ఓ వీడియోని 9,113,536 సార్లు చూశారు. 18291 వ్యాఖ్యానాలు వ్రాశారు. 18291 సార్లు రేటింగు ఇస్తే, సుమారుగా 4/5 రేటింగు వచ్చింది ఈ వీడియోకి. ఈ నంబర్లు మన చిరు డ్యాన్సాడిన ఓ పాట వీడియోదంటే నమ్మగలరా? చిన్నప్పుడు దొంగ సినిమాను చౌడేపల్లెలో చూశా. అప్పుడు చిరంజీవి చేసిన పోరాటాలు, నృత్యాలు విపరీతంగా నచ్చేశాయి. అందులో 'గోలీమార్...మార్..మార్' అనే పాట ఒకటుంది. అప్పుడది బాగా అనిపించినా, పెద్దయ్యేసరికి అది మైఖేల్ జాక్సన్ 'థ్రిల్లర్' కాపీ అని తెలిసింది. ఈ రోజు చిరంజీవి వీడియోల కోసం వెతుకుతూంటే, 'Indian Thriller' అని ఒక వీడియో...అందులో మన చిరు బొమ్మ. ఏంటో చూద్దాం అని తెరిచా, చూస్తే, మన పాట. అలాగే క్రిందన రేటింగు, వ్యూస్, కామెంట్లు చూసేసరికి కళ్ళు తిరిగాయి. ఒక తెలుగు వీడియోకి పద్దెనిమిది వేల వ్యాఖ్యలా............................వామ్మో. ఖచితంగా 80% విదేశీయులవే అయ్యుంటాయి.
<object width='425' height='350'><param name='movie' value='http://www.youtube.com/v/LbvP7dT3Dx0'></param><param name='wmode' value='transparent'></param><embed src='http://www.youtube.com/v/LbvP7dT3Dx0&rel=0' type='application/x-shockwave-flash' wmode='transparent' width='425' height='350'></embed></object>
వ్యాఖ్యల్లో మాత్రం పాటను యేకేశారు..చండాలమైన కాపీ, భయంకరం అంటూ ఇష్టమొచ్చినట్టూ కామెంటేశారు. మచ్చుకు కొన్ని కామెంట్లు చూడండి:
That's the funniest thing I've ever seen
this is not even close to MJ's work....and thrller is supposed to be scary you guys are making it look lame...
thanks god i am not indian
hahaha!!...why the woman scare??? the woman must laugh becuase the dance steps are very ridiculous and funny,, but i really enjoy the video..
పైన వ్రాశిన కామెంట్ల కంటే క్రిందన చూపించిన జాలి భయంకరంగా ఉంది:
I still think this whole music video is some kind of joke about western music. Cause, honestly?﻿ Who makes something this bad on purpose?
పాటను తిట్టారు కానీ, చిరు డ్యాన్సు చాలా మందికే నచ్చినట్టుంది:
I love how the pounding synth music starts and he begins the shoulder action. It's so awesome. goli ma ma. i like it when he's humping the air.. at 2:19
ఒకతనికి ఇది ఎంతగా నచ్చిందంటే...తన భాష కాకపోయినా సాహిత్యాన్ని వ్రాయడానికి ప్రయత్నించాడు:
Goli maaaaaaar... goli maar!
Goli mar-mar-mar-mar-mar-mar-(mar).
Goli mar-mar-mar-mar-mar-(mar).....
Kashno rau kaugileste yenche staavooo...
Ne pali manta meste yee maltovooo.....
Kandaru padda kane shungaa.. raamaaaa...
Valkunga guda yesta vaya raamaaa...
Goli maar!
Goli.. mar-mar-mar-mar-(mar)....
Rrrrrgrrryyaaaaayaaaaa!
చూసిన చాలా మందికి, ఇంత సిల్లీ వీడియోకి ఇన్ని హిట్లు, వ్యాఖ్యలు ఎందుకో అర్థం కాక అయోమయానికి గురయ్యారు:
i cant help but wonder ..why so many views?! i have lost brain cells...ahahaha
ఇక్కడా తమిళ వాసనే :(
this is in tamil not hindi
వ్యాఖ్య వ్రాసిన జనాల్లో సగం మంది, కేరళ భామ రాధ అందానికి ఫ్లాటయిపోయారు. ఈ విషయంలో మాత్రం అందరిదీ ఏకాభిప్రాయం :)
HEY INDIAN MICHAEL JACKSON! You're girlfriend is a bumblebee...
ఇంకోడు పాటలు వ్రాయడంతో సరిపెట్టుకోకుండా ఏకంగా, పాటను ఆంగ్లంలో అనువదించే ప్రయత్నం చేశాడు :) దీనికి ఇరవై లక్షల పైన హిట్లు...పది లక్షల తిట్లు ;)
<object width='425' height='350'><param name='movie' value='http://www.youtube.com/v/TtJRNyPK-lc'></param><param name='wmode' value='transparent'></param><embed src='http://www.youtube.com/v/TtJRNyPK-lc&rel=0' type='application/x-shockwave-flash' wmode='transparent' width='425' height='350'></embed></object>
నా నార్వే స్నేహితుడు ఓ మాటన్నాడు. ఎందుకు మీ పాటల్లో విదేశీ ట్యూన్లు కాపీ కొడతరు, అనుకరించడానికి ప్రయత్నిస్తారు, మీకంటూ సొంత సంగీతం, శైలి లేదా అని. మీకంటూ సొంతంగా కళను ప్రదర్శించకపోతే ప్రపంచం మీ వైపు తిరిగి కూడా చూడదు అని.