్ వృత్తి, ఉద్యోగాల్లో అవసరమైన సలహాలనిస్తూ వెన్ను తట్టిప్రోత్సహిస్తుంటారు.
తనను కలవడానికి వచ్చిన ఒక మితృనితో కెల్లీ ఇలా అంటాడు "చూడు, చాల మందికి ఈ అవకాశం రాదు. చాలా మంది తమ చావు సమీపించి నప్పుడు, తీవ్రమైన వ్యాధితో, నొప్పితో, ఆ నిష్రమణ చాలా బాధాకరంగా ఉంటుంది. కానీ నేనలా కాదు, ఎప్పుడొస్తుందో తెలుసు గనక, దానికోసం పూర్తిగా సిధ్ధంగా ఉంటాను. హాయిగా ఆహ్వానిస్తాను."
ప్రొద్దువాలే సమయంలో గోల్ఫ్ ఆడడం కెల్లీకి ఎంతో ఇష్టం. గోల్ఫ్ ఆటను, తన జీవితాన్ని అనేక సందర్భాల్లో పోలుస్తాడు కెల్లీ.
ఉద్యోగ జివితంలో తన విజయాలను అక్కడక్కడా ఉటంకిస్తాడు. అటువంటివాటిల్లో ఒక ఆసక్తికర సంఘటన ఇక్కడ చెప్తాను.
ఒకరోజు అర్ధరాత్రి కెల్లీకి ఫోన్ వస్తుంది. ఒక అంతర్జాతీయ బ్యాంక్ కు ఆడిటింగ్ చేసే కాంట్రాక్ట్ సంపాదించాలని. ఆ కాంట్రాక్ట్ కోసం అనేక పెద్ద పెద్ద సంస్థలు పోటీ పడుతున్నాయి.
కెల్లీ ఈ కాంట్రాక్ట్ సంపాదించాలంటే ఆ బ్యాంక్ అధ్యక్షునితో ముఖాముఖి కలిస్తే చాలు, కెల్లీ అతన్ని ఒప్పించెయ్య గలడు.
ఆయన కార్యదర్శిని సంప్రదించగా, ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నారని, మరికొన్ని నెలల వరకు ఆయన ఎవరికీ సంప్రదించేందుకు సమయం ఇవ్వగలిగే స్థితిలో లేరని తెలుస్తుంది.
వెంటనే కెల్లీ అధ్యక్షులవారి కార్యదర్శిని మరలా పలకరించి, ఆయన ప్రయాణాల గురుంచి కనుక్కుంటాడు. ఆ కార్యదర్శికి, కెల్లీతో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా ఆ బ్యాంక్ అధ్యక్షుడు రెండు రోజుల్లో సిడ్నీ నుండి, మెల్ బోర్న్ విమాన ప్రయాణం చేయబోతున్నడని తెలుసుకుని, తానూ అదే విమానానికి, ఆయన పక్క సీటు రిజర్వ్ చేయించుకుంటాడు.
విమానంలో కెల్లీని పక్క సీట్లో చూసి, అతను తనతో మాట్లాడేందుకే ఆప్రయాణం, ఆ సీటు సంపాదించాడని తెలుసుకుని బ్యాంక్ అధ్యక్షుడు ఆశ్చర్య పోతాడు. ఆ తర్వాత కెల్లీ పని చేసే సంస్థకే ఆ కాంట్రాక్ట్ రావడం తదనంతర పరిణామం.
వృత్తిలో ఇంత తెలివితేటలతో వ్యవహరించే కెల్లీ, తన మరణాని ఎలా ఆహ్వనించాడో రేపు చూద్దాం.
తన జీవితంలోని చివరి పదిహేనేళ్ళు అందరికి దూరంగా ఏకాంతించిన చండీదాస్, ఆ కాలంలో అడ్లూరు రఘురామరాజు గారికి వ్రాసిన ఉత్తరాల సంకలనం యిది. ఆయన రచనలు చదివి అభిమానులైన వారికి ఆయన వ్యక్తిగత జీవితం పట్ల, ఆ పదిహేనేళ్ళు (1990-2005) ఆయనేం చేశారన్న దాని మీద ఎన్నెన్నో ప్రశ్నలు. వాటిని పాక్షికంగా సమాధానీకరిస్తుంది 'ప్రేమతో..'
ఈ ఉత్తరాలు 1984 నుండి 2005 లో ఆయన మరణించే వరకు వాయబడ్డవి అని చెప్పబడినప్పటికీ, మూడు తప్ప మిగిలిన లేఖలన్నీ 1990 నుండి వ్రాసినవే. ఒక అభిమానిగా ఆయన వద్దకు బెరుకుగా వెళ్ళిన రాజు గారు, తర్వాత్తర్వాత "మీరు వస్తారని ఎదురుచూశానని" చండీదాస్ తో అనిపించుకునేంత గాఢమైన స్నేహం నడిపారు.
ఈ పుస్తకంలో ఉత్తరాలు, హిమోహరాగిణి (తను సంగీతించిన కొన్ని ట్యూన్లు), నిర్నిరీక్షణ, అజ్ఞాతనంతూర్మిళం (వ్రాసి చించేసిన ఒక నవల్లోనుంచి తప్పించికున్న మొదటి పేజీ), పుషింపు ('నీలి మేఘాలూ స్త్రీవాద కవితా సంపుటి సమీక్ష) ఉన్నప్పటికీ లేఖలే ప్రధాన భాగం అని చెప్పవచ్చు.
మొదటి లేఖల్లో విషయం, ఫిలాసఫీకి మాత్రమే పరిమితమైనప్పటికీ, పోను పోను తన సంగీతాభిలాష, దిన చర్య, తన బంగారు తల్లిని గూర్చిన ప్రస్తావన, తన ఆరోగ్యం, అనారోగ్యం వివిధ అంశాలపై తన ఇష్టానిష్టాలు, తీరిన, తీరని కోరికలు, రాజకీయ, కళా, సాంస్కృతిక రంగాల్లో వివిధ అంశాలపై తన క్లుప్తమైన అభిప్రాయం వెలిబుచ్చారు.
ఉత్తరాల్లో ఒక విషయం ఎత్తితే, దాని గురించి ఒకటి లేదా మహా అయితే రెండు వాక్యాలు. క్లుప్తత బాగా కనిపిస్తుంది ఈయన ఉత్తరాల్లో. అనవసరంగా పదాలు వాదవద్దని, క్లుప్తం గా ఉండమన్న ఈయన సలహాతొనే వేగుంట మోహన ప్రసాద్ తన పేరును 'మో' గా మార్చుకున్నట్లు ఒక సందర్భంలో చెప్పినట్లు గుర్తు.
ఆయన నెలకొక సారో, రెండుసార్లో తన చిన్న గది నుండి వెలుపలికి వచ్చే వారని విన్నాం. వెలుపలికి వచ్చినప్పుడు తమ కుమార్తె తో మాట్లాడటం, సంగీత క్యాసెట్లు కొనడం లేదా వైద్యుణ్ణి సంప్రదించడం. గదిలో ఉన్న సమయమంతా దాదాపు సంగీతాస్వాదనలోనే గడిపారని ఈ ఉత్తరాల ద్వారా తెలుస్తుంది. సంగీతం ఏ మాత్రం తెలీదంటూనే తనకు నచ్చిన/నచ్చని రాగాల గురించి, గాయకులు/గాయనీమణులు, వాద్య పరికరాలు, రేడియో స్టేషన్లూ, టీ.వీ. కార్యక్రమాలు  గురించి విశదీకరిస్తారు.
ఈ లేఖలు చదివితే డి.డి-1, ఆకాశవాణి కేంద్రాల్లో ఇన్ని సంగీత సంబధిత కార్యక్రమాలు వస్తున్నాయా అని అనిపిస్తుంది.
తన ఇష్టాలను చెప్పే క్రమంలో ఒక లయ ఇలా ఉంటుంది. తెలుగులో పాటలు పాడే వాళ్ళలో చిత్ర గొంతు యిష్టం, చాలా యిష్టం, చాలా చాలా యిష్టం. ఇలా ఉంటుంది. ఈ లయ నచ్చి నేను ఆ వాక్యాలను మళ్ళీ చదివాను, మళ్ళీ మళ్ళీ చదివాను.
దేవదాస్ సినిమా గురించి యిద్దరి మధ్యా పెద్ద చర్చే నడుస్తుంది. ఎన్ని భాషల్లో దేవదాస్ వచ్చిందో, వాటిల్లో దేని గొప్పతనం ఏంటో వివరిస్తారు. సినిమాలు చూడడం మానేసిన తనకు టైటానిక్ చాలా బాగా నచ్చిందని, ఆ సినిమా చూడమని సలహా ఇచ్చినందుకు రాజు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
సినిమాల్లో సిమ్రాన్ ఇష్టమని, నాలో ఏదేదో అవుతున్నది (మనసిచ్చి చూడు) లో రాశిని చూడమని, నిన్ను కోరీ వర్ణం (ఘర్షణ) చూడమని రాజు గారికి సలహా ఇచ్చారు.
ఫ్యాషన్ టీ.వీ.లో లేంజరీ, హెడ్ లైన్స్ టుడేలో ప్రజ్ఞా వర్మ, రేడియోలొ వివిధ భారతి, హిందుస్తానీ ఠుమ్రీలు, గజళ్ళు, గోదావరి, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం, క్రిస్టియానిటీ ప్రచారం, ఎన్.టీ.ఆర్. పతనం, ఇందిరా గాంధీ గొంతు, సురయ్యా, ఎం. ఎల్. వసంత కుమారి, కిశోరీ అమోంకర్, అన్వేషణలో భాను ప్రియ, గంగోత్రి పాటలు (కీరవాణి), కేశవ్ దండే బాసురి, రమా ఘోష్ గాత్రం, సాహిర్ లుధ్యాన్వి... ఇత్యాదిగా అనుక్షణికంలో పాత్రల లాగా లెక్క లేనంత మంది వ్యక్తులు, సంగీతం కలగలిసి గల గల పారుతున్న గోదారిలా ప్రవహిస్తూ ఉంటాయి.
తన డిజైర్ అండ్ లిబరేషన్ గ్రంధానికి వ్యాఖ్యానం వ్రాసే సంగతి గురించి అనేక ఉత్తరాల్లో రాజు గారికి గుర్తు చేస్తారు. ఒక ఆర్నెల్ల పాటు గోవా (అరేబియా) సముద్ర తీరంలో (టూరిస్టు ప్రాంతాలకు దూరంగా) గడపాలన్న తీరని కోరికను ప్రస్తావిస్తారు.
బాలమురళీకృష్ణ సంగీతం ఎంతో ఇష్టమని, ఈ మధ్య ఆయన సంగీతం కన్నా ఇతర విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని వ్యాఖ్యానిస్తారు.
తమిళనాడుకు చెందిన గాయత్రి గారి గాత్రం పట్ల తన అత్యంత ఇష్టాన్ని అనేక ఉత్తరాల్లో తెలియపరచారు. అనేక మార్లు వినడం వల్ల టేపు అరిగి పోతుందని నాలుగు క్యాసెట్లు కొన్నానని చెప్తారు.
హార్మోనియం చేసే గోలని విసుక్కుంటూనే, ఎక్కడ ఎలా దాని బాగా వాడవచ్చో చెప్తారు. సాక్సా ఫోన్, సాత్పూరా, సితార్, నాదస్వరం ప్రతీ వాయిద్యాన్నీ స్పృశిస్తారు.
భారతీయుణ్ణి గనక మువ్వన్నెల జెండా నాకు నచ్చుతుంది, కానీ పాకిస్తాన్ పతాకం మంచి ఈస్థటిక్ గా అనిపిస్తుంది అంటారు.
మంచి కూచిపూడి చూసి చాలా కాలమైందని బాధపడతారొక చోట. తనను మళ్ళీ వ్రాయమని అడిగే వాళ్ళకు (రాజు గారు కూడా ఒకసారి అడిగితే మౌనమే సమాధానం) తను ఇప్పుడు వ్రాయడం చెప్పులేసుకుని కూచిపూడి చేయడం లా ఉంటుంది అంటారు.
తన గదిలో సాలీణ్ణి, బల్లిని కూడా ఉత్తరాల్లో ప్రస్తావిస్తారు.
అంత్య దశ సమీపించే కొద్దీ, ఉత్తరాల ఫ్రీక్వెన్సీ పెరిగింది. పదిహేనేళ్ళపాటు నివసించిన నెం. 321, భవానీ పురంలోని ఆ గదిలోనే 2005 జనవరి 30న చివరి శ్వాస విడిచారు.
ఈ పుస్తకంలోని ఇతర భాగాలకు వస్తే, సంగీత బాణీలు నాకు తెలీవు కాబట్టి నేను చదవలేదు. అజ్ఞాతనంతూర్మిళం ఒక్క పేజీనే ఉంటుంది.
చిట్టచివరిది నీలిమేఘాలపై సమీక్ష. సమీక్షను సమీక్షించేదేముంటుంది? కాకపోతే, తన అభిమానులను ఈ పుస్తకం కొని చదవమన్నారు.
చండీదాస్ రచనలు చదివిన వాళ్ళు, ఆయన గురించి లోతుగా తెలుసుకోగోరేవారు, ఎంత కీర్తి గడించాడో అంత అపకీర్తి నీ మూట గట్టుకున్న ఈ మనిషి మనసు లోకి తొంగి చూడా లనుకునే వాళ్ళు, చదివితే.. కొంత సంతృప్తి నిచ్చి, కొత్త ప్రశ్నలు పుట్టించే పుస్తకం ఇది.
సమీక్ష రచన : విన్నకోట రవిశంకర్
శిఖామణి మొదటి పుస్తకం “మువ్వల చేతికర్ర” లో “కొయ్య కాలు” అనే కవిత ఉంది. ఈ కవితను ముందుమాటలో ప్రస్తావిస్తూ ఇస్మాయిల్ గారు ఇలా రాసారు -  "కవిత్వం కవికి కొయ్యకాలు లాంటిది. తను కోల్పోయిన దేనికో substitute. తనను తాను తలక్రిందులుగా పాతుకుంటేనేకానీ అది చిగిర్చదు."  నారాయణస్వామి రెండో పుస్తకం “సందుక” చదివినప్పుడు వెంటనే నాకీ వాక్యాలు గుర్తుకువచ్చాయి. తను కోల్పోయినదానిని కవిత్వంతో భర్తీ చేసుకునే ప్రయత్నం ఈ పుస్తకం నిండా కనిపిస్తుంది. సందుక, అర్ర, ఊరి చెరువు ఏదైనా కోల్పోవడానికి ఒక ప్రతీక మాత్రమే. స్వామి తనను తాను తలక్రిందులుగా పాతుకోకపోయినా,తన ఊరినించి తెచ్చిన “చిన్నారి మొక్క”ను తనలో తలక్రిందులుగా పాతుకున్నాడు. దాని పూల ఎరుపుదనం నెత్తురులోకి చొచ్చుకొనిపోయి, శరీరమంతా వ్యాపించింది. అది బహుశ అతని కవిత్వమే కావచ్చు.
పూర్తిగా చదవండి »